సందిగ్ధం
బహుశ నిన్ను మరిచిపోవాలి
సరిగ్గా నేనిప్పుడు చేయాల్సిన పని అదే
నా మదిలోంచి నిన్ను చేరిపివేయాలని అనుకున్నా
నేనెట్లా మరిచిపోగలను
నువ్వు కేవలం ‘కల’వు కాదు
నువ్వు నిజం కదా
ఈ దౌర్భాగ్యపు హృదయం గురించి
ఏమని చెప్పను
అసలు ఉనికే లేని ఆ సత్సంభందాన్ని
నా హృదయం ఎప్పటికీ మరిచిపోలేక పోతున్నది
ఎప్పుడూ వ్యక్తం చేయని
ఆ ఒక్క ఆలోచన
నీతో ఎప్పుడూ చెప్పలేని
ఆ ఒక్కమాట
నీకూ నాకూ మధ్య
ఎప్పుడూ ఏర్పడని ఆ అనుబంధం
నాకన్నీ జ్ఞాపకమే
ఎప్పుడూ జరగని
ఆ విషయాలన్నీ నాకు జ్ఞాపకమే
మూలం: జావేద్ అఖ్తర్
తెలుగు: వారాల ఆనంద్

కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత
3 Comments
కొల్లూరి సోమ శంకర్
అది స్నేహమో ప్రేమో లేదా నిజమైన కలో మరిచిపోవాలంటే

కవితలా సందిగ్ధంలో మనం.
మరిచిపోలేకపోవడం మౌనం.
జ్ఞాపకాల పొరల్లో దాచడం జీవితం.
సృజన మనసును కోసినట్లుంది. మధనపడ్డ మనసుకూ చిరునామాగా ఉందీ కవితా తాత్వికత. అభినందనలు
డా.టి.రాధాకృష్ణమాచార్యులు, hyderabad
కొల్లూరి సోమ శంకర్
బ్యూటిఫుల్…అనువాదం లాగా లేదు….మీ మనసులోంచి,ఆలోచనాలలోంచి వచ్చిన పదాల్లాగా… బావుంది…




- డాక్టర్ విష్ణు వందనా దేవి , రచయిత్రి హైదరాబాద్
Siva Lakshmi
లలిత లలితంగా, మనోహరంగా ఉంది కవిత. అనువాదం కాదిది అనుసృజన!