విషయ తీవ్రతను తగ్గించేది విషాన్ని సైతం అమృతంగా మార్చేది ‘హాస్యరసం’. ఇది మనందరికీ అవసరం. ఆరోగ్యానికి హాస్యమే ఆహారం. ఆరోగ్యమే మహా సంపద. ‘సాహిత్య శ్రీ’ కొండూరి కాశీవిశ్వేశ్వరరావు గారు అందిస్తున్న హాస్యరంజని (నవ్వుల శతకం) ఆస్వాదించండి.
అమ్మ: మనది సంస్కృతి, సాంప్రదాయాలు గల దేశం. ఒరేయ్ బాబు చదువుతో పాటు, వీటిని గూర్చి కూడా తెలుసుకోవాలిరా.
బాబు: నాకు సాంప్రదాయాల గురించి బాగా తెలుసమ్మా.
అమ్మ: అయితే పేరంటం అంటే ఏమిటో చెప్పు చూద్దాం.
బాబు: స్కూలులో జరిగే పేరెంట్స్ మీటింగ్‌నే పేరంటం అంటారమ్మా!
సీతారామ్: మిమ్మల్ని కుక్క కరిచిందటగా!
అవతారం: ఔను! కరిచింది మా కుక్కే.
సీతారామ్: అయినా కుక్కకి రోజూ అన్నం మీరే పెడుతున్నారు కదా! మరి ఎందుకు కరిచింది?
అవతారం: నా ఉప్పు తింటోంది కదా! ఈ కుక్కకి అసలు నా మీద విశ్వాసం ఉందో లేదోనని మారువేషం వేసుకొని ఇంటికొచ్చాను. అంతే! కుక్క కరిచింది.
సీతారామ్: ఇంతకీ ఏ వేషం వేశారేమిటి?
అవతారం: దొంగవేషం వేశా! కుక్కకి దొరికిపోయా, అంతా నా ఖర్మ!
నాగబాబు: ఏంటిరా హఠాత్తుగా హనుమాన్ జంక్షన్‌కి మకాం మార్చేస్తున్నావంట! ఎందుకు?
హరిబాబు: జోకులు ఇంకా బాగా రాయాలంటే హనుమాన్ జంక్షన్ – జోక్స్ జంక్షన్‌గా కలిసొస్తుందని ‘వాస్తుశ్రీ’ వామనశర్మగారు చెప్పారురా!
రామయ్య: మీ అబ్బాయి మేధావి అని ఎలా చెప్పగలవు?
కృష్ణయ్య: వాడు ఒక్క నిమిషంలో గ్యాస్ సబ్సిడీ గురించి అర్థమయ్యేలా చెప్పేశాడు తెలుసా!
టీచర్: ‘ఈతగింజ ఇచ్చి, తాటిగింజ లాగుట’ అనే చమత్కారమును ఈనాటి హైటెక్‌లో ఏమంటారో చెప్పండి చూద్దాం?
ఆకాశ్: చాక్లెట్ ఇచ్చి, కట్లెట్ కొట్టేసినట్లు.
రోగనాథ్: డాక్టర్! నాకు బి.పి. ఉందా?
డాక్టర్: అసలు నీ బాడీలో రక్తమే లేదు. ఇక బి.పి. ఎక్కడిది?
అధికారి: ఇదేమిటయ్యా? ఆఫీసులో కూడా హెల్మెట్ పెట్టుకుని పని చేస్తున్నావు?
భయరాజు: ఈ పాత భవనం ఎప్పుడైనా కూలిపోవచ్చునని! పైగా రోజూ పైపెచ్చులు ఊడి పడుతున్నాయి సార్!
అనుమాన్: స్వామీ! నాకు మళ్ళీ నరకాన్ని ప్రసాదించు.
విష్ణుమూర్తి: నరక బాధలు పడలేకే కదా, స్వర్గానికి పంపించమని వేడుకున్నావు! స్వర్గం బాగుంది కదా! హాయిగా అనుభవించు.
అనుమాన్: ఈ స్వర్గంలో కష్టాలు లేనే లేవు. నాతో మాట్లాడే వాళ్లే కరువయ్యారు! నా నరకంలోనే నాకు స్వర్గముంది స్వామీ. నాకు నరకాన్ని ప్రసాదించు స్వామీ!
విష్ణుమూర్తి: అభీష్ట సిద్ధిరస్తు.
(సమాప్తం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మా బాల కథలు-17
మార్పు
మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-6
జన్మదిన కానుక
మిర్చీ తో చర్చ-14: భార్యను బాగు చేయడం ఎలా?
దేశ విభజన విషవృక్షం-8
మానస సంచరరే-65: చివరాఖరులు.. చివురులు!
జ్ఞాపకాల పందిరి-103
కవి సమ్మేళనాలలో మరి కొన్ని అనుభవాలు
మా ఊరి సంక్రాంతి
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®