Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హరునే గొలుతున్

[కార్తీకమాస సందర్భంగా మానస జ్యోతిర్లింగముల పంచలింగ శివస్మరణ కందపద్యముల ద్వారా చేస్తూ, ‘హరునేగొలుతున్’ అనే భక్తి కవితను అందిస్తున్నారు డా. జొన్నలగడ్డ మార్కండేయులు.]

1.
శిరమున గంగను చంద్రుని
ధరియించిన యా త్రినేత్రు దర్శన మెపుడున్
సురుచిర రూపము పార్వతి
యరమేనునయొఫ్పియుండ హరునే గొలుతున్

2.
జ్యోతిర్లింగము లనవి
ఖ్యాతిని పండ్రెండవి యిల కలిమిని భక్త్యా
త్మాతల పు వలపు దర్శన
యాతాయాతము లయాత్ర హరునే గొలుతున్

3.
కేదారేశా! త్ర్యంబక
నాథా!ఘృష్ణే శలింగ! నాగేశ్వరలిం
గా!ధాత్రినికాళేశ్వరు
డౌధూర్ఙటి! రామలింగ! హరునేగొలుతున్

4.
ఓంకా రలింగ మౌయీ
శుంకా శీవి శ్వనాధు శుభకర భీమే
శుంకా రుణ్యము మాదుర
హంకా రమణచు నులింగ హరునే గొలుతున్

5.
శ్రీమల్లికార్జు నిన్ శ్రీ
సోమేశ్వర నాథలింగ శోభిత శర్వున్
ఆమా వైద్యోలింగము.
యామోదజ్యోతి లింగ హరునే గొలుతున్

6.
సుమములు మారేడు దళము
కమనీయార్చన మహేశు గౌరీపతినిన్
రమణీయం బోంకారము
యమలం బుచ్ఛైస్వరమది హరునే గొలుతున్

7.
ఇహపర సుఖముల నొసగుము
మహదేవా విశ్వనాథ మహిమా న్వితలిం
గహరా! గంగాధరుడవు
యహరహ మావా రణాసి హరునే గొలుతున్

8.
అమరా ద్రాక్షా క్షీరా
కొమరా భీమవ ర ములవి కూరిమినౌక్షె
త్రములన పంచారామా
లమలై శ్వర్యమ్ములొసగు హరునే గొలుతున్
🙏

Exit mobile version