1 మే 2025న గుంటూరులో ‘ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం, గుంటూరు జిల్లా రచయితల సంఘం’ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కీ.శే.సోమేపల్లి వెంకటసుబ్బయ్య జయంతి కార్యక్రమంలో కథా రచనలో ప్రముఖ రచయిత్రి సి. యమునకు గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న కేంద్రసాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డా|| పాపినేని శివశంకర్.
చిత్రంలో మరో సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ, భూసురపల్లి వేంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్, సోమేపల్లి శ్రీవశిష్ట, కందిమళ్ళ శివప్రసాద్, ఎస్.ఎం.సుభానీ, నానా, శర్మ.సి.హెచ్ తదితరులున్నారు.