ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం మరియు గుంటూరు జిల్లా రచయితల సంఘం సంయుక్తంగా కీ.శే. సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారి జయంతి మరియు సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవం మే 1, 2025, గురువారం సాయంత్రం 5 గంటలకు గుంటూరు బ్రాడీపేటలో గల కొరటాల భవన్లో జరుగుతుంది.
ఈ సభకు చలపాక ప్రకాష్ అధ్యక్షత వహిస్తారు. డా. పాపినేని శివశంకర్ మరియు పెనుగొండ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా విచ్చేస్తారు. డా. భూసురపల్లి వెంకటేశ్వర్లు ఆత్మీయ అతిథిగా పాల్గొంటారు.
కార్యక్రమంలో భాగంగా కందిమళ్ళ శివప్రసాద్ సోమేపల్లి సాహిత్య పరిచయాన్ని, నానా సోమపల్లి వ్యక్తిత్వాన్ని గురించి తెలియజేస్తారు. సభలో గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహిత్య పురస్కారాలను ఈ సందర్భంగా ప్రదానం చేయనున్నారు. కథా పురస్కారం సి. యమునకు (రెక్కలొచ్చాయి), కవితా పురస్కారం ఖాదర్ షరీఫ్‌కు (జీవ రహస్యలిపి) అందజేయబడతాయి. ఈ కార్యక్రమాన్ని ఎస్.ఎం. సుభాని మరియు శ్రీ వశిష్ఠ సోమేపల్లి నిర్వహిస్తారు.