సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    Palagiri Viswaprasad

    ‘గ్రేట్ ఇండియన్ కాన్యన్ గండికోట’ కథ చదివాను. దీన్ని కథ అనవచ్చునా, కథా లక్షణాలున్నాయా? అనే ప్రశ్నలు పక్కన పెడదాం.
    దయ్యాలున్నాయా, లేవా?- అనే చర్చనూ పక్కన పెడదాం.
    గండికోటకు వెళ్ళేదారిలో హరిత రిసార్ట్స్ కు 2 కి.మీ. ముందు, కొన్నేళ్ళ క్రితం ఓ ప్రైవేటు రిసార్ట్ వుండేదనీ, అది అగ్నిప్రమాదంలో తగలబడి పాడుబడిన బంగళాగా మారిందనీ, ఆ ఫైర్ యాక్సిడెంట్ లో కొందరూ ఆతర్వాత ఆ పాడుబడిన బంగళాలోకి వెళ్ళిన యాత్రికులు కొందరూ చనిపోయారనీ రాసిందంతా శుద్ధ అబద్దం.
    వైయస్ హయాంలో ఇక్కడ హరిత రిసార్ట్స్ కట్టారు. రచయిత వర్ణనలో వున్నదంతా ఈ రిసార్ట్స్ కు సంబంధించినదే.
    నేను 30 యేళ్ళుగా జర్నలిజం ఫీల్ఠ్ లో
    వున్నాను. నాది జమ్మలమడుగు నియోజకవర్గంలోని యర్రగుంట్ల మండలం.
    హరిత రిసార్ట్స్ నిర్మించిన తరువాత ఓ ఐదారు సార్లు, అంతకుముందు 1990 లలో రెండుసార్లు గండికోటకు వెళ్ళిన వాన్ని. హరిత రిసార్ట్స్ లో ఒక రాత్రి మిత్రులతో గడిపిన వాన్ని. రిసార్ట్స్ ప్రహరీ గేటు రేయింబవళ్ళు తెరిచే వుంటుంది.
    నాకు తెలిసి, జమ్మలమడుగు వాసులకు తెలిసి అక్కడ ఏ ప్రైవేటు లాడ్జి ఎప్పుడూ లేదు. లాడ్జీయే లేనప్పుడు అగ్ని ప్రమాదం యెక్కడుంది. ఇప్పుడిప్పుడు అక్కడ ప్రైవేటు లాడ్జిలు, గదులు వెలుస్తున్నాయి.
    జరిగిన కథ అంటూ ఇలాంటి అబద్దాలు రాయడం, ఇక్కడికొచ్చే టూరిస్ట్ లలో భయవాతావరణం పాదు గొలపడమే. ఇది టూరిజం డెవలప్మెంట్ ను పరోక్షంగా నాశనం చేయడమే. ఎడిటర్ గారు గ్రహించగలరు.

    Reply
    1. 1.1

      Dr.. Vivekanand Rayapeddi

      జరిగిన కథ అని గాని యధార్థ సంఘటన అని గాని నేను పేర్కొనలేదు.
      నిజానికి హరిత రిసార్ట్స్ లొ మాకు ఎదురైన స్వీయ అనుభవానికి కల్పన జోడించి వ్రాయటం జరిగింది.
      జమ్మలమడుగు లొ లాడ్జి లొ దిగిన మాతో అక్కడ లాడ్జిలు లేవు అనటం వింత గా ఉంది.
      నాదైన అనుభూతి నాది గాన వ్రాసే హక్కు నాకు ఉంది.
      ఆ స్టాఫ్ గూర్చి ఒక్కడే ఉన్నట్టు వ్రాయటం, ఏకాకి గా మా ఫ్యామిలీ ఉండిపోవడం, టూరిస్టులు అందరూ మాకు ఎదురుగా వచ్చేయ్యటం, కరెంటు పోవటం, గేట్స్ తెరచుకోవడం, ఇవన్నీ మాకు వాస్తవంగా ఎదురు అయిన అనుభవాలు.
      నేను కడప గడ్డ లొ పుట్టిన వాడినే. మీకెంత హక్కు ఉందో సీమపై నాకు అంతే ఉంది.
      నేను కొన్ని విలువలు పాటిస్తూ ఆ రిసార్ట్ పేరు వ్రాయలేదు.

      Reply
      1. 1.1.1

        Palagiri Viswaprasad

        ‘కథ’ అంటే ఎలా వుండాలో, దానికి ఏ లక్షణాలుండాలో తెలియకుండా, స్వీయానుభవాన్ని కథగా మలచడమెలాగో అధ్యయనం చేయకుండా, ‘నాకు రాసే హక్కుంద’ని చెప్పే సర్వజ్ఞానులతో ఏం చర్చించగలరెవరైనా?
        రాసుకోండి. చదివిన ప్రతిదాని మీద, ప్రతి వారి మీద సమీక్షించకూడదనే జ్ఞానోదయం కలిగింది. నమస్కారాలు!

        Reply
        1. 1.1.1.1

          HVSN Prasad Rao

          సరదాగా వ్రాయబడిన ఒక ఫిక్షన్ కధకి ఇంతలేసి ఉపమానాలు అవసరమా సర్! అది ఫిక్షన్ అని తెలుస్తోంది కదా!

          Reply
          1. 1.1.1.1.1

            Dr.. Vivekanand Rayapeddi

            ధన్యవాదములు

  2. 2

    HVSN Prasad Rao

    కథ చాలా బాగుంది సర్ !
    ముందుగా తీర్థ యాత్రా సందర్శనం ! అక్కడి ప్రకృతి రమణీయత వర్ణనతో ఎంతో ఆహ్లాదకరంగా మొదలైంది సర్ కథ !

    ముఖ్యంగా వేయి నూతుల కోనకు సంబంధించి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చి ! మనసంతా ఆహ్లాదభరితమైంది !

    కథ చదువుతూ వుండగానే ! మా నాన్నగారు ఈ క్షేత్ర మహిమ గురించి వ్రాసిన నృసింహ శతకంలోని కొన్ని పద్యాల పునశ్చరణ బ్యాక్ గ్రౌండ్ లో మస్తిష్కంలో జరిగిపోయింది ! రాత్రి పూట ఈ క్షేత్రంలో అసలు జనసంచారం వుండదు ఆని మీరు ప్రస్తావించగానే !

    భక్తి నీరాజనం బీయ వత్తురేమో !
    చెలగి సప్తర్షి గణము నిశీధ మందు!
    కాక ! నడి రేయి గుడి నేల గంట మ్రోగు ?
    శ్రీమనోహర ! లక్ష్మీనృసింహ దేవా !

    అన్న పద్యం వెంటనే గుర్తొచ్చింది !

    దీంతో పాటు మా నాన్నగారి సహాధ్యాయి ! కడప BKM స్ట్రీట్ వాసి ! టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ గా చేసి ! అన్నమయ్య సాహిత్యంపై విశేష పరిశోధనలు చేసిన శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారితో గతంలో నా చర్చలు నోష్టాల్జిక్ గా గుర్తొచ్చాయి !

    ఈ కథ విశ్లేషణకు అప్రస్తుతం అయినా సందర్భోచితంగా వారిని స్మరించుకోక తప్పదు ! వారి పరిశోధనల ప్రకారం అన్నమయ్య సాహితీ ప్రస్థానం ఈ వేయి నూతుల కోన నుంచే మొదలైందట ! అన్నమయ్య ఈ క్షేత్రంలో 6 కీర్తనలు వ్రాశారని ముఖతః వారి నుంచే విన్నాను !

    ఈ క్షేత్ర విరాజితుడైన నరసింహ స్వామి వారిని ! అన్నమయ్య : “ఓగు నూతు లౌబలేశా” అని అన్నమయ్య సంబోధించారట !

    అంటే “ఓగు నూతుల అహోబలేశా” అని అర్థం ! అదే వేయి నూతుల కోన గా రూపాంతరం చెందింది అని వారి అభిప్రాయం ! గతంలో వేయి నూతులు వున్న మాట కూడా వాస్తవమే !

    ఈ క్షేత్రంలో విష్ణు పాదాలు వున్నాయని ! బ్రహ్మ కడిగిన పాదము… ! అన్న కీర్తన అన్నమయ్య ఇక్కడే వ్రాశారని ! స్థానికంగా ఒక వదంతి వుంది ! కానీ దానికి చారిత్రక ఆధారాలు లేవని కామిశెట్టి వారన్నారు ! (గత సంవత్సరం వారు కోవిడ్ బారిన పడి కేర్ హాస్పిటల్ లో కన్ను మూయడం నిజంగా పెద్ద షాకింగ్ వార్త)!

    గండి క్షేత్రంలో మళ్ళీ చిన్ననాటి జ్ఞాపకాలు ! శ్రీ జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారితో ముఖతః ఈ క్షేత్రంలో సీపీ బ్రౌన్ గారి జ్ఞాపకాలు విన్న సందర్భం గుర్తుకొచ్చింది !

    ఇక మళ్ళీ కథలోకి వెళ్తే ! ఇక్కడి నుంచి నిజంగా మైండ్ బ్లాంక్ అయ్యింది ! మీ కథనం ఎంత జోరుగా సాగిందంటే ! ఆత్రం పట్టలేక అక్షరాల వెంబడి కళ్ళు పరుగులు తీశాయి !

    ఆ కారుచీకట్లో నల్లటి తారు రోడ్డు మీద సర్రున కార్ దూసుకు పోతోంది ! లాంటి వాక్యాలు పాతకాలం నాటి డిటెక్టివ్ సాహిత్యాన్ని గుర్తుకు తెచ్చాయి !

    ఇక పాడు పడ్డ బంగళాలో కుటుంబ సభ్యుల భీతావహ అనుభవాలు గుండె లదిరేటట్టు వున్నాయి ! ప్రతి సీన్ కళ్ళకు కట్టినట్టు పాఠకుడి వూహకు చిక్కే విధంగా వర్ణించారు !

    ఫిక్షన్ స్టోరీ అని పాఠకుడికి ఒకవైపు తెలుస్తున్నా ! కథలో లీనమైనప్పుడు ఆ ఎమోషన్స్ నుంచి తప్పించుకోవడం సాధ్యం కాని విధంగా వుంది కథనం !

    మొత్తం మీద ఆదివారం పూట ఒక్క అరగంటలో తీర్థ యాత్ర ! విహార యాత్రతో పాటు ! హార్రర్ యాత్ర ! కూడా చేయించి పాఠకులను మళ్ళీ భద్రంగా వారి ఇళ్లలో దిగబెట్టారు ! 🤗

    అద్భుతమైన కథ చదివిన అనుభూతి కలిగించి నందుకు ధన్యవాదాలు సర్ !
    👏👏👏👏👏👍💐🌹

    Reply
    1. 2.1

      Dr.. Vivekanand Rayapeddi

      ప్రసాద్ రావు గారు

      హృదయపూర్వక ధన్యవాదములు.
      మీ స్పందన నాకు నూతనోతేజాన్ని, శక్తిని ఇచ్చింది.
      శ్రీ గోపాల కృష్ణమూర్తి సార్ (మీ తండ్రి గారు ) వ్రాసిన శతకం, కి. శే. కామిశెట్టి శ్రీనివాసులు గారి జ్ఞ్యాపకాలు గుర్తు చేసి మమ్మల్ని మురిపించారు.
      మీ నాన్నగారి క్లాస్ లు అటెండ్ అయ్యి లెక్కలు వినడం నా పూర్వజన్మ సుకృతం.
      మంచి అనుభూతులు గుర్తు చేసారు

      Reply
  3. 3

    Dr.. Vivekanand Rayapeddi

    స్వీయ అనుభవాల్ని కథగా ఎలా వ్రాయాలో మీరు కోర్స్ ఏదైనా నిర్వహిస్తున్నారా?
    అందుకు మీ అనుభవం, అర్హతలు ఏమిటి?
    నేను కాస్త ప్రయత్నిస్తే కథలు బాగానే వ్రాసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంతోషం.
    సీమ రచనలు అనే పేరు పెట్టుకుని తిట్లు వ్రాయటం శిల్పమా?
    కష్టాలు, కరువు, యాజమాన్యాల పట్ల ద్వేషం వ్యక్త పరుస్తూ సినికల్ గా వ్రాయటం గొప్ప కథకుల లక్షణమా?
    సరదాగా వ్రాయబడ్డ కథని, వేరే తూనిక రాళ్ళతో కొలుస్తూ, మనసులో ఎదో పెట్టుకుని రివ్యూ వ్రాయటం ఎందుకు, ఎందుకు వ్రాసామా అని పరితాపం పడటం ఎందుకు?
    నేను అసలు హరిత రిసార్ట్స్ ప్రస్తావనే తేలేదు. టూరిజం కి నా కథ కన్న మీ రివ్యూ చేసిన డామేజ్ ఎక్కువగా ఉంది.
    నేను స్వేచ్ఛయుతంగా వ్రాసే రచయితని. సరదాగా వ్రాస్తాను, లేదా మానవత్వం తట్టిలేపేలా వ్రాస్తాను. ఫలానా కళ్ళ జోళ్ళతోనే చూస్తాము , అలానే వ్రాస్తాము అనే తరహా వారికి నా రచనలు నచ్చకపోవచ్చు.
    నా తరహాలో నేను వ్రాస్తాను.
    నా రచనల వల్ల సమాజానికి మంచే జరగాలి అని వ్రాస్తాను. బహుశా నేను ఏ కోటరికి చెందని వాడిని కాబట్టి నన్ను బిగినర్ అనుకుంటున్నట్టున్నారు మీరు.

    ధన్యవాదములు

    Reply
    1. 3.1

      Palagiri Viswaprasad

      పెద్దవాళ్ళు కథ అంటే ఏమిటో, కథ శిల్పరీత్యా వస్తురీత్యా ఎలా వుండాలో కొన్ని సూత్రాలను చెప్పారు. అయితే అవి నిబంధనలు, సంకళ్ళు కావనీ వాళ్ళే చెప్పారు. సగటుకథ ఏదో, మంచికథ ఏదో, గొప్పకథ ఏదో ఎలా వుంటుందో ఉదాహరణలతో విశ్లేషించి చెప్పారు. మీరు సీనియర్లు కాబట్టి ఆ పెద్దవాళ్ళ పేర్లు, ఆ పుస్తకాల పేర్లు మీకు చెప్పాల్సిన అవసరం లేదు.
      బిగినర్, సీనియర్లు అని వేరుగా వుండరు. ఒకటి రెండు కథలు రాసి గొప్పకథలు అనిపించుకున్న వారున్నారు. వాళ్ళను బిగినర్ కాదు. కథ అంటే ఏమిటో ఔపోసన పట్టి ఆ కథ రాసుంటారు. కథానికా తత్వం పట్టుబడకుండానే నూటికి పైన కథలు రాసిన వారూ వుంటారు. వాళ్ళెప్పుడూ సాహిత్యంలో బిగినర్సే.ఇవి నా మాటలు కాదు. పేరొందిన సాహితీవిమర్శకులన్నవి.
      రాయడం మీ హక్కు కదా! రాసుకోండి. మనసులో ఏదో పెట్టుకోవడానికి మీ మొహం నేనెప్పుడూ చూడలేదు. మీరెవరో కూడా తెలియదు. ఇంతకు ముందెప్పుడూ మీతో ఇలా చర్చించిన సందర్భమూ లేదు.
      పేర్లతో వ్యక్తులతో నాకు సంబంధం లేదు. నేను ఆ కథను కథగానే విమర్శించాను. ఇప్పుడు గుర్తుపెట్టుకుంటాను. ఇక ముందు ఏ గ్రూప్ లో మీ రాతలు ఏవి కనపడినా దూరంగా వుండడానికి.
      ధన్యవాదాలు. ఇంక నా నుండి ఏ రిప్లై వుండదు.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!