Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గోలి మధు మినీ కవితలు-39

[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]

1. నీవేనా

పౌరుషం నిండిన
పదునైన కత్తి వంటి
మాటొకటి కావాలి
దేశ సౌభాగ్యాన్ని
కాలరాసే గొంతు మీద
పెట్టేందుకు..

అది నీవేనా???

~

2. మందు

ఆహారం
విద్య వైద్యం
కలుషితమయ్యాయి
మందు
తెగ అమ్ముడవుతుంది

దేశం చెట్టుకి
వేరు పురుగేదో సోకింది
ఓటు మందు వేయండి

~

3. ఒక్క చినుకు

ఓ చినుకు
ఎంతకీ రాలడం లేదు
పుడమి నిరీక్షిస్తుంది
ఆ.. ఒక్క
చినుకు కోసం

~

4. పేదరికం

విలాసవంతమైన
జీవితాన్ని మాత్రమే
చూడగలగడం

 

Exit mobile version