Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గోలి మధు మినీ కవితలు-36

[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]

1. పిచ్చి గీతలు

ఒకనాటికి
పోయేదైనా
ఒక్కరోజుతో
పోని బంధంలో
కోప తాపాల
పడగలెందుకు

అహం
గొడుగు నీడన
బతుకు చిత్రంపై
పిచ్చిగీతలు ఎందుకు?

~

2. జ్ఞానం

బుర్రకు ఎక్కించిన
జ్ఞానం
నైతికత లేని
జ్ఞానం

మనసుకు
హత్తుకున్న
జ్ఞానం
విశ్వ ప్రగతికి
సోపానం

~

3. పిడికిలి

సారం లేని నేలలో
చెట్టు ఎదుగుతుందా

అప్పుల కంచెలో
ఇల్లు బాగుంటుందా

ఋణాల ఊబిలోని దేశంలో..
నాణ్యమైన భావితరాలు
రూపొందుతాయా?

సిరాచుక్క పడిన
చూపుడు వేలు
పిడికిలి బిగించాలిక

~

4. అనిత్యం

జీవమే
రణం

మరణమే
అమృతం

Exit mobile version