ప్రజలే ప్రభుత్వం అన్నది చాలామంది ప్రజలకు తెలియదు. ప్రజలు వేరు ప్రభుత్వం వేరు అన్న పద్ధతిలో ప్రవరిస్తుంటారు. ప్రజలు లేకుండా ప్రభుత్వాల మనుగడ ఉండదని, ప్రజల సహకారం లేకుండా ప్రభుత్వాలు ప్రజలను పరిపాలించలేవన్న సంగతి చాలామంది విస్మరించి ప్రవర్తించడం చాలా విడ్డూరంగా ఉంటుంది. ఇలాంటి విషయాలకు సంబందించిన ఆలోచనల్లో ఒక్కోసారి అక్షరాస్యులకు, నిరక్షరాస్యులకు పెద్దగా తేడా వుండదు. ప్రభుత్వం అంటే అదొక ప్రజావ్యతిరేక సంస్థగా భావిస్తారు మరికొందరు.
అదే విధంగా పవర్ పాలిటిక్స్ కోసం ప్రజాధనమే ‘ఉచితాలు’ పేరుతో వృథా చేసి పేద ప్రజలను మభ్యపెట్టి పథకాలు అమలుచేసే ప్రభుత్వాలు, తమ నెత్తిన కుచ్చు టోపీ పెట్టి, వేలకోట్లలో అప్పులు చేసి, ఆ అప్పు మన మీదే రుద్దుతున్నారన్న విషయం కూడా చాలా మంది ప్రజలకు తెలియదు. వాళ్ళు తాత్కాలిక ఉచితాలకే ప్రాధాన్యం ఇస్తారు తప్ప, దేశ భవిష్యత్ ప్రయోజనాల గురించి అసలు ఆలోచించరు. ప్రజాధనం ధనం వెచ్చించి పార్టీ పేరు మీదనే ముఖ్యమంత్రి పేరు మీదనే ఉచితాలు ప్రకటించడం ఎంతవరకూ సబబు. ఇది కూడా ప్రజలు ఆలోచించడం లేదు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం అంతమాత్రమే కాదు, ప్రజల సంక్షేమం కోసం ప్రయోజనకరమైన పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు కూడా ప్రజలు సహకరించనప్పుడు ఆ సంక్షేమ పథకం ప్రజల వద్దకు చేరదు.
ముఖ్యంగా దేశ ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుటుంబ సంక్షేమం (జనాభా నియంత్రణ), క్షయ నిర్మూలన, ఎయిడ్స్ నిర్మూలన, మలేరియా నిర్మూలన, కుష్ఠు నిర్మూలన, ప్రస్తుతం కరోనా నిర్మూలన వంటి కార్యక్రమాలు అనేకం ప్రజలు తమవంతు బాధ్యతగా సహాకరిస్తే తప్ప ఆశించిన ఫలితాలు అందుకోలేము, తత్ఫలితంగా నష్టపోయేది ప్రజలే! అందుచేత ప్రజలలో చైతన్యం, ఎన్నికలలో ఓటు వేసే విధానం నుండి ప్రారంభం కావలి. దేశ భవిష్యత్తు, అభివృద్ధి, మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధుల మీదే ఆధారాపడి ఉంటుందని మరచిపోకూడదు. దేశం నాకేమి ఇచ్చింది? అన్న భావన కాకుండా, దేశానికి నేనేమి చేసానన్న విషయంలో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. ఉదాహరణకు ప్రభుత్వ ఆసుపత్రులు తీసుకుందాం. సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రులకు దిగువ మధ్యతరగతి, అంతకంటే దిగువ తరగతి వాళ్ళు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలు అందుకుంటారు, మరో మార్గం వారికి ఉండదు. ఆ పై వర్గం వారు ఎప్పుడూ ప్రభుత్వ ఆసుపత్రి ముఖం చూడరు. కానీ మేడికోలీగల్ కేసులు, పోస్ట్‌మార్టంలు తప్పని సరిగా ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరగాలి కాబట్టి, పెద్దలతో అలాంటప్పుడు సమస్యలు వస్తాయి (ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు, పత్రికా ప్రతినిధులు) వారికి అవసరం వచ్చినప్పుడు వారిస్థాయిలో వైద్య సేవలు ఆశిస్తారు. అప్పుడు ఆసుపత్రి అధికారిని ప్రశ్నిస్తారు. అదెందుకు లేదు, ఇదెందుకు లేదు అని గొడవ చేస్తారు. అంతేగాని, మామూలు సమయంలో ఆసుపత్రికి వచ్చి,ఆసుపత్రి అవసరాలేమిటో అసలు పట్టించుకోరు. ఇలాంటి విషయాలలోనే ప్రజా చైతన్యం అవసరం. ప్రభుత్వానికి ఇలాంటి విషయాలలో సహకరిస్తే, దేశాభివృద్దికోసం, దేశ సౌభాగ్యం కోసం మన పక్షాన ఎంతో కొంత చేసామన్న తృప్తి మిగులుతుంది!
ఎంతటి సున్నితమైన విషయాలలో సైతం, మన చైతన్యం, స్పందన ఎలావుండాలో నా అనుభవం ఒకటి మీ ముందు ఉంచుతాను. నేను మహబూబాబాద్ ఆసుపత్రిలో పని చేస్తున్నప్పుడే (1982-1994) నాకు పెళ్ళి కావడం, ఒకరి తర్వాత మరొకరుగా ఇద్దరు పిల్లలు పుట్టడం జరిగింది. మా బాబు (రాహుల్) మొదటి సంతానం. పాప (నిహార) రెండవ సంతానం. పాప పుట్టిన వెంటనే మా పెద్దన్నయ్య (స్వర్గీయ కె.కె. మీనన్) నుండి ఒక ఉత్తరం (కార్డు) వచ్చింది.
వేసెక్టమీ గురించి హెచ్చరిక చేసిన పెద్దన్నయ్య, స్వర్గీయ కె.కె.మీనన్ (కథ/నవల,రచయిత)
అది ఒక ముఖ్యమైన వార్త మోసుకు వచ్చింది. అప్పట్లో ఇంకా మొబైల్స్ రంగంలోనికి దిగలేదు. ల్యాండ్‌లైన్ ఫోన్ కూడా అప్పటికి నేను స్వంతం చేసుకోలేదు. అందువల్ల అన్నయ్య ఉత్తరం రాసాడు. దాని సారాంశం ఏమిటంటే నాకు కూతురు పుట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ‘నీ పిల్లల్ని పెంచుకోగల స్తొమత నీకు వుండొచ్చుగానీ, గంపెడు పిల్లల్ని కంటే, భరించే శక్తి ప్రభుత్వానికి లేదు. అందుచేత తక్షణమే ‘వేసెక్టమీ’ ఆపరేషన్ చేయించుకో’మన్నది ఆయన సూచన. ఆ ఉత్తరం ముందుపెట్టుకుని పదే పదే ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేసాను. అప్పుడు ఆసుపత్రి హెడ్‌గా (డిప్యూటీ సివిల్ సర్జన్) డా. ఎస్. వెంకటేశం గారు ఉండేవారు. ఆపరేషన్ థియేటర్ ఇన్‌ఛార్జ్‌గా నర్స్ కుసుమ కుమారి ఉండేవారు. విషయం డా. వెంకటేశం గారికి వివరించాను.
ఆపరేషన్ చేసిన స్వర్గీయ డా.ఎస్. వెంకటేశం గారు (హైదరాబాద్)
ఆపరేషన్ థియేటర్ ఇన్చార్జ్ నర్స్ కుమారి.కుసుమ కుమారి (రిటైర్డ్ హెడ్ నర్స్, ఒంగోలు)
ఒక శుభోదయాన డాక్టర్ గారు నాకు ‘వేసెక్టమీ’ ఆపరేషన్ చేసేసారు. వారం రోజుల వరకూ నా శ్రీమతికి గానీ, ఇతర బంధువులు/స్నేహితులకు గానీ ఈ విషయం చెప్పలేదు. ఆపరేషన్ తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించినా, నేను సెలవు తీసుకోకుండా ఆసుపత్రి డ్యూటీకి వెళ్ళిపోయాను. అందుచేత ఎవరికీ తెలిసే అవకాశం లేదు.
శ్రీమతి, శ్రీ డా. కె.ఎల్.వి. ప్రసాద్
వారం రోజుల తర్వాత కూల్‌గా నా శ్రీమతికి వివరించి ఒప్పించగలిగాను. అయితే మా అత్తగారు (అక్క) పెద్ద గొడవ చేసింది, చెప్పకుండా ఆ పని చేసినందుకు. ఇంకొక సంతానం కోసం చూడవలసింది అంది.
రచయిత ఇద్దరు పిల్లలు రాహుల్ (అమెరికా), నిహార (హన్మకొండ)
నేను అప్పుడు ఒకటే మాట చెప్పాను “పిల్లల్ని పెంచవలసింది నేను. ఉన్న ఇద్దరినీ ప్రయోజకులిని చేయగలిగితే చాలు” అని. తర్వాత ఆ గొడవ క్రమంగా చల్లారి పోయింది. ఇక్కడ నేనేదో గొప్ప పని చేశానని గొప్పలు చెప్పుకోవడం కాదు. నా శ్రమను తగ్గించుకోవడమే గాక, ప్రభుత్వానికి నావల్ల అదనపు భారం లేకుండా చేశానన్న తృప్తి నాకు మిగిలింది. అంత మాత్రమే కాదు నేను ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించినంత కాలం, వేసెక్టమీ చేయించుకున్నందుకు గాను ప్రత్యేక ఇంక్రిమెంట్ అనుభవించాను. ఈ సదుపాయం నిరుద్యోగులకు లేకపోవడం బాధాకరం. ఇది ప్రభుత్వం ఆలోచించదగ్గ విషయం!
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు. —డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్ హన్మకొండ.
గంపెడు సంతానాన్ని పోషించగలమనే దైర్యం ఆనాటి పెద్దలది, ప్రభుత్వ ఇబ్బందిని వాళ్ళు గమనించే పరిస్ధితుల్లో లేరు. ఇంటినిండా కుటుంబం ఉండాలనే ఉత్సాహం ఆనాటిది. ఇక మీ వంతు వచ్చేనాటికే ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుటుంభనియంత్రణ మీలాంటి విద్యావంతుల మూలంగ కొంత ప్రయోజనం ఇచ్చిందనే చెప్పాలి. అయితే అది క్రిందిస్దాయి ప్రజలవరకు అవగాహనలేకపోవడం, మీరన్నట్లు మీరు అనుభవించిన ప్రత్యేక ఇంక్రిమెంట్ వంటి సదుపాయాలు కొరవడడమే. నేటి జనాభా నిరంతర పెరుగుదల. మంచి అవగాహనకల్పించే రచనను అందించినందుకు మీకు ధన్యవాదములు సర్
సాగర్ నువ్వు ఎప్పుడూ ముందు వరుసలో నే వుంటావు అన్నింటి లో. ఇక్కడ కూడా నీ ప్రథమ స్పందన కు ధన్యవాదాలు.
ఈ కాలంలో మీ అన్నగారి లాగా మార్గదర్శనం చేసే వారు తక్కువ, చేసిన ఆలోచించి, ఆచరించేవారు తక్కువ 🙏🎉🙏 —–డాక్టర్ జానకి రామశాస్త్రి కరీంనగర్.
ధన్యవాదాలు డాక్టర్. శాస్త్రి గారు.
, ప్రజా శ్రేయస్సులోనే… ప్రభుత్వ మనుగడ… ! ప్రభుత్వానికి సహకరించటం లోనే…. ప్రజాశ్రేయస్సు… !! ఒకప్పుడు ప్రలోభ పెట్టి… బలవంతంగానైనా… కుటుంబ నియంత్రణ కొనసాగింది ! నేడు దానియొక్క ఆవశ్య కతను గుర్తించి… ప్రజలే స్వచ్ఛందంగా…ఇద్దరుపిల్లలతో సరిపెట్టుకుంటున్నారు… ! విషయాన్ని మీ అనుభవా నికి జోడించిమరీ చక్కగా చెప్పారు! –కోరాడ. నరసింహారావు విశాఖ పట్నం.
కోరాడ వారూ కృతజ్ఞతలు
Gd mng Doctor garu, Memoo Inddarm maaku iddare. —-surya narayana rao Hyderabad.
Thank you sir.
86వ సంచిక చదివినాను.ప్రభుత్వ ఉచితాల పట్ల మీ అభిప్రాయం సరైనదే కాని ప్రజా సంక్షేమంకంటే ఎక్కూవగ పాలకులకు తమదైన ఓట్లు సంపాదించటం పైన దృష్టి ఉన్నది..ఉచితాల వెనుక ఉన్న ఆలోచనా ధోరణిలోనే పొరపాటున్నది. మిగిలిన విషయం మీ చక్కని ముందుచూపుకూ నిబద్ధథకూ నిదర్శనం.
——రామశాస్త్రి
మీ స్పందన కు ధన్యవాదాలండీ శాస్త్రి గారు.
సంఘం పట్ల బాధ్యత దేశం మీద ప్రేమ ఎలా ఉండాలో డాక్టర్ కె. ఎల్. వి గారు చక్కగా చెప్పారు. చాలా మంది పెద్దవాళ్ళు సుభాషితాలు చెబుతూ ఉంటారు కానీ వాటిని ఆచరించడం చాలా తక్కువ. ముఖ్యంగా మన దేశంలో పెద్ద పెద్ద నాయకులకి పెద్ద పెద్ద కుటుంబాలు గంపెడు పిల్లలు ఉన్నారు. కుటుంబంలో పెద్ద వాళ్లు చెప్పిన ఏ విషయం కూడా మనకు హాని చేకూర్చేదిగా ఉండదు కానీ చాలామందికి ఆ విషయం తెలియక వాటిని పాటించడం చాలా తక్కువ. ఒక చిన్న ఉత్తరంలో ఇచ్చినా సలహాలు పాటించి దానికనుగుణంగా తన జీవితాన్ని సుఖమయం చేసుకున్నా రచయిత చాలా గొప్ప వారి కిందికి లెక్క. ప్రపంచంలో మరియు దేశంలో మారుతున్న జీవితాలకు అనుగుణంగా మనం కూడా మారినప్పుడే మనకు ఎదుగుదల అనేది ఉంటుంది. ఏ విషయాన్ని అయినా ప్రతిభావంతంగా రాయగలిగే నేర్పు రచయిత గారికి ఉంది వారికి నా అభినందనలు
.
మిత్రమా నీ విశ్లేషణ బాగుంది నీ స్పందన అర్థ వంతంగా వుంది. కృతజ్ఞతలు నీకు.
జ్ఞాపకాల పందిరి 86 లో ప్రభుత్వ పథకాల గురించి తెలిపారు. ఏదైనా ఇప్పటి ప్రభుత్వాలు ఉచితాలను ఇష్టం వచ్చినట్లుగా ప్రకటించి ప్రజలను సోమరిపోతులుగా మారుస్తున్నారు. ఈ పద్ధతి మారితే మంచిది. —–జి.శ్రీనివాసాచారి కాజీపేట.
ధన్యవాదాలండీ.
జ్ఞాపకాల పందిరి 86 ఎపిసోడ్ మేమిద్దరం..!మాకిద్దరు..!!.ఆసక్తిగా సాగింది.మీ అన్నయ్య గారు ఉత్తరంలో ఇచ్చిన సలహాలు, సూచనలను ముందుచూపుతో స్వీకరించి,ఆచరించి మనం మారినప్పుడే మనకు ఎదుగుదల ఉంటుంది ఒక మంచి సందేశాన్ని అందించారు.ధన్యవాదములు సర్.
భుజంగరావు గారూ మీ స్పందనకు ధన్యవాదాలు సర్.
ఒక చిన్ని ఉత్తరం మి మనస్సును ఆలోచింప చేసింది అంటే,మి మనస్సును ఆలోచింపచేసే పవర్ ఉంది ,ఇంకా ఇంకా అంత గౌరవంగ ఆచరించిన మికు అభివందనాలు. —డి.చంద్ర శేఖర్ హైదరాబాద్.
శేఖర్ నీ స్పందన కు ధన్యవాదాలు.
చాలా మంచి పని చేశారు. మనకు స్తోమత ఉన్నా, దేశ శ్రేయస్సు కోసం ఆలోచించటం హర్షణీయం. అందులో మీకు ఆడ పిల్ల, మగ పిల్ల వాడు. ఇంక హేసిటేషన్ లేకుండా నిర్ణయం తీసుకున్నారు! సంతోషం రాజేంద్ర ప్రసాద్
ధన్యవాదాలండీ రాజేంద్ర ప్రసాద్ గారు.
Prasad Garu! Samakaaleena raajakeeyaala gurinchi vivaristhoo Mee anubhavaalanu chaalaa chakkagaa vraashaaru …. Dhanyavaadaalandi 🙏
https://sanchika.com/gnapakala-pandiri-86/ మంచి కథ. ముందు చూపు స్పష్టత అద్భుతం .కధ గా మలచడం బాగుంది సార్ 💐 —డా.డి.సుజాత విజయవాడ.
అమ్మా మీ స్పందనకు ధన్యవాదాలు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఐశ్వర్య రహస్యం-6
2022 ఉగాది కవిసమ్మేళనం ప్రెస్ నోట్
వర్షం కురిసిన రాత్రి
మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-11
పుస్తకంతో పుస్తకాలకు జీవం – పరభాషా రచయితల వ్యూహం!
డాక్టర్ అన్నా బి.యస్.యస్.-9
తెల్లారింది
దయారణ్యం!!
అంతరాత్మ తీర్పు
నూతన పదసంచిక-82
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®