సంచికలో తాజాగా

Related Articles

47 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —–డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

  2. 2

    Sagar

    జీవితంలో సహాయం పొందడమే కాదు అలాంటి సహాయానికి కారణభూతులైన వారిని గుర్తుపెట్టుకోవడమూ గొప్ప విషయమే .అందుకు సరైన ఉదాహరణ మీ రచనలు. అలాంటి స్నేహితులను పొందిన మీకు అభినందనలు మరియు మంచి విషయాలను అందిస్తున్నందుకు ధన్యవాదములు సర్

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందన కు ధన్యవాదాలు.

  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Meeru chaalaa lucky. Atuvanti snehithulu chaalaa arudu. Avassram lanappudu chese goppa sahayam కంటే avasarsmainsppudu chese chinna melu entho goppadi.. Eesari maa tharapuna kuda athaniki best wishes cheppandi. Manchi experiencetho mng prarambhinpachesaru
    . Thank you
    Mrs.Leela shyam kumar
    Nizamabad.

  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    లీల గారు
    మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    👌 …….

    బాలాజీ గారికి 👏 ….

    Friendship పై జ్ఞాపకాలు కాబట్టి వెంటనే connect అయిపోయాను …

    స్కూల్ ఫ్రెండ్స్ …
    డిగ్రీ ఫ్రెండ్స్ …
    D.ed ఫ్రెండ్స్ …
    లోకల్ ఫ్రెండ్స్ ….

    ఫామిలీ తో సహా గట్టి అనుబంధం ఉన్నవారు 10 మంది ….
    నా బలం , బలహీనత వారే ….

    ఒక సినీ కవి చెప్పినట్టు

    *స్నేహానికన్న మిన్న లోకాన లేదురా ….*
    —-శ్రీ ధర్ రెడ్డి
    హన్మకొండ.

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      బాబూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బాలాజీ లాంటి వ్యక్తులు అరుదు. కానీ, అటువంటి వ్యక్తులవల్లనే “మంచి” సువాసనను ఇంకా ఆఘ్రాణించ గలుగుతున్నాము. అది వారి DNA. ఒక వాక్యం గుర్తుకొస్తున్నది….”ఎవరన్నారు ఈ సమాజం బాగుపడదని…..చచ్చు దద్దమ్మలు తప్ప”. అవతలివారు ఎవరన్నది చూడకుండా సహాయం చేస్తూ పోతే, అది బూమ్ రాంగ్ అయ్యి అవసరమైన టైములో మనకి అక్కరకు వస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలీదు….
    —మారుతీ కిరణ్
    హైదరాబాద్.

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మారుతీ గారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  7. 7

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి చదువుతుంటే మీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారో అర్థం కావడంలేదు.వారి గురించి చెబుతున్న విషయాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి.రాజబాబు గారి ద్వారా పరిచయం అయిన బాలాజీ చెన్నై గారు అభినందనీయుడు.ప్రాంతాలకు అతీతంగా పరిచయమైన వ్యక్తులు అంతలా స్నేహితులైన వారిని గుర్తు చేసుకోవడం,ఇరుగు పొరుగు వారితో స్నేహం,ఏ సమయంలో దేనికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యాన్ని దానికి ఇస్తారు.ఏదైనా సమస్య వచ్చినపుడు మద్దతుగా నిలవడానికి ఎంతో మంది స్నేహితులుగా ఉన్నారు మీరు చాలా అదృష్టవంతులు సర్.మంచి అనుభవాలు అందిస్తున్న మీకు ధన్యవాదములు.

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  8. 8

    డి. వి. శేషాచార్య

    మైత్రి లోని మాధుర్యం చెప్పడానికి మాటలు చాలవు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మన హితం కోరేవాడే స్నేహితుడు.. సంతోషాన్నయినా, విషాదాన్నయినా పంచుకునేది స్నేహితుల దగ్గరే. అందుకే శత్రువు ఒక్కడైనా ఎక్కువే… స్నేహితులు వందమంది అయినా తక్కువే అని స్వామి వివేకానంద అంటారు.. మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారిపోయి, మనిషన్నవాడు మాయమైపోతున్న తరుణంలోనూ ఇంకా ఆత్మీయమైన స్నేహాలు, ఉన్నతమైన మానవతా విలువలు వెలుగు రేఖలుగా దారి చూపుతున్నాయి.

    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఇతరుల నుండి పొందిన సహాయాన్ని మరువకుండా …వారివారి  ఔన్నత్యాన్ని
    స్మరించుకుంటూ పది మందితో పంచుకొనే మీయొక్క సహృదయానికి జోహార్లు. పొందినది చిన్న సహాయమే అయినా.. అటువంటి కొత్త ప్రదేశంలో మనకు పూర్తిగా విభిన్నమైన నిబంధనలు కలిగిన అమెరికన్ కౌన్సెలేట్ కు సంబంధించిన వ్యవహారంలో, అక్కడే లోకల్గా ఉంటూ ఆ పరిసరాలకు అలవాటుపడిన  వ్యక్తి యొక్క సహాయం గొప్పదే.
        2006వ సంవత్సరంలో రాహుల్ స్టూడెంట్ వీసా గురించి  చెన్నై కి వెళ్ళారు అని వ్రాసారు .అదే సంవత్సరం డిసెంబర్లో మా అబ్బాయి సాయి కృష్ణ రెడ్డి ని కూడా చెన్నైకి నేను ఇంటర్వ్యూ కి తీసుకువచ్చాను. అంతకుమునుపు నేను చెన్నైకి ఎప్పుడు వెళ్ళలేదు .ఒక రోజు ముందుగానే వెళ్లి రైల్వే స్టేషన్ లో రిటైరింగ్ రూమ్ తీసుకున్నాము. అక్కడి రైల్వే స్టాఫ్ ద్వారా ఆ ఆఫీస్ అడ్రస్ కనుక్కొని, ఆ రోజు సాయంత్రమే లొకేషన్ చూసి వచ్చాము. మరుసటి రోజు లోకల్ బస్సులో ఒక గంట ముందుగానే కౌన్సిలేట్ఆఫీస్కి వెళ్లడం జరిగింది. మీరు వ్రాసిన జ్ఞాపకాన్ని చదువుతూ ఉంటే ఆ ఆఫీసు బయట ఉన్న పరిసరాలు ఇప్పటికీ నాకు కళ్ళకు కనిపిస్తున్నాయి .అది జెమిని ఫ్లైఓవర్ ప్రక్కనే ఉన్న ఆఫీసు. తిరిగి 2008వ సంవత్సరంలో మా అమ్మాయిని కూడా డిపెండెంట్ వీసా ఇంటర్వ్యూకి చెన్నైకి తీసుకు రావడం జరిగింది. ఇక్కడ కో- ఇన్సిడెంట్ ఏమిటంటే …2006లో అలాట్ చేసిన 7వ నెంబర్ రిటైరింగ్ రూమ్ ,అదే రైల్వే వ్యక్తి ఈరోజు కూడా అలాట్ చేశారు. మరో సారూప్యము 1982లో మా అమ్మాయి సికింద్రాబాద్ రైల్వే హాస్పిటల్ లో పుట్టినప్పుడు 7వ నంబరు టోకెన్ నడుముకి కట్టారు .అదే హాస్పిటల్లో 1985లో మా అబ్బాయి పుట్టినప్పుడు కూడా అదే 7వ నెంబర్ టోకెన్  వచ్చింది. ఇటువంటి అప్రయత్న సంఘటనలు చాలా గమ్మత్తుగా ఉంటాయి కదా !
    ——బి.రామకృష్ణా రెడ్డి
    సఫిల్ గూడ
    సికింద్రాబాద్.

    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    స్నేహమే జీవితం!👏

    —-శ్రీ రావులపాటి సీతారామారావు
    హైదరాబాద్.

    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సర్
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  11. 11

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Sneha bandhaala gurinchi,maadhuryaala gurinchi chaalaa chakkagaa vivarinchaaru..
    Dhanyavaadaalandi 🙏

  12. 12

    Rajendra+Prasad

    Remembering the help from close or connected friends shows your goodness. This will motivate us to help others in need. God has given you a good circle as you have the gift of making friends quickly
    – Rajendra Prasad

  13. 13

    Shyam kumar chagal . MA astrology. Hyd

    అందరికీ చాలా ముఖ్యమైన సన్నిహితులైన స్నేహితులు వేళ్ళ మీద లెక్క పెట్టగలిగే అంతే ఉంటారు డాక్టర్ కె.వి ప్రసాద్ గారికి చేతివేళ్లు కాలివేళ్లు అయినా సరిపోదు అనుకుంటాను ఆయన తన జీవితంలో అంతా కూడా స్నేహితుల సాంగత్యంలో నే గెలిచినట్లుగా అనిపిస్తున్నది. ఒకరినిమించి ఒక మంచి స్నేహితుడు ఆయనకు కలిశారు ఇంతమంది ఇంత మంచి స్నేహితులు ఆయనకు కలవడం చూస్తుంటే నాకు కాస్త గా ఉంది . ప్రేమ ఉంటె మనసుకి జగమంత ప్రేమ మయం అని ఒక సామెత విన్నాను. అలాగే స్నేహపూర్వకమైన హృదయం ఉన్న కె ఎల్ వి ప్రసాద్ కు ప్రపంచమంతా స్నేహితులే . ఏది ఏమైనా ఇలా స్నేహం కొనసాగిస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను

    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ త్రమా
      నీ స్పందన కు ధన్యవాదాలు.

  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సాధారణంగా తమిళనాడు వాళ్ళు తెలుగు వారితో అంత సత్సబంధాలు కలిగివుండటం జ రగదు బాలాజీ గారు చలామంచివారులా వున్నారు అలాంటి స్నేహితులు అరుదు అది మెయింటైన్ చెయ్యడం కూడా మీ దక్షతకు తార్కాణం

    —-విజయ లక్ష్మి. కస్తూరి
    హైదరాబాద్.

  15. 15

    మొహమ్మద్+అఫ్సర+వలీషా

    ఇలాంటి సంఘటనలు స్నేహితులు జీవితంలో మరపురాని మధురమైన ఘట్టాలు సార్. చాలా సంతోషం అనిపించింది చదువు తుంటే. ఇలాంటి వ్యాసాలు చదువు తున్నప్పుడల్లా మనసు ఓ అనిర్వచనీయ భావనకు గురవుతూ ఉంటుంది. స్నేహమంటే అలా ఉండాలి, అవసరానికి ఆదుకునే వారే నిజమైన మిత్రులు ఆ అదృష్టం మీ స్నేహానికి లభించి నందుకు చాలా సంతోషం గా ఉంది సార్. వారం వారం మంచి మంచి స్ఫూర్తి దాయక ఆదర్శ పూరిత వ్యాసాలను అందిస్తున్న మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ 💐💐💐💐💐💐💐💐💐💐💐💐
    మొహమ్మద్. అఫ్సర వలీషా
    ద్వారపూడి( తూ గో జి )

    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అఫ్సరా
      నీ స్పందన కు ధన్యవాదాలమ్మా.

  16. 16

    D. Umashanker

    ప్రతిఫలం ఆశించకుండా కేవలం స్నేహమే జీవితంగా భావించే మిత్రులు దొరకటం మీలాంటి సహృదయులకి గొప్ప విశేషం కాదు. మీ వ్యక్తిత్వం అలాంటిది. అంత గొప్ప మిత్రులు వుండటం అదృష్టమే మరి.

  17. 17

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    👏👏👏👏మీరు చాలా అదృష్ట వంతులు !స్వచ్ఛమైన స్నేహానుభవపు ఆనందాలను పొందగలుగుతున్నారు !
    బహుశా… దూరంగా ఉంటూ
    ప్రత్యేక సందర్భాలలో… కలుసుకోవడం మూలాన మీ స్నేహాలన్నీ తీపి జ్ఞాపకాలవు తున్నాయి !నా అనుభవంలో
    నాకు ఎక్కువమందిస్నేహితులు లేరు ! 6,7 తరగతులు చదువుతున్నపుడు ఒక ముస్లిం స్నేహితుడు… తరువాత నాకు చదువుకునే అవకాశంలేక ఆ స్నేహం అక్కడితో ఆగిపో యింది ! తరువాత… నా 7వ తరగతి సహాధ్యాయినని ఇంకోమిత్రుడు… మితత్వాన్ని కలిపాడు !మామిత్రత్వం ఓ ఆరేళ్ళు సజావుగానే సాగింది !
    తరువాత… జీవనోపాధి కోసం అతడు నేను పనిచేసే ఫోటో స్టూడియో లో చేరి నన్నేఅంటిపె ట్టు కునుండడం… ఆతరువాత నేను సొంతంగా స్టూడియో పెట్టి… అతడ్నిహెల్పరుగా తీసుకోవటం… ! ఆతరువాత పార్ట్నరుగా చేసుకోవటం….
    మనుషులమెంతదగ్గరయ్యామో…మనసు లంత దూర మ యాయి !
    ఆఖరికి వాడితో విసిగిపోయి ఆస్టూడియోను వాడికే విడిచి పెట్టేసి నేను బయటికి వచ్చేసాను !
    స్నేహం వీలైనంత దూరంగా ఉంటేనే ఎక్కువకాలం ఉంటుందని… స్నేహానికి ఆర్ధిక లావాదేవీలను ముడిపెడితే
    ఆ స్నేహం దెబ్బతింటుందని
    నాకు అనుభవ పూర్వకంగా రుజువైంది !ఆర్ధిక పరిపుష్టి స్నేహాలను బలపరుస్తాయన్నది సత్యం !
    ఏదిఏమైనామీరుకొనసాగిస్తున్న స్నేహ సత్సంబంధాలుముచ్చట
    గొలుపుతున్నాయి !అభినందనలు… 👏👏👏👏👏కోరాడ./విశాఖపట్నం.

    1. 17.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      నరసింహారావు గారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  18. 18

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ప్రసాద్ గారూ! 73వ సంచిక చదివినాను.సంస్కృతంలో ఒక సామెతవంటిది ( సామెత అంటరో లేదోతెలువదు).అదేమిటంటే
    “సతాం సిద్ధిస్సంగః కథమపి పుణ్యేన భవతి”. సిద్ధులైన వారిసాంగత్యముఎంతో పుణ్యము చేసుకుంటే తప్ప లభించదు.అని అట.మీరు ఇట్లాటి స్నేహితులను పొందగలిగారంటే అది మీ పుణ్యఫలమేనని చెప్పక తప్పదు.
    నిజమైన స్నేహానికి వావి వర్ణ వర్గ,ధనిక పేద,వయసు లతో పనిలేదు.స్నేహంలో సాయం చేయమని అడగటంలో తప్పులేదు.అసలు అడగకుండానేమన అవసరాలు తెల్సుకొని సాయం చేసే మిత్రులూ ఉంటరు.అడగటం ఎట్లావఅనే సంకోచమే తప్పు.మనం సాయం తీసుకుంటే మన చేయి కిందై ఆతని చేయి మీదైతుందనే భావన స్నేహం లో ఉండదు.( ఈ అభిప్రాయాలన్నీ కాళోజీ రాసిన కవితలోనివి) మీస్నేహితులు,మీరూ బహుధా అభినందనీయులు డాక్టరుగారూ.
    ——రామశాస్త్రి

    1. 18.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  19. 19

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునే వాళ్ళే నిజమైన స్నేహితులు. చెన్నైలో మీకు ముఖ్యమైన రెండు సందర్భాలలో బాలాజీ గారు సాయంచేయడం వారి స్నేహశీలతకు నిదర్శనం. 2003 జులైలో మా కోడలి వీసా స్టాంపింగ్ కోసం నేను కూడా చెన్నై వెళ్ళాను. మీరు చెప్పినట్టుగా ఆమెరికన్ కాన్సులేట్ ఆఫీసు వద్ద నిలబడటానికి చోటు ఉండదు. మధ్యలో పోలీసు జీపుల హడావుడి. నిజంగా చాలా బాధపడ్డాను.
    —జి.శ్రీ నివాసాచారి
    కాజీపేట.

    1. 19.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      ధన్యవాదాలండీ.

  20. 20

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సహాయం చేసిన వారిని ఇంత ఇదిగా గుర్తుపెట్టుకోవడం మీ తరువాతే ఎవరైనా అనిపిస్తుంది మీ ఆత్మీయ జ్ఞాపకాలు చూస్తుంటే. మీరు చాలా స్నేహ సంపన్నులు.మీరే ఎందరికో సాయం చేసినా మీరు పొందిన ప్రతి చిన్న సాహాయానికి కృతజ్ఞతలు తెలపడం నేటి సమాజంలో కొరవడుతున్న ఒక మానవీయ విలువని గుర్తుచేసిన విలువైన జ్ఞాపకాన్ని పంచుకున్న మీకు ప్రణామాలు💐💐💐🙏
    —–నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    1. 20.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు.

  21. 21

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Thank you sir for your love and affection towards me I don’t know wether iam fitt person for your appreciation, thank you 👃🌺💐
    —–Balaji
    Chennai.

  22. 23

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చదివాను మాయ్యా..చాలా బాగుంది…బాలాజీ కి పంపారా
    –రాజబాబు
    విజయవాడ

  23. 24

    రావుల కిరణ్మయి

    స్నేహం ను గురించి మంచి భావాలు తెలియజేశారు.రక్తసంబంధీకుల కన్నా మిన్నయైన ఆప్తమిత్రులు దొరకటం నిజంగా అదృష్టమే సర్.

  24. 25

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ ఙాపకాలపందిరి అపూర్వంగా ఉంది మీ స్నేహంలాగే సార్. స్నేహమాధుర్యాన్ని మీరన్నట్టు అనుభవపూర్వకంగానే తెలుసుకోగలం. అది అనిర్వచనీయం, అద్భుతమైనది. 👌🙏👏
    —-డా.విద్యాదేవి. ఆకునూరు
    హన్మకొండ.

    1. 25.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  25. 26

    శ్రీదేవిరమేష్ లేళ్ళపల్లి

    ప్రసాద్ గారు మీ జ్ఞాపకాల పందిరి ఎందరికో స్ఫూర్తిదాయకం. ఎందుకంటే మానవతా విలువలు తగ్గుతున్న ఈ తరుణంలో మీ ఈ అమూల్యం అయిన జ్ఞాపకం ద్వారా స్నేహం విలువ, అతిథికి సహాయం చేయడం అన్నా పూర్వపు మన సాంప్రదాయ విలువలు పలువురికి గుర్తుచేస్తాయి. మీ బావమరిది గారి స్నేహితులందరికి నమస్సులు🙏 బాలాజీ గారికి హృదయపూర్వక అభినందనలతో నమస్సులు🙏మీ సహజ సిద్ధమైన జ్ఞాపకానికి అనేక నెనర్లు🙏 హృదయపూర్వక అభినందనలతో లేళ్ళపల్లి శ్రీదేవిరమేష్, చెన్నై

  26. 27

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ప్రసాద్ గారు మీ జ్ఞాపకాల పందిరి ఎందరికో స్ఫూర్తిదాయకం. ఎందుకంటే మానవతా విలువలు తగ్గుతున్న ఈ తరుణంలో మీ ఈ అమూల్యం అయిన జ్ఞాపకం ద్వారా స్నేహం విలువ, అతిథికి సహాయం చేయడం అన్నా పూర్వపు మన సాంప్రదాయ విలువలు పలువురికి గుర్తుచేస్తాయి. మీ బావమరిది గారి స్నేహితులందరికి నమస్సులు🙏 బాలాజీ గారికి హృదయపూర్వక అభినందనలతో నమస్సులు🙏మీ సహజ సిద్ధమైన జ్ఞాపకానికి అనేక నెనర్లు🙏 హృదయపూర్వక అభినందనలతో లేళ్ళపల్లి శ్రీదేవిరమేష్, చెన్నై

    1. 27.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీ దేవి గారు
      మీ స్పందనకు ధన్యవాదాలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!