సంచికలో తాజాగా

Related Articles

19 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్.

    Reply
  2. 2

    Sagar

    కాలగమనంలో సూపర్ మార్కెట్ల విజృంభణ చిన్న వ్యాపారుల పాలిట శాపమయ్యింది సర్ . ఇక ధనవంతుల ఓటుకూడ సూపర్ మార్కెట్లకే పడటంతో చిన్న వ్యాపారుల పరిస్ధితి దీనాతి దీనం. ఇలాంటి పరిస్ధితుల్లో స్వామి కార్యం, స్వకార్యంలా మీరు వాకింగ్ తో పాటు కూరగాయల కొనుగోలుతో చిన్న వ్యాపారస్దులకు మీ వంతు సహాయం చేయడం అభినందనీయం. మీకు ధన్యవాదములు సర్ .

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందనకు ధన్యవాదాలు .

      Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది మీ వ్యాసం…నా ఓటు మీకే…నేనూ అంతే! చివరికి కిరాణా సామానుకు కూడా మాల్స్ కి వెళ్లను.ఇంటికి దగ్గరగా ఉండే షాపులో నే గత 40 ఏళ్లుగా సామాను కొంటున్నాము.ఈమాల్స్ వచ్చి చిన్న సన్నకారు వ్యాపారులను బాగా దెబ్బ తీసింది.
    —-పెబ్బిలి హైమవతి
    విశాఖపట్నం

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      అక్కగారూ…..

      Reply
  4. 4

    పుట్టి నాగలక్ష్మి

    సంత గురించి వ్రాశారు.హాయిగా అనిపించింది. మేము మా అబ్బాయి డా.శ్రీకాంత్ ఉద్యోగరీత్యా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో ఉంటున్నాము.ఇక్కడకి వచ్చిన దగ్గర నుంచీ సంతలో తాజా కూరగాయలు కొనుక్కుంటున్నాము.
    నాకు కూడా మాల్స్ చూస్తుంటే జీవనోపాధి కోల్పోయిన చిరు వ్యాపారులు గుర్తు కొచ్చి బాధ కలుగుతుంది. చాలా మంచి విశేషాలను అందించిన మీకు అభినందనలు, ధన్యవాదాలు డాక్టర్ గారూ! 🌹💐🙏🏻

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  5. 5

    Mohammad. Afasara Valisha

    మీరు వ్రాసింది అక్షరాలా నిజం సార్ చిరు వ్యాపారుల పట్ల మీకున్న ఆదరణ అభినందనీయం సార్ షాపింగ్ కు వెళ్లామా చేశామా వచ్చామా అని కాకుండా మన వంతు సాయం ఏం చేశామా అనే మీ సహృదయతకు శిరస్సు వంచి నమస్కరించాలి సార్. చిన్నదైనా, పెద్దదైనా విషయం స్ఫూర్తి దాయకంగా వ్రాసి మమ్మల్ని మీ అడుగు జాడలలో పయనింప చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు సార్. మంచి విషయాలను వ్యాసాలుగా వ్రాసి మాకు అందిస్తున్న మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ 💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏
    మొహమ్మద్. అఫ్సర వలీషా
    ద్వారపూడి (కోనసీమ జిల్లా)

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ఆమ్మా
      మీ అభిమానానికి
      ధన్యవాదాలు.

      Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు ఏ అంశం స్పృశించినా భలే తాజాగా ఎంచుకున్నారే అనిపిస్తుంది సర్.ఈ రోజు తాజా కూరలు గూర్చి ,చాలా మంది పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్ళాక కూరగాయలు సంత నుండి తేవడం నామోషీగా భావిస్తారు మీరు ఖుషీగా భావిస్తారు అని తెలిసి సంతోషం గా ఉంది.చిరు వ్యాపారులను ప్రోత్సహించాలనే అభిప్రాయం చాలా మంచిగా ఉంది.మీ అనుభవాల్లోంచి ఎప్పటికీ తాజాగా ఉండే జ్ఞాపకాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు సర్💐💐💐🙏
    —-నాగ జ్యొతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      జ్యొతీ
      నీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా చక్కటి అంశం తీసున్నారు సర్
    —-కె.కళావతి
    USA

    Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Evng Doctor garu,

    Buying vegetables is my job even today.

    We go to “Mandi” a veg shop near our house to get the fresh 🥦🥕🌽 for 2-3 days requirement.

    🍃🍀vegetables we take from the vendor who visits daily to our area.
    —–suryanarayana rao
    Hyderabad.

    Reply
  9. 9

    Shyamkumar Chagal. Nizamabad

    ఈ రోజుల్లో ఎంత పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ లు మన అందుబాటులోకి వచ్చినప్పటికీ మన ఇళ్లకు దగ్గరగా అత్యవసర సమయాల్లో మన అవసరాలు తీర్చేది చిరు వ్యాపారులే అన్నది గమనించాలి.
    చిన్న చిన్న కిరాణా దుకాణాలు కూరగాయల కొట్లు ఆ వ్యాపారస్తుల లాభార్జన కొరకై పెట్టినప్పటికీ నేటి పెద్ద పెద్ద వ్యాపార సముదాయాల దోపిడి ముందు అవి చాలా చిన్నవి. కొన్నిసార్లు ఈ చిన్న వ్యాపారస్తుల దగ్గర కాస్తంత ధరలు ఎక్కువున్నప్పటికీ వాటి మీద ఆధారపడ్డ ఆ వ్యక్తి యొక్క శ్రమ ముందు అవి ఏ పాటికి కొరగావు.
    ఎండా వానలకు ఓర్చుకుంటూ వీధి పక్కన కూర్చుని పళ్ళు కూరగాయ లు అమ్ముతున్న వారిని ఒకసారి గమనించి చూస్తే వారితో మనం బేరం చేసి మిగులుచుకుంటున్న ఒకటి రెండు రూపాయలు మన అమాయకత్వానికి , అపరిపక్వత కు ఉదాహరణలు మాత్రమే.

    నిజం చెప్పాలంటే కూరగాయలు కొనుగోలు అనేది మొత్తంగా కళ మరియు నైపుణ్యంతో కూడినవి. ధర మరియు నాణ్యతతో సహా తూకం విషయంలో కూడా జాగ్రత్త వహించకపోతే ఇంట్లో మొట్టకాయలు తప్పనిసరిగా పడిపోతాయి.

    ఇంటి లో కూరగాయలు పండించుకోవడం అన్నది పూర్వకాలంలో అతి సాధారణం అయినప్పటికీ ప్రస్తుత రోజుల్లో దాబా గార్డెన్స్ అంటూ హాబీ ప్రాచుర్యంలోకి వస్తోంది. ముఖ్యంగా కరోనా సమయంలో
    వీటి అవసరం అందరికీ అర్థమైంది.
    చిరు వ్యాపారుల పట్ల రచయిత గారి దృక్పథం చాలా బాగుంది. అంతేకాదు మన అందరికీ కూడా ఆచరణీయమని చెప్పాలి. ఈ విషయంలో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాలైన సలహాలు కూడా చూస్తున్నాం. అనుబంధాలతో ప్రేమతో వ్యవహరించే చిరు వ్యాపార సంస్థలే మన భారతీయ జీవిత సరళి లో భాగం.
    వీధి వ్యాపారం లో బేరం చేయ క తప్పనిసరి అవడం రచయిత అన్నట్లు గా’ బాధాకరం’. వారు కూడ అధిక ధర చెప్పటం అలవాటు గా మారింది.
    అయినా సరే అక్కడ చాలా వరకు కొనడమే సరైన పద్ధతి.
    జ్ఞాపకాల పందిరి గురించి ప్రతివారం ఒక కొత్త విషయాన్ని గమనించి దాని మీద వ్యాసం రాయడానికి కావలసిన సంగతులను ఆసక్తికరంగా మన ముందు ఉంచడం అంత తేలికైన పని కాదు. అయినా ప్రతి వారం ఒక కొత్త అంశాన్ని ఎన్నుకొని దానికి తన జీవితంలోని దైనందిన అంశాలను జోడించి మనకు అందిస్తున్న రచయిత గారికి నా అభినందనలు.

    ప్రతివారం జ్ఞాపకాల పందిరి శీర్షికలో ఆరోగ్యకరమైన విషయాలను మన ముందు చర్చకు మనకు అందిస్తున్న నా గురువుగారు డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారికి నా నమస్సులు.

    Reply
  10. 10

    N.Bhujanaga Rao

    ఈ సంచికలో ఒక మంచి విషయాన్ని తీసుకొని చక్కగా చెప్పారు.సూపర్ మార్కెట్లు, మాల్స్ వచ్చాక చిరు వ్యాపారులకు శాపమే.సూపర్ మార్కెట్లోకి వెళితే అంత తాజాగా ఉండవు కానీ రెట్ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. రోడ్ ప్రక్కన చిన్న వ్యాపారుల వద్ద లభ్యమౌతున్న కూరగాయలు మరియు దినుసులు గానీ తాజాగా ఉండటమే కాకుండా రేట్ కూడా తక్కువగా ఉంటాయనడంలో సందేహం లేదు. ఏరోజు ఆరోజు అన్నట్లుగా జీవనం గడుపుకునే చిన్న స్థాయి వీధి వ్యాపారులపై ఉదారంగా వ్యవహరించాలని, వారికి చేయూత నివ్వడంలో మన బాధ్యతను గుర్తు చేసి మంచి విషయాలు అందించిన డాక్టర్ గారికి అభినందనలు మరియు ధన్యవాదములు 🙏

    Reply
  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సాధారణంగా చాలామంది మనలో ఉదయం పూట వాకింగ్ వెళ్లటం సర్వసాధారణ అంశమే ,కానీ దారిలో కనిపించే అవసరమైన కూరగాయలు కొనుగోలు చేసి తీసుకురావడానికి బద్దకిస్తూ లేదా నామోషీగా ఫీల్ అవుతూ ఉంటారు .సిటీ ఔట్స్కట్స్ లో ఉంటున్న మనలాంటి వారికి వారాంతపు సంతలే కాకుండా ,తాజా కూరగాయలు ముఖ్యంగా ఆకుకూరలు లభించటం ఒక వరంగా భావించవచ్చు. మెట్రో సిటి లో ఉంటున్న వారందరికీ పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ లో , ఫ్రీజర్ లో పెట్టిన కూరగాయలు ,కెమికల్ స్ప్రే ద్వారా నవనవలాడే ఆకుకూరలు తప్ప తాజా కూరగాయలు లభించకపోవడం ఒక శాపములాంటిదే అనుకోవాలి.
    ఉదయం పూట వాకింగ్ కి వెళ్లి వస్తూ, తాజా కూరగాయలు ఇంటివారికి అందించడం అనేది ,స్వామి( శ్రీమతి )కార్యం ,స్వకార్యము రెండు పూర్తి చేసినట్లే. ఇక్కడ శ్రీమతి… అని నర్మగర్భంగా తెలియజేయడంలో ఉద్దేశం ,సద్ది పెట్టెను వెతుక్కుని ,ఆరోజు ఏ కూర చేయాలి! అనే సంథిగ్ధావస్థకు పరిష్కారం చూపిన వారమే కాకుండా ,చిరు వ్యాపారులకు కూడా ఉపాధి కల్పించిన వారమవుతాము అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
    ఇకపోతే తమ రచనల ద్వారా మరియు వైద్యుడి గాను ,సుపరిచితులైన డాక్టర్ కె ఎల్ వి గారు ,వారి అనుభవాలతో కూడిన రచనలు అందించడంలో సిద్ధహస్తులు .వారు తమ పూర్వాశ్రమంలోని వైద్య వృత్తిని గుర్తు చేస్తూ మార్నింగ్ వాకింగ్ వలన కలిగే ప్రయోజనాలను , చిరు వ్యాపారును ప్రోత్సహించడం అనే సామాజిక సేవ యొక్క విశిష్టతను ,తాజా కూరగాయలు తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తూ మరో వారం ఈ శీర్షికలో అందిస్తే బాగుంటుంది.
    —–బి.రామ కృష్ణారెడ్డి
    సఫిల్ గూడ.

    Reply
  12. 12

    అల్లూరి Gouri Lakshmi

    తాజా కూరల గురించి చక్కగా వివరించారు..సూపర్ మార్కెట్ లో కూరలు konevallanu చూస్తే జాలి కలుగుతుంది..ఫ్రెష్ వెజిటబుల్స్ అందించే సంతను కళ్ళతో చూస్తే చాలు హాయిగా ఉంటుంది.ఈ వారం జ్ఞాపకాల పందిరి మా నాన్నగారిని గుర్తు చేసింది.ఆయన Sunday సంతకి మలికిపురం వెళ్ళేవారు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!