సంచికలో తాజాగా

Related Articles

15 Comments

  1. 1

    Mohammad. Afasara Valisha

    కుటుంబ సభ్యుల కలయిక లో కలిగే ఆ ఆత్మ సంతృప్తి మాటల్లో చెప్ప లేనిది సార్. మీకా అవకాశం కలిగింది చాలా అదృష్ట వంతులు . బాగా తగ్గిపోయింది చుట్టాలు ఒకరినొకరు కలుసుకోవడం . ఆప్యాయంగా పిలుచు కోవడం మానేశారు తగినంత సమయం లేదని వస్తే చేసి పెట్టే ఓపిక లేదు ఇప్పటి వారికి. కుటుంబ సభ్యుల కలయిక లోని ఆనందాన్ని చక్కని మీ వ్యాసం ద్వారా తెలియ చేశారు చాలా సంతోషం. చాలా బాగా వ్రాశారు సార్ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు. 💐💐💐💐💐💐💐💐💐🙏🙏

    మొహమ్మద్. అఫ్సర వలీషా
    ద్వారపూడి (కోనసీమ జిల్లా)

    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  2. 2

    Sagar

    మనిషి యాంత్రిక జీవితానికి కాసింత విరామమిచ్చి సేదతీర్చేవే ఇలాంటి కుటుంబ వేడుకలు. ఎవరి తాహతుకు తగినట్లు వారు అప్పుడప్పుడూ కలుసుకోవడం నేటి పరిస్ధితులకు అవసరం కూడ సర్. ఎందుకంటే మీరన్నట్లు దూరప్రాంతాలకు తరలివెళ్ళిన తమవారిని తమకు దగ్గరగా ఉండమని ఆదేశించడం అసంభవం మరియు పద్దతికూడా కాలదు.కాబట్టి మనకు దగ్గరగా ఉన్న దగ్గరవారిని కలుసుకోవడం, పాత విషయాలను నెమరువేసుకుని ఆనందంగా గడపడం ఎంతో సంతృప్తినిచ్చే విషయం. ఇక మీ విషయంలో అత్తగారిని, మరదలిని బావమరదులను కలుసుకుని గడపడం మీ ఆనందాన్ని రెట్టింపుచేసిందని నా అభిప్రాయం. చివరగా మీరన్నట్లు మీ మరదలుగారి జీవితంలో అన్నీ దశలు వీక్షించే అదృష్టం కలగడం గొప్పవిషయం. మీకు శుభాకాంక్షలు మరియు మంచి వ్యాసం అందించినందుకు ధన్యవాదములు సర్.

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్,
      నీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు.

  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ వారం జ్ఞాపకాల పందిరి వర్తమాన జీవితాలకు అద్దం పడుతుంది…నిజమే! చాలామంది విద్యావంతుల కుటుంబాల్లో పిల్లలు ఎటేటో వెళ్లిపోతే వయసు మళ్ళిన వాళ్లే ఇంట్లో వంటరిగా బ్రతుకు భారంగా గడుపుతూ ఉంటారు. యువతరం అంతా విదేశాలకు వలస వెళ్లిపోతే మన దేశ సౌభాగ్యం (యువతరమే దేశ సౌభాగ్యం) ఏమైపోతుంది? ….. ఈ పాయింట్ తోనే నేను గతంలో “అదృష్టవంతుడు ” అనే కథ రాశాను. సంచికలో నే వచ్చింది…. అప్పుడప్పుడు అందరూ కలుసుకోవాలని చక్కని ముగింపు ఇచ్చారు……మా అక్కలకి 67 75 సం. లు..ఇప్పటికీ కలుసుకుని అభిమానంగా మాట్లాడుకుంటాము….(ఫోన్ నేను ఉద్యోగానికి, సాహిత్యానికి మాత్రమే ఉపయోగిస్తాము…ఫోన్ లో మాట్లాడవద్దు, ముఖాముఖీ కలుసుకుని మాట్లాడుకుందాము అని చెబుతాను అందరికీ..)
    —-గొనుగుంట మురళీకృష్ణ
    తెనాలి.

    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సర్
      హృదయ పూర్వక కృతజ్ఞతలు సర్ మీకు

  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    విషయం సామాన్యమైన ఒక వ్యాసంగా మలచగలిగారు మీ అనుభంతో.
    అమెరికాలో ఏ ఉత్సవమైన వారాంతంలో జరుపుకుంటున్నారు తీరిక లేక. ఇంకా కొద్దిరోజులు పోతే అదికూడా మానేస్తారేమో!
    —-ప్రొ.జనార్ధన రావు
    కాజీపేట.

  5. 5

    Shyamkumar Chagal. Nizamabad

    ఇంచుమించుగా ఇదే ఇతివృత్తం మీద రచయిత డాక్టర్ కే ఎల్వి ప్రసాద్ గారు జ్ఞాపకాల పందిరిలో గతం లో విపులంగా చర్చించారు.
    ఆత్మీయ సమ్మేళనానికి పిలుపునందుకోవడం వాటిల్లో పాల్గొనడం ఆ సందర్భంగా ఎంతోమంది స్నేహితులు మరియు శుభకార్యాలలో బంధుమిత్రులను కలుసుకోవడం నిజంగా మన లాంటి వారికి ఆనందదాయకమే. ఆహ్వానితులుగా ఎన్నో వాటికి మనం వెళ్తున్నప్పటి కీ మనం కూడ ఇటువంటి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి అందులో ఆనందిస్తే ఇంకా బాగుంటుంది.
    మారుతున్న జీవన విధానం, బ్రతుకుతెరువు బాటలో మనవాళ్లు విదేశాలకు వెళ్లి లేదా దూర ప్రాంతాలకు వలస పోయి జీవనం కొనసాగించడం చూస్తూనే ఉన్నాం. ఈ తరం వారికి అది మామూలే అయినా మన తరం వారికి అది కాస్త బాధాకరమే. కొన్ని కుటుంబాలలో వారి సంతానం మొత్తంగా దూర ప్రాంతాలకు వెళ్లి పోవడం వయసు మీద పడ్డ వారి తల్లిదండ్రుల మనోవేదన మనకు కనపడుతూనే ఉంది.
    నిన్న జరిగిన నా ట్రైన్ ప్రయాణంలో నా చుట్టూ కూర్చున్న ప్రయాణికుల సంతానం పూర్తిగా విదేశాలలో ఉద్యోగరీత్యా వెళ్లిపోయారని తెలిసింది. నా పిల్లల విషయం తెలిసి వాళ్లందరూ నన్ను ఒక అదృష్టవంతుడిగా భావించారు, ఎందుకంటే నా కూతురు కొడుకు ఇద్దరూ ఇక్కడే జీవితంలో స్థిరపడిపోయారు. అది విని నేను నిజమే కదా అనుకున్నాను.
    కాస్త ఇబ్బందే అయినా దూర ప్రాంతాలలో జరిగే శుభకార్యాలను వ్యయ ప్రయాసలకోర్చి మనం వెళ్లిన తర్వాత ,కొన్నిసార్లు అక్కడ తగినంత సౌకర్యాలు సమకూర్చక పోవడమే కాక మనకు సరైన ఆతిథ్యం కూడా లభించకుండా మనల్ని నలుగురితో నారాయణ అన్నట్లుగా వ్యవహరించడం కూడా జరుగుతూ ఉంటుంది.
    ఏది ఏమైనా కరోనా తరువాత కాలంలో శుభ అశుభ కార్యాల సమ్మేళనానికి చాలా ప్రాముఖ్యత ఎనకూరిందని చెప్పాలి .

    వీటిల్లో పాల్గొనడం వల్ల ఎనలేని ఆనందాన్ని దాని ద్వారా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. తరచుగా కుటుంబాల మధ్య జరిగే ఇటువంటి కార్యక్రమాలతోటే సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పరిడవిల్లుతాయి.
    ఇటువంటి ప్రతి కార్యక్రమానికి వీలైనంతవరకు నేను వెళ్తూ ఉంటాను . ఈ విషయంలో రచయిత గారైన డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారి గురించి వేరేగా చెప్పనవసరం లేదు.

    ప్రతివారం జ్ఞాపకాల పందిరి శీర్షికలో ఆరోగ్యకరమైన విషయాలను మన ముందు చర్చకు మనకు అందిస్తున్న నా గురువుగారు డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారికి నా నమస్సులు.

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు మిత్రమా
      బాగా రాసావు.

  6. 6

    N.Bhujanaga Rao

    ఈ వారం జ్ఞాపకాల పందిరి వర్తమాన కాలంలో జరుగుతున్న వాస్తవాలకు దగ్గరగా ఉంది. సంతోషం అనేది పది వేలు ఖర్చపెట్టి, పది ఊర్లు తిరిగితే రాదు,మనం అనుకునే వారితో పది నిమిషాలైనా మనస్సు విప్పి మాట్లాడితే నిజమైన సంతోషం కలుగుతుంది. ఆ సందర్భంలో మనం కలిసిన జ్ఞాపకాలు మరియు తీపి గుర్తులు గుర్తుండి పోతాయి. కుటుంబ సభ్యుల కలయికలో కలిగే తృప్తి మాటల్లో చెప్పలేనిది. కుటుంబ ఆత్మీయ సమ్మేళన కలయికలో ఉన్న ఆనందాన్ని చక్కగా తెలియచేసిన మీకు మా హృదపూర్వక శుభాభినందనులు🙏

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      భుజంగరావు గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగా రాసారు.మీ అందరితో కలిసి నాలుగు రోజులు గడపడం మేము చాలా రిఫ్రెష్ అయ్యాము. అమ్మ కూడా ప్రయాణం చేసి రావడం నేను చాలా హ్యాపీ.
    Thank you so much 🙏🙏
    ——ఎం.హేమలత
    హైదరాబాద్.

  8. 8

    Rajendra Prasad

    It’s good to meet on occasions with friends and relatives to keep the relations live. This will open the way to receive or extend help in need. The feeling that we have affection , support from relatives, friends and neighbors itself keep us comfortable and strong.
    We appreciate your attitude and experience in this regard sir

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!