సంచికలో తాజాగా

Related Articles

18 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఇప్పటికీ నాచేత జ్ఞాపకాల పందిరి 180 ఎపిసోడ్లు రాయించిన,సంచిక సంపాదక వర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు,కృతజ్ఞతలు.
    —–డా కె.ఎల్.వి.ప్రసాద్.

  2. 2

    sagar

    మీరు మొదలే చెప్పినట్లుగ చివరివరకు వేచిచూశాక వచ్చిన ముగింపు చాలా అద్భుతం. జీవితంలో అష్టైశ్వర్యాలు అనుభవిస్తేనే ఆనందం కాదు. మన వెసులుబాటును బట్టి మనం బ్రతకడం కూడా అవసరం. అందులో బాగమే ఈ పుట్టినరోజు వేడుకలు లాంటివి. ఇక మీరన్నట్లు లైఫ్ సర్టిఫికెట్ కూడా. అరుణమేడంగారికి మరోసారి శుభాకాంక్షలు. మంచిఐవ్యాసం అందించిన మీకు ధన్యవాదములు సర్.

    1. 2.1
  3. 3

    Shyamkumar Chagal

    పుట్టినరోజు జరుపుకోవడం అన్నది చాలా ఆనందకరమైన సంఘటనగా నేను భావిస్తాను.
    నిజానికి మనం ఏ రోజు పుట్టాము, ఎప్పుడు పుట్టాము మనకు తెలియదు. మన తల్లిదండ్రులు చెప్పిందాన్ని బట్టి అది మన అందరికీ తెలుస్తుంది.
    మనిషికి స్వయంగా మరణం సంభవించే సమయంలో తాను మరణిస్తున్నాడని విషయం అర్థం అవుతుందేమో కానీ జన్మించే సమయంలో ఆ విషయం ఎవరికీ తెలియదు.
    చిన్నతనంలో పుట్టినరోజు సంబరాల గురించి ఎన్నో రోజులు ఎదురు చూసే వాళ్ళం. వివాహం జరిగిన తర్వాత మ్యారేజ్ డే, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ల బర్త్ డేలు వగైరాలతో మన కాలం గడిచిపోయింది.
    నా బావమరిది తన పుట్టినరోజు నాడు కొత్త చెప్పులతో సహా అన్ని కొత్తవి ధరించేవాడు.
    ఇక మా బావగారు అయితే తన పుట్టినరోజు నాడు తప్పనిసరిగా తిరుపతికి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చేవారు.
    కొందరు వృద్ధాశ్రమాలకు వెళ్లి స్వీట్లు, గిఫ్ట్లు ఇచ్చి వస్తుంటారు. మరికొందరేమో తమకు నచ్చిన గుళ్ళకు వెళ్లి పూజలు చేస్తుంటారు.
    ఇంకా కొందరేమో ఆ రోజుకి సరిగ్గా తమకు నచ్చిన ప్రదేశంలో గడపడానికి వెళ్ళిపోతుంటారు.
    మనలో చాలామంది వాళ్లకు తోచినట్లుగా పుట్టిన రోజు జరుపుకోవడం చూస్తున్నాం.
    పుట్టినరోజుని తాను జన్మించిన సొంత ఊరిలో, ఆ ఇంటిలో తల్లిదండ్రుల చెంత పిల్లలతో కలిసి గడపడం అన్నది చాలా బాగుంటుంది.
    ఇక ఈ లైఫి సర్టిఫికెట్ అనే ప్రహసనం ప్రభుత్వ ఉద్యోగులందరికీ చిరపరిచయమే. దానిలో ఉండే సాధకబాదకాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. పదవీ విరమణ తర్వాత కలిగే ఎన్నో కష్టాలలో ఇబ్బందులలో అది కూడా ఒకటి. ఏం చేద్దాం తప్పదు మరి.
    ప్రతివారం జ్ఞాపకాల పందిరి శీర్షికలో ఆరోగ్యకరమైన విషయాలను మన ముందు చర్చకు మనకు అందిస్తున్న నా గురువుగారు డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారికి నా నమస్సులు.

    1. 3.1
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పుట్టినరోజు వేడుకకు , లైఫ్ సర్టిఫికెట్ కి లింక్ పెట్టి డాక్టర్ కే ఎల్ వి గారు ఈ వారం అందించిన జ్ఞాపకాల శీర్షికలోని ఈ భాగం సర్వసాధారణ విషయమే అయినప్పటికిని, కొంచెం ఆసక్తికరంగా ఉంది. మీరన్నట్లు మనవళ్లు ,మనుమరాండ్ల పుట్టిన రోజు సందర్భంగా వారితోనే కేక్ కట్ చేయించే మనమే , ఆ పనిని మన చేతుల మీదుగా చేసి… ‘హ్యాపీ బర్త్డే టూ యు డాడీ.. మమ్మీ” అని చెప్పించుకొనే సందర్భం ,ముఖ్యంగా మన తరం వారికి కొంచెం ఇబ్బందికరమైనప్పటికిని, మరువలేని ఒక మధురానుభూతి.
    ఆధునిక సమాచార వ్యవస్థ విరివిగా లభించే ఈ రోజులలో ,ఎక్కడెక్కడో ఉంటున్న బంధు మిత్రులందరికీ ఈ సందర్భాన్ని ప్రత్యక్షంగా చూడగలిగే అవకాశం , పరామర్శించే సౌలోభ్యం ఉండటం వలన ఇటువంటి ఆర్భాటాలకు ఈ మధ్యకాలంలో కొదువ లేదనుకోండి .
    మ్యారేజ్ సర్టిఫికెట్ కి తాళి కట్టే సన్నివేశం యొక్క ఫోటో ఎలా ఆధారమవుతుందో, భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు , రాయితీలు పొందే వ్యక్తులందరికీ ,కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రుల సమక్షంలో చేసుకునే పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా ఒక ప్రామాణికము క్రింద పరిగణించినా , ఆశ్చర్య పడవలసిన పనిలేదేమో!😀
    —-బి.రామకృష్ణా రెడ్డి
    సికిందరాబాద్.

    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు రెడ్డి గారు.

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నిజమే సర్ …. పుట్టిన రోజు లైఫ్ సర్టిఫికెట్ లాంటిదేనేమో!
    అందుకే అడిగాను ఏంటి స్పెషల్ అని 12-9-2023 తేదీ చూసి…. మేడం అరుణ గారికి శుభాకాంక్షలు తెలియజేయండి సర్! ఆలస్యంగా అయినా సరే!😄
    —-సుగుణ.అళ్లాణి
    హైద్రాబాద్.

  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    రెండు లైఫ్ సర్టిఫికెట్లు బాగుంది, జ్ఞాపకాల పందిరి వ్యాపకాల పందిరి లాగా. ధన్యవాదాలు సార్.
    —–శ్రీ భక్తవత్సల రెడ్డి
    తిరుపతి.

  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పుట్టిన రోజును పండుగ లాగ జరుపుకోవడం అంటే ఆరోగ్యాన్ని పెంచుకోవడమే. ఆనందం ఆరోగ్యాన్ని పెంచుతుంది.
    —–ప్రొ.జనార్ధన రావు
    కాజీపేట.

  8. 8

    N.Bhujanaga Rao

    పెన్షన్ పథకాల ప్రయోజనాన్ని పొందుతున్నట్లైతే, ఆ ప్రయోజనం పొందడానికి లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడం చాలా ముఖ్యం. పుట్టినరోజుకు లైఫ్ సర్టిఫికెట్ కి లింక్ పెట్టి డాక్టర్ గారు ఈ వారం అందించిన జ్ఞాపకాల పందిరి 180 వ సంచిక చాలా ఆసక్తికరంగా ఉంది. అరుణా మేడం గారికి పుట్టిన రోజు శుభా కాంక్షలు తెలుపుతూ,మంచి విషయాలు అందించిన డాక్టర్ గారికి అభినందనలు మరియు ధన్యవాదములు,🙏

    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కృత జ్ఞత లు
      భుజంగరావు గారూ.

  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Birthday celebration and life certificate guruchi chakkaga chepparu annaya garu .
    —mrs.Jaya Alexander
    Safilguda.

    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      కృత జ్ఞత లు మీకు.

  10. 10

    Jogeswararao Pallempaati

    అద్భుతంగా చెప్పారు, డాక్టర్ గారూ, పుట్టినరోజు ఎందుకు జరుపుకోవాలో! అర్థవంతంగా అనిపించింది, మీ ఆలోచన! నేను ఫేస్బుక్ లో “మీ ఇంటి గొప్ప పండుగ … మీ పుట్టినరోజు పండుగ” అనే దీవిస్తాను!
    మీ జీవిత భాగస్వామికి మా అందరి తరపున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు, డాక్టర్ గారూ!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!