సంచికలో తాజాగా

Related Articles

20 Comments

  1. 1

    Shyamkumar chagal

    గుప్తుల స్వర్ణ యుగం అంటారు చూడండి అలా పత్రి కా రంగం కూడా రాజ్యమేలిన రోజులని రచయిత గారు గుర్తు చేశారు. దీని గురించి ఎంత రాసినా తక్కువే.

    అద్భుతమైన ఆ పత్రికా రంగ సామ్రాజ్యం కూలిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దానికి కలిగిన ఆఖరి దెబ్బ కరోనా నుంచి మాత్రమే అని నిస్సందేహంగా చెప్పొచ్చు.
    గతంలో బ్రతుకుతెరువు గురించి వెచ్చించాల్సిన సమయం ఒక హద్దులో ఉండేది. దానికి కారణం హద్దులో ఉన్న ఖర్చులు కూడా. ఖర్చులు పెట్టాల్సిన విలాసాలు కూడా చాలా పరిమితంగా ఉండే వి.
    ఈ రోజుల్లో విలాసాలు కూడా తప్పని సరిగా మారిపోవడం విచిత్రం. వాటిని పొందడానికి కావాల్సిన సంపాదన కోసం ఈ రోజుల్లో యువత పరుగులు తీయడం మనం చూస్తూనే ఉన్నాం.
    ఇక వారికి పుస్తకాలు చదివే తీరిక ఓపిక సమయం ఆసక్తి లాంటి వి పూర్తిగా మృగ్యం అయిపోయాయి.
    దాంతో పాఠకులు కరువైన పుస్తక సామ్రాజ్యం కూలిపోతూ ఉంది.
    వాటికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ పత్రికలు ఆ ఆ కొరతను ఎంతోకొంత తీర్చడానికి తమ వంతు కృషి చేస్తున్నాయనటంలో సందేహం లేదు.

    కాకపోతే ఈ వంతు కృషిలో రచయితలు చేస్తున్నది మాత్రం రాయడం తప్ప ఇంకేమీ లేదు. ఎన్ని గొప్ప రచనలు చేసినప్పటికీ వాటిని పాఠకుల వరకు చేర్చకపోతే అది శుద్ధ దండగ అనే విషయాన్ని చాలా సున్నితంగా చెప్పారు రచయిత గారు. ప్రస్తుతం పాఠకులకు రచనలు చేరడానికి ప్రింట్ మీడియా అన్నది లేకుండా పోయింది కనుక మనకున్నది అందరి చేతిలో ఆడుకునే మొబైల్ ఫోన్ మాత్రమే.
    రచనలు వారి వరకు చేరడానికి రచయితలు మాత్రమే కాకుండా పత్రికా యాజమాన్యం కూడా కృషి చేయవలసి ఉంది.
    పాపం పత్రికా యాజమాన్యం ఈ విషయంలో కాస్త వారికి తోచిన విధంగా చేస్తుండడం గమనిస్తున్నాం కానీ రచయితలు మాత్రం తాము రాయడమే గొప్ప అని భావన లో మునిగిపోయి ఏమి చేయట్లేదని చెప్పాలి.
    మునిగిపోతున్న పడవని రక్షించడం అందులో ప్రయాణించే ప్రతి ఒక్కరి బాధ్యత.
    దీనికై అందరూ హితోదికంగా కృషి చేయాలని నా విన్నపం.
    నేటి బర్నింగ్ ఇష్యూ, విస్తృతమైన చర్చకు అవకాశం ఉన్న, ప్రస్తుత పరిస్థితులను సరిదిద్దడానికి చేయవలసిన కార్యక్రమాలను రూపొందించడంలో వాటిని విజయం సాధించడంలో మనమందరం తలా ఒక చేయి వేద్దాం.
    లేదంటే చదివే వారి సంఖ్య తో పాటు పత్రికలు రచయితలు వారి రచనలు చదివే వారు లేక కనుమరుగై కాలగర్భంలో కలిసిపోవడం తథ్యం.

    చాలా ముఖ్యమైన ఈ విషయాన్ని మన దృష్టికి తెచ్చిన రచయిత గారు డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ మరియు సంచిక యజమాన్యానికి నా కృతజ్ఞతలు.

    Reply
    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ స్పందన నా వ్యాసాన్ని మించి వుంది.
      మంచి విశ్లేషణ.
      హృడయ పూర్వక కృతజ్ఞతలు

      Reply
  2. 2

    sunianu6688@gmail.com

    రచయిత Dr KLV ప్రసాద్ గారు చాలా చక్కగా వ్యక్తీకరించారు. ఇందులో చాలా భాధ, వేదన మనం గుర్తించాలి. నిజమే రచయత గారు చెప్పినట్లు రచయతలు , పాఠకులు తగ్గిపోయారు అనడం లో ఎటువంటి అనుమానం లేదు. పత్రిక యాజమాన్యాలు కూడా తమ వంతు కృషి చేస్తున్నారు తమ వంతు బాధ్యత గా. మరి పాఠకులు? రచయితలు? కాబట్టి ప్రతి ఒక్కరూ కృషి చేయకపోతే కొన్ని రోజులకు పత్రికలు అనేవి వున్నవి అని మన భావితరాలకు చెప్పే రోజు వస్తుంది ఏమో. చాలా ఆలోచించాల్సిన విషయం. రచయత Dr KLV ప్రసాద్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు 👌🌹

    Reply
    1. 2.1

      Shyam Kumar Chagal

      Excellent expression.

      Reply
    2. 2.2

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన చాలా బాగుంది.
      హృదయ పూర్వక కృతజ్ఞతలు .

      Reply
  3. 3

    Sagar

    నిక్కచ్చిగా చెప్పాలంటే చదవరుల సంఖ్య తగ్గడం, ఇతర వ్యాపకాలు ఆకర్షించడం అనేది ప్రధాన కారణం. ఇక పత్రికల విషయానికి వస్తే మంచి రచనలు అందరూ చదవక పోయినా, కొంతమందికి చేరువవుతాయని నా అభిప్రాయం సర్. మడిగట్టుకు కూర్చొక ప్రోత్సాహనికి పత్రికలు నడుం బిగిస్తే వాటికి భవిష్యత్. లేకుంటే ఇప్పుడు విస్తృతంగా వ్యాపించిన అంతర్జాలం పోటు వాటిపై తప్పదు. ఉదాహరణకు అన్నదాత, తెలుగు వెలుగు, నవ్య, లాంటి పత్రికల విషయం చూసాం. మంచి మార్పులతో పత్రికలకు మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం. మీకు ధన్యవాదములు సర్.

    Reply
    1. 3.1
  4. 4

    D. Umashanker

    చాలా విలువైన విషయం ప్రస్తావించారు. పత్రికలు చదివే ఆసక్తి, సాహిత్యంపై అభిమానం తగ్గిపోతున్నాయి ఈ తరం వారిలో. వారికి తగిన సమయం కూడా దొరకదు పాపం. సాహిత్యానికి వూపిరి పోస్తున్న మీబోటి వారందరకూ నా వందనాలు

    Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అవును వైద్యవర్య!

    పాఠకులు కరువయినారు “నా కవిత లేదా కథ లేదా ఏదైనా లేఖ అందరూ చదువాలే, కాని ఎవరి లేఖ చదివే తీరిక నాకు లేదు ” అనే పాఠకులు ఎక్కువగా ఉన్నారు.
    దీనికి కారణం స్మార్ట్ ఫోన్.
    సంస్కృతములో ” సంభాషణ సందేశః ” అనే ఒక పత్రిక ఉంది. దానిలో ఇంతకు ముందు మీ “అస్త్రము ” అనే కథ అందులో ప్రకాశితమైనది. తర్వాత “ఎక్కవలసిన రైలు ” ,మీదే, అదే పత్రికకు పంపించాను. 18-07-22 నాడు ప్రచురీంచే కొరకు అంగీకరించారు. అది కూడా మీకు పంపాను. ఇప్పటికి 10 నెలలైంది. కాని ప్రచురించబడలేదు. అంటే వాళ్ళదగ్గర గుట్టలకోద్ది కథలు పడివున్నాయని అర్థం.
    2005లో నేను పంపిన కథలు 1లేక2 నెలల్లో ప్రచురించబడేవి .అంటే అప్పుడు రచయితలు తక్కువగా ఉండేవారు. ఇప్పుడు పెరిగి పోయారు. ఇది పరిస్థితి.

    నేను ఇది వ్రాసే ముందు నేను పంపిన కథ “ఎక్కవలసిన రైలు ” ఇంకా ఎందుకు ప్రచురించబడలేదు అని ఎడిటర్ కు మేల్ పెట్టాను. సమాధానం కూడా వచ్చినటుల ఉంది. చూసి చెబుతాను.

    ఆచార్య తంగెడ జనార్దనరావు

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సర్
      మీ స్పందనకు
      హృడయ పూర్వక కృతజ్ఞతలు.

      Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పత్రికలు అద్భుతంగా విలసిల్లిన బంగారు కాలాన్ని ఒక్కసారి తలపుకు తెచ్చారు. ఒక ప్రక్కన మేము అంటే మహిళలం ఇంటి పనిపాట్లు చూసుకుంటూ, ఉద్యోగాలను చేసుకుంటూ, పిల్లలను ఆలనాపాలనా చూసుకుంటూ, వారిని చదివించుకుంటూ.. మేమూ పత్రికలు, నవలలు, ఇతర గ్రంథాలు చదువుకునే వాళ్ళం.. ఇప్పుడు ఈవేగయుగం.. ముద్రిత పత్రికలు తగ్గిపోయిన.. కరోనా తర్వాత కాలంలో అంతర్జాల పత్రికలు వెలుగొందుతున్నాయి.. డాక్టర్ గారూ మీరు చెప్పినట్లు పరస్పరం ఒకరి రచనలు మరొకరు చదవవలసిన అవసరం ఉంది.. ఆ విధంగా మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి.
    ‘—-పుట్టి నాగలక్ష్మి
    హైదరాబాద్.

    Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 160 లో నాటి పత్రికలపై మీ అభిప్రాయాలను తెలియచేశారు. మీరు చెప్పినట్టుగా ఒకప్పుడు పత్రికారంగం స్వర్ణయుగం. దినపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలతో కళకళలాడేది. నేను కూడా డిగ్రీ చదివే రోజుల్లో దినపత్రికలు, వారపత్రికలు కొని చదివేవాణ్ణి. ఆనాటి జర్నలిజం, సాహిత్యం ఉన్నత విలువలకు నిదర్శనం. నేడు అంతర్జాల పత్రికలు, సాహిత్య వేదికలు ఎన్ని ఉన్నా, విలువలు పాటించేవి బహు అరుదు. చక్కటి కథనం.
    —జి.శ్రానివాసాచారి
    కాజీపేట.

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      చారి గారు.

      Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    👏👏👏💐🙏మంచి విశ్లేషణాత్మక వ్యాసం…
    —కోరాడ నరసింహారావు
    విశాఖపట్టణం

    Reply
  9. 9

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి సుదీర్ఘమైన ప్రయాణంలో 160 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని ఎన్నో అనుభవాల్ని మనకు ప్రసాదించిన రచయిత గారికి హృదయపూర్వక ధన్యవాదములు. పూర్వపు రోజులు గుర్తు చేసుకుంటే అపుడు విలసాల ఖర్చులు లేవు, వారి ఆర్ధిక పరిస్థితుల దృష్టితో జాగ్రత్తగా పొదుపు చేసుకొని,ఖాళీగా ఉన్న సమయంలో దూరదర్శన్ రేడియో మరియు పుస్తకాలతో పాటు పత్రికలు చదివేవారు.దైనందిన జీవితంలో డబ్బె ప్రధానంగా మరియు విలాసాలకు అలవాటు పడి పుస్తకాలు చదువే ఓపిక సమయం లేకుండా పోయింది.చదివే వారి సంఖ్యను పెంచడం మన బాధ్యతగా భావించి ముందుకు సాగుదాం. మంచి విషయాలు అందించిన డాక్టర్ గారికి హృదయపూర్వక నమస్కారములు🙏

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      భుజంగరావు గారూ
      ధన్యవాదాలండీ.

      Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    1962 నుండి 1967 వరకు ప్రభ.జ్యోతి వారపత్రికల్లో వచ్చిన సీరియల్స్ మంచికథలన్నీ బైండ్ చేయించిన .కథలు8/10 వాల్యూమ్స్ అయినవి.ఒక పరిశోధకవిద్యార్థి కిసాయపడండి అని ఆతని గైడ్ చెప్తేఇచ్చిన. వాపస్టేయటం అట్లావుంచి మనిషేఈనపడలేదు.గైడ్ గారికిచెప్తే తనకేకనపడలేదని జవాబు.సీరియల్స్ నవలలే కాకుండా మరపురానిమనీషి.పర్యాటక స్థలాల వ్యాసాలూ కూడా చేయించిన.తీసూకొనిపోయినవారూ అటేపోయిన్రు.. 1962 లోఖమ్మంలో పనిచేస్తున్నప్పుడు బలిపీఠం సీరియల్గా వస్తుండేది తెలుగు చదువలేని థమిళ స్నేహితుని కి వారం వారంచదివివినిపించేవాడిని.
    ఆతరువాత ఆపనికి( సీరియల్స్ బైండ్చేయించేపనికిస్వస్తిచెప్పిన .పిల్లలు చెత్త జమ అయితున్నదని గోలచేస్తే .అణాలైబ్రరీలుండేటివి
    నేను చాలా నవలలు ముఖ్యంగ డిటెక్టివ్ నవలలు అట్లనే చదివిన .కొన్నాళ్ళు వారు కూడా వీక్లీలు కూడా ఇ
    అద్దెకీయటం మొదలు పెట్టిన్రు. నేను సర్వీస్ ల ఉన్నప్పూడు ఆఫిసులో తలాపదిరాపాయలు వసూలుచేసి లైబ్రరీ మేంటేన్ చేసేవాడిని. అయిదారు నెలల తరువాత అవన్నీ వేలం వేసేవాడిని..అట్లనే అప్రస్తుతమైనా సరేపోస్ట్ ఆఫీసు కార్డులు కవర్లు రెవెన్యూస్టాంపులు అమ్మేవాడిని.లేకుంటే ప్రతిఉద్యోగీ తనకు కర్డో కవరో స్టాంపో తెమ్మని అటెండర్ను బయటకు పంపేవారు.
    ఏదవటమేకాక చదివే అలవాటూ చేయించిన పత్రికలు. ఏది ఏమైనా 160వసంచిక స్పెషల్ సంచిక .ఆత దీపావళి సంచికల వలె.
    అభినందనలు సర్
    —-రామ శాస్త్రి
    హన్మకొండ.

    Reply
    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు ధన్యవాదాలండీ .

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!