మనిషి ఆరోగ్యంగా వుండి, బ్రతికి బట్టకట్టాలంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటే, తప్ప సాధ్యం కాదు. అది అవగాహన లేనివాళ్లు ఏదో రూపంలో అనారోగ్యానికి బలి అవుతూనే వుంటారు. తెలిసి కొందరు, తెలిసీ తెలియక కొందరు ఇబ్బందుల పాలవుతూనే వుంటారు. తెలియని వారికి ఏదైనా మంచి చెప్పడం చాలా తేలిక. తెలిసి కూడా పాటించని వారితో సమస్య లేదు. ఎందుకంటే వీరి నిర్లక్ష్యం, బద్ధకానికి కొలబద్దలు వుండవు. వీరి జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే ‘నాకు తెలుసులే..!’ అని చెప్పి ఊరుకునే పెద్దలు వీళ్ళు. సమస్య అంతా తెలిసీ తెలియని వాళ్ళతోనే! వీళ్లకు తెలుసు, అని చెప్పడానికి ఉండదు, అలాగే తెలియదు.. అని చెప్పడానికి ఉండదు. వీళ్ల పట్ల ఎక్కువ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండడం అవసరమే!
ఇక అసలు విషయానికి వస్తే, ‘పరిశుభ్రత’ అనేది మనిషి ఆరోగ్యానికి అవసరమైన అంశాలలో అతి ముఖ్యమైనది. ఈ పరిశుభ్రతలో స్వీయ-పరిశుభ్రత, ఇంటి పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత వంటివి ప్రధానంగా చెప్పుకోవలసినవి.
పరిశుభ్రత గురించి తెలియకపోతే ఫరవాలేదు కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే, అసలు ఆసక్తి చూపకపోతే అది నేరం అవుతుంది. అలాగే పరిశుభ్రత అంటే ఏమిటో పూర్తిగా అవగాహన వున్నా, దాని పట్ల అశ్రద్ధ వహిస్తే అది కూడా నేరమే! మనం అన్నిరకాలుగా పరిశుభ్రంగా వుండి, మన ఇంట్లోని వస్తువులు, ఇల్లు, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే, అంతకు మించిన తృప్తి, ఆనందం మరోటి ఉండదు. ఇది మనిషిలోని నిత్య చైతన్యానికి పునాది వేస్తుంది. అలాగే వస్తువులు నిత్యం పరిశుభ్రంగా వుండి, ఎక్కువకాలం మన్నుతాయి కూడా! కొందరు పరిశుభ్రత పేరుతో వింత వింత పోకడలు పోతుంటారు. మరికొందరు మనమూ, మన ఇల్లు, మన వాహనాలు, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే చాలు అని ఆలోచిస్తారు గాని, మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందేమోనని కొంచెం కూడా ఆలోచించరు. కేవలం వారి స్వార్థానికే కట్టుబడి వుంటారు. ఇది మాత్రం దుర్మార్గం, దురదృష్టకరం కూడాను.
ఇల్లు కడుతున్న చోట రోడ్డు పరిస్థితి, సీతారామా కాలనీ, సఫిల్‌గూడ, సికిందరాబాద్
పట్టణాల్లో, వీధి మార్గాలు ఉంటాయి. రోడ్డుకు ఇరువైపులా ఇళ్లు ఉంటాయి. ఆ రోడ్డుమీద జనసంచారమూ, వాహనాల రాకపోకలతో రోడ్డు రద్దీగానే ఉంటుంది. ఎవరో మధ్యలో వున్న ఖాళీస్థలంలో ఇల్లు కట్టడమో, ఇల్లు రిపేరు చేయించడమో చేస్తుంటారు. ఆ పనికి అవసరమైన సామాగ్రితో రోడ్డు మూడొంతులు ఆక్రమించేస్తారు. దీనికి తోడు నిర్ధాక్షిణ్యంగా రోడ్డు మీద వస్తువులు కడగడాలు, సిమెంటు కలపడాలు, ఇలా ‘మా ఇంటి ముందు రోడ్డు మాదే’ అన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఆ ఇరుకు రోడ్డు మీద బురద తొక్కుకుంటూ నడిచిపోవాలి, అప్పుడప్పుడూ ద్విచక్ర వాహనాలు జారి పడి ప్రమాదాలను కొని తెచ్చుకున్న సంఘటనలు కూడా కోకొల్లలు.
ఇలాంటి సమస్యలను తెలుసుకుని కూడా తగిన జాగ్రత్తలు ఆ గృహనిర్మాణం చేసే పెద్దలు తీసుకోరు.
బలరామ్ నగర్ కాలనీ, సఫిల్ గూడలో నిత్యం రోడ్ల పరిస్థితి ఇదే!
ఇక పండుగల పేరుతోనో, పూజల పేరుతోనో, ఇతర వేడుకల పేరుతోనో, పరిశుభ్రత కోసం ఇల్లు – ఇంటి చుట్టూరా నీళ్ల పైపుతో కడుగుతారు. మంచిదే, పరిశుభ్రతను అందరూ ఆహ్వానించ వలసిందే కాదనలేము. కానీ ఆ మురికి నీటిని, మొక్కలవైపు మళ్లించడమో, డ్రైనేజీ లోకి పంపడమో (ఈ సదుపాయం చాలామంది వుంచుకోరు అనుకోండి) చేయకుండా స్వేచ్ఛగా జనం కాలినడకన నడుస్తారన్న ఇంగిత జ్ఞానం లేకుండా రోడ్డు మీదికి వదిలేస్తారు. ఆ మురికి దిగువస్థాయిలో వున్న అందరి ఇళ్ల ముందు నుంచి పారుతుంది. ఆ ప్రవాహం పల్లమున్నంత వరకూ పారుతూనే ఉంటుంది. ఇది ఎంత వరకూ సమంజసం? ఆలోచించాలి.
ఈమధ్య కాలంలో జనాలకి వాహనాల కొదవు లేదు. కొందరు డబ్బుండి కొనుక్కుంటే, మరికొందరు బ్యాంకు లోన్లు తీసుకుని కొనేస్తున్నారు. అలా చాలామంది ఇళ్లల్లో రెండేసి కార్లు, మూడేసి ద్విచక్ర వాహనాలు ఉంటున్నాయి. వాటిని పార్క్ చేయడానికి ఇంటి ప్రాంగణంలో చోటు ఉండదు. ఇక ఇళ్ల మధ్య వుండే రహదారులే దిక్కు. వీటి వల్ల రోడ్డ్డు ఇరుకుగా మారడమే కాదు, ఈ వాహనాలను రోడ్డుమీద అవసరానికి మించిన నీటితో కడుగుతుంటారు. ఇక చూడండి రోడ్డంతా నీటితో బురదమయం అవుతుంది. అంతమాతమే కాదు, అమూల్యమైన నీరు వృథా అవుతున్నది. నలుగురూ ఉపయోగించుకునే రోడ్లు బురదమయం అవుతున్నాయి. వాటిని తొక్కుకుంటూ ఇళ్ళలోనికి అడుగుపెట్టాలి ఆ రోడ్డున నడిచేవాళ్ళు.
మనం శుభ్రంగా ఉంచుకోవడం మంచిదే. మన ఇల్లూ -పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం అభినందనీయమే! కానీ, మన వల్ల ఇంకొకళ్ళు ఇబ్బంది పడడం మాత్రం సమర్థనీయం కాదు.
హన్మకొండలో మా ఇంటి పక్క స్థలం మొన్నటివరకూ ఖాళీగా ఉండేది. దాని యజమాని దుబాయ్‌లో వుండేవాడు. ఎక్కడ వాళ్ళ భూమి కబ్జాకు గురి అవుతుందోనని, అందులో ఓ మాదిరి ఇల్లు కట్టి, కూలిపని చేసుకునే వాళ్లకు అద్దెకు ఇచ్చాడు. వాళ్లకు ఆ ఇంట్లో వంటగది వుంది. కానీ అది వాడరు. ఇంటి ముందు ఖాళీస్థలంలో పొయ్యిపెట్టి వంట చేస్తారు. దానికి సంబందించిన పొగ మేఘాల్లా ప్రవేశించి, మంచం మీది దుప్పట్లు వేసుకునే డ్రస్సులు పొగ కంపు కొడుతుంటాయి. ఒక్కోసారి అలాంటి పొగవల్ల కళ్ళు మంటలు -దురదలూనూ! వాళ్లకు ఏమి చెప్పాలి? ఎలా చెప్పాలి? ఏమి చేయాలన్న తగువుకు సిద్ధపడాలి. అతి జాగ్రత్తలు, అతి శుభ్రతలు, ఇలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి.
ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత, ఉదయమే, వాకింగ్‌కి వెళుతుంటే ప్రతి సందులోను, రోడ్డుమీద, ఇలాంటి మురికి నీటి ప్రవాహాలను తొక్కుకుంటూ నడిచి పోవలసిందే. ఎవరినీ ఏమీ అనేటట్టు ఉండదు. పరిస్థితులకు లొంగి బ్రతకవలసిందే. జనంలో ఒక అవగాహన, చైతన్యం, ఆలోచించే శక్తి వచ్చే వరకూ పరిస్థితులు ఇలానే ఉండవచ్చు.
ఏది ఏమైనా, ఒకరి పరిశుభ్రత, లాభం, మరొకరికి అపరిశుభ్రత, నష్టం కలిగించకూడదన్నది సుస్పష్టం. నా స్థాయిలో నేను ఇలాంటివి జరగకుండానే జాగ్రత్త పడుతుంటాను. కానీ ఇలాంటి పనులు ఒకరిద్దరితో అయ్యేవి కాదు కదా!
పరిశుభ్రత అన్నది అందరికీ అవసరమే.. కానీ! నీ వల్ల, నా వల్ల ఇతరులకు మాత్రం ఇబ్బంది కలగడం మాత్రం నేరం!!
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు —డా కె.ఎల్.వి.ప్రసాద్
రోజు ఇది అందరు చూసేదే అనుభవించేదే. కాని విధిలేని పరిస్థితి. ప్లాటున్నవాడు ఎప్పుడో ఒకప్పుడు ఇల్లు కట్టాల్సిందే కద! ఇలా జరుగాల్సిందే. ఆ శుభ్రత పాటించడం వాడి చేతిలో కూడా ఉండదు. పనివాళ్ళు ఎంత చెప్పిన వినరు. ఇదీ దేశపరిస్థితి. అనుభవించక తప్పదు. ఇక వాహనాల సంగతి. ఇళ్ళు 60 గజాల్లో కడతాడు. వాడికి ఉండడానికే సరిపోదు. ఇంక వాహనమెక్కడ పెడతాడు. లేదా ఇల్లు కట్టేప్పుడు వాహనం కొనుక్కోగలనని వాడు కలగూడ కనడు. కాలప్రభావంతో కొనక తప్పదు. ఎక్కడ పెట్టాలి మరి? వీథే గతి! ఇది ఈ దేశ పరిస్థితి. ఏం చేయమంటారు ప్రసాద్ గారు? ——ప్రొ.జనార్ధన్ రావు ఖాజీపేట.
అవును లెండి…ఎవరు మాత్రం ఏమి చేయగలరు?కనీసం మన మురికి వేరే వారికి ఇబ్బంది పెట్టకుండా చూడాలంతే గదండీ..
మన జీవితంలో ఆరోగ్య పరిరక్షణ పరిసరాల పరిశుభ్రత గురించి మంచి ఉపోద్ఘాతాలతో మరియు ఉదాహరణలతో కూడిన జ్ఞాపకాల పందిరి చాలా బాగుంది. రచయిత గారు చర్చించిన విషయాలు చాలావరకు మనకు ప్రతిరోజు కళ్ళముందే కనబడుతూ ఉంటాయి. కాకపోతే వాటిని మనం పట్టించుకోకుండా పరిస్థితి సహిస్తూ జీవనం గడిపేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఒక ప్లాటు కొనడం దాని సరిహద్దుల వరకు పెద్ద బిల్డింగ్ కట్టడం దాన్ని చూసుకొని మురిసిపోవడం జరుగుతుంది. భవిష్యత్తులో ఒకటి రెండు కార్ల గురించి లేదా మూడు సైకిల్స్ పెట్టుకోవడానికి కావలసిన పార్కింగ్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇంకా కొన్ని చోట్ల అయితే ప్లాటు సరిహద్దు నుంచి బయటికి దిగడానికి కావలసిన మెట్లు, వాహనాలు ఎక్కించడానికి దింపడానికి వీలయ్యే ర్యాంపు వగైరాలు కూడా రోడ్డుమీదికి చొచ్చుకుని వచ్చేస్తున్నాయి. ఇంకా ఘోరాతి ఘోరమైన విషయమేమిటంటే ఇంటి ముందట చెట్లు పెట్టుకోడానికి విలేజ్ స్థలాన్ని కూడా ఎవరూ వదలడం లేదు సరి కదా రోడ్డు మీద ఉన్న కాస్త స్థలాన్ని ఆక్రమించి చిన్న ఫెన్సింగ్ చేసి మొక్కలను పెంచుకొని మురిసిపోతున్నారు. వాహనాలు నిలుపుకోవడానికి అందరికీ నీడ కావాలి కానీ ఎవరూ వారి ఇంటి ముందు చెట్లు పెంచరు. ఏతావాత ఒక ట్రెండు చెట్లు పొరపాటున మొలిచినా,వాటి యొక్క ఆకులు వారి ఇంటి ముందు పడి,ఊడవడానికి కష్టమవుతుందని వాటిని కొట్టేస్తూ ఉండడం కూడా నేను చూశాను. కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళు లేదా ఉన్న ఇంటికి మరమ్మత్తులు చేస్తున్న వాళ్లు, కట్టడానికి కావలసిన ఇసుక సిమెంటు రాళ్లు రప్పలు వాటిని ఇంటి ముందురోడ్డు ఆక్రమించి వాటిని ఇతరులకు ఇబ్బంది కలిగించడం వారి జన్మ హక్కుగా భావిస్తుంటారు. వాటిని అందరూ అంగీకరించడం అన్నది సహజ న్యాయంగా ప్రకటించబడుతూ ఉంది. పండగ పబ్బాలు లేదా ఇంట్లో జరిగే శుభకార్యాలకు, అందరూ వాడుకునే రహదారులే చాలా సౌకర్యంగా ఉండడం గమనిస్తున్నాం. ఈ మధ్య జరిగే రాజకీయ స్టంట్ లు కూడా రహదారుల మీద జరిపి ప్రజలకు మరియు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే విధంగా చేయడం అన్నది ఒక విపరీత పరిణామం. కొన్ని చోట్ల అయితే రహదారి దిగ్బంధనాలు నెలల తరబడి జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా అక్కడే వంటలు వార్పులు స్నానాలు బాత్రూం బెడ్ రూమ్ లు అన్నీ కట్టుకొని నెలలుగా గడిపేసి ఆ రహదారులను వాడే ప్రయాణికుల గురించి కానీ తోటి ప్రజల గురించి గానీ ఆలోచించకుండా ఒకసారి స్టిక్ ఆనందం పొందే వారి గురించి చెప్పనవసరం లేదు. ఇది ముఖ్యంగా ఎంత పెద్ద పట్టణాలు అయితే అంత అధికంగా ఉంది.పల్లెటూర్లలో ఈ జాడ్యం ప్రవేశించలేదు కానీ వారిదైనంది న. కార్యక్రమాలు, పశువులను కట్టి వేయడం లాంటివి చాలావరకు రోడ్లమీద జరుగుతుంటాయి. కాకపోతే ఆ రోడ్లో వాడకం ఎక్కువగా ఉండ దు కాబట్టి ఎవరికి అంత ఇబ్బంది కలిగించదు. ఇవన్నీ చూస్తుండడంతో మనిషికి పరిసరాల పరిశుభ్రత, శారీరక ఆరోగ్యం అనేవి ఎంత ముఖ్యమైనవో అర్థమవుతుంది. ఈసారి కూడా రచయిత డాక్టర్ కే. ఎల్ వీ ప్రసాద్ గారు సంచిక ద్వారా మంచి శీర్షికను ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు.
మిత్రమా..నా వ్యాసాన్ని మించి విపులంగా వుంది,నీ స్పందన.హృదయ పూర్వక కృతజ్ఞతలు.
మన పరిశుభ్రత దృష్టిలో ఉంచుకుని మన వ్యర్ధాలు మరియు మురికినీరు వేరేవారికి ఇబ్బందీ పెట్టకుండా చూడాలి.ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్లాట్ ఉంటే వ్యర్ధాలు ఏ మాత్రం సంకోచించకుండా పడేస్తుంటారు ఎందరినో చూస్తున్నాము. వ్యర్ధాలను సక్రమైన ప్రదేశంలో పారవేయాలి, పరిసరాల శుభ్రతే మన తొలి ప్రాధాన్యం కావాలి.బహిరంగ మురుగు నీరుకు అండర్ డ్రైనేజి అవసరంగా భావించాలి. ప్రజలకు మరియు పాలకులకు చిత్తశుద్ది ఉంటే,వేలాది కోట్ల స్కాములు అపగలిగితే అసాధ్యం కానేరదు.ఆరోగ్య పరిరక్షణతో పాటు పరిసరాల శుభ్రత గురించి మంచి ఉదాహరణలతో (ఫొటోలు) చక్కటి సంచిక అందించిన మీకు హృదయపూర్వక నమస్కారములు🙏
మీ స్పందనకు ధన్యవాదాలు సర్
పరిశుభ్రత గురించి మీ వివరణ బావుంది.. కొంతమంది వారింట్లోని చెత్తను పక్కింట్లో వేసే వాళ్ళని చూశాం. పట్టణాలు, నగరాలలో ఇళ్ళు కట్టే సమయంలో మీరు చెప్పింది సర్వసాధారణం..మనం సర్దుకుని ముందు కెళ్లక తప్పని పరిస్థితులు..ఏం చేయగలం మరి.
అంతే గా మరి ధన్యవాదాలు.
జ్ఞాపకాల పందిరి 158 లో పరిశుభ్రత గురించి రాశారు. పరిశుభ్రత ఆరోగ్యానికి అవసరమని, స్వీయ పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత గురించి తెలిపారు. నేటి రోజుల్లో పరిసరాల పరిశుభ్రత గురించి పట్టించుకునేవాళ్ళు బహు అరుదు. చక్కటి కథనం. —-జి.శ్రీనివాసాచారి కాజీపేట.
ధన్యవాదాలు చారిగారు.
అందరినీ బాధించే సమస్యను ఏకరువు పెట్టారు. బాగుంది, కానీ మన మందరమూ ఏదో రూపేణా భాద్యులమే. మన ఇంటి ర్యాంపు రోడ్డు పైకి కడతాము. ఇంటి ఫంక్షన్ కు రోడ్డు మోసేటందుకు వెనకాడము. పార్కింగ్ రోడ్డు పై పెట్టి ప్రజలకు నానా ఇబ్బంది కలుగ చేస్తాం. ఎవరికో తప్ప, అధికులకు స్పృహ కూడా ఉండదు తప్పు చేస్తున్నామని. ఈ మధ్య మీరు సమాజంలో ఉన్న చెడును చెండాడుతున్నారు. సంతోషం
మీరన్నట్టు తెలిసినవారికి సులభంగా చెప్పవచ్చు ఏమీ తెలియని వానికి సులభతరంగా తెలుపవచ్చు సమస్యల్లా థెలిసీ తెలియని వారితోనే తెలియని మనుజుని సుఖముగ తెలుపందగు సుఖతరముగ తెలుపగ వచ్చున్ తెలిసిన వానిని తెలిసీతెలియని నరుదెల్ప బ్రహ్మవశమే జగతిన్. అని పెద్దలు చెప్పిన్రు. కొందరు ” మాఇల్లు శుభ్రంగా వుంటే చాలుననితమచెత్తంతా పక్కింటి వారింటిముందు పోస్తరు. ఇకహైదరాబాదు లో ముచ్చట .నేను మాపిల్లలున్న శ్రీనగర్ కాలనీలో చూసిన కారులన్నీ రోడ్లమీదనే రెండు పక్కల కార్లు పార్కు చేస్తే మిగిలేది సగం రోడ్డే.ఒక కారు వస్తే ఎదురుగా ఇంకో కారు పోవటానికి వీలుకాదు . రోడ్డుమీద నీరు, మురికినీరు సరేసరి .యూసఫ్గూడాలోగల్లిలలో రోడ్డుచిన్నగ మురికినీరు ప్రవాహానికి జాగా వదిలితే మిగిలింది నడవటానికి సరిపోదు .దుంకుకుంటూ పోవాలె. కాంపౌండ్లో చెట్లుంటేవపక్కవారితో రోజూ జగడమే.పండ్లచెట్లైతే మరీ పండ్లు కావాలె కాని ఆకు లు అటువేపుపడటానికి వీలులేదు చెట్లు?పర్యావరణకు హితంచేసేవే అన్న సంఖతే గుర్తించరు .. ఇక అపార్ట్ మెంట్లది మరో కథ .బయటివారి బండ్లు లోపలికి ర్వద్దు అంటరు అందులో వున్న వారిని కలవటానికి వచ్చేవారు బండ్లు రోడ్ మిద పెట్టాల్నా?.లక్షలుపోసి ఇల్లు కట్టుకొని లోపల పార్కింగ్కు జాగావుంచుకోరు పైగా ఎదురింటి ముందర పెడతారు ఏమన్నంటే రోడ్డు మేసొంతంవకాదుగదా అని దబాయింపు పర్వం ఒకటి .ఇన్ని సమస్యల మధ్య నోరులేనివాళ్ళు నెగ్గుకు రావటం కత్తిమీదసామే.కనుక మనమే కాంప్రమైజ్ కావాలె. మీరు చెప్పిన విషయాలన్నీ వంథశాతం నిజం .మనమేమీచేయలేమనేది అంతకంటే నిజం. —నాగిళ్ళ రామశాస్త్రి హన్మకొండ.
శాస్త్రి గారు ధన్యవాదాలండీ.
Gd Mng Doctor garu, Yesterday I have lodged a complaint with GHMC authorities about dumping of mud & other waste materials opposite our house by the owner of a house under Construction. It has become a menace all through the city. To avoid all these nusence, I am going for a walk on our terrace. —-suryanarayana rao Hyderabad
సర్ మీ స్పందనకు ధన్యవాదాలు సర్.
💐🙏ఎస్…. ఎవరి సుఖం వారిది… ఈమధ్య తమ పాత ఇళ్లను అపార్టుమెంట్లకు ఇచ్చేస్తున్నారు… వాళ్ళు పక్కనే ఉన్న ఇళ్లను పట్టించుకోరు ! మా ఇంటివెనుక ప్రక్కనే ఉన్న రెండిళ్లవాళ్లకలిసి అపార్ట్మెంట్స్ కి ఇచ్చేసారు వాళ్ళు ఆ కంస్ట్రక్షన్ చేసుకుంటూ మమ్మల్ని పట్టించుకోలేదు ఐదు అంతస్తుల అపార్ట్మెంట్ మా ఇంటి పిట్టగోడను ఆనుకునే…. వాళ్ళ ఇటికే ముక్కలు, రాయి సిమెంట్ ముద్దలు, కర్రముక్కలు, ధూళి దుమ్ము, చెత్త, చెదారం వీటితో పాటు తీవ్ర శబ్ద కాలుష్యం భరించలేకపోయాం… అదింకా పూర్తికాలేదు మాఇంటిని ఆనుకునే, కుడిప్రక్క అచ్చం అలాంటిదే మరోకంక్ట్రక్షన్… ఎన్నిమార్లు చెప్పినా, తిట్టినా addagaa టార్పాలిన్ ఏదైనా కట్టన్ద్రాబాబూ అని ఎంత చెప్పినా వినిపించుకొనకపోతే ఆఖరికి gvmc. వాళ్లకు రిపోర్ట్ చేస్తే… పెట్టామంటే, పెట్టామన్నట్టు చిన్న సిమెంట్ గోనెలలో తయారుజేసిన ఒక్కముక్క అడ్డుగా కట్టారు… ఎక్కడా… ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ అపార్టుమెంట్లు పూర్తయేసరికి ప్రక్కనున్నవాళ్ళ ఇల్లు ఒళ్ళు పూర్తిగా పాడై పోతున్నాయి. —-కోరాడ నరసింహారావు విశాఖపట్నం.
కోరాడ నరసింహారావు గారు కృత జ్ఞత లు సర్ మీకు.
మీరు వ్యక్తపరచిన ఈ సమస్యతో ప్రతినిత్యము ప్రత్యక్షంగా విసిగి వేసారి పోయాము. కనులుండి చూడలేక ,మందలించగలిగీ నోరు మెదపక సర్దుకపోతున్న మా పరిస్థితిని ఏమని వర్ణించగలను. No more comments! —బి.రామ కృష్ణారెడ్డి. సికిందరాబాద్.
రెడ్డిగారూ ధన్యవాదములు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఫొటో కి కాప్షన్-38
నమామి దేవి నర్మదే!! -5
అందమైన మనసు-15
ఆశల తోరణం
నూతన పదసంచిక-80
దేశ విభజన విషవృక్షం-66
మరో లోకంలోకి నడిపే ‘ఆల్గోరిథమ్’ కథాసంపుటి
ఎవరు?
కట్టడితో మట్టుబెడదాం..!
ఒక అస్పష్ట చిత్రం
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®