సంచికలో తాజాగా

Related Articles

27 Comments

  1. 1

    Sagar

    ప్రతి మనిషికీ పనికి వచ్చే మంచి ఉపదేశం ఇచ్చారు సర్ నేటి రచనలో. ఎందుకంటే ఇందులో బద్ధకం అనేకంటే క్రమశిక్షణ ముఖ్యం అని చాలా బాగా చెప్పారు. మీ మాట ఇంకొకరికి నచ్చక పోయినా చెప్పడంలో తప్పులేదు అని నా అభిప్రాయం సర్. ఇలాంటి రచనలు అందరినీ కొంతమందిలో నైనా మార్పు తెస్తాయి అనడం లో సందేహంలేదు. మీకు ధన్యవాదములు సర్.

    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందనకు ధన్యవాదాలు

  2. 2

    Shyam Kumar Chagal

    బద్ధకం అన్నది మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన అంశంగా ఉంది అనడంలో సందేహం లేదు. అయితే గారు చెప్పినట్లుగా ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి విషయంలో బద్ధకం మనల్ని డామినేట్ చేయాలని ప్రయత్నిస్తూ ఉండడం మనం గమనించటం లేదు. అసలు బద్ధకం కూడా ఒక దినచర్యలో భాగమే అన్నట్లుగా అయిపోయింది. గారు చెప్పినట్లు మన ఇంట్లో చేస్తున్న పనులు చేయాల్సిన పనులు చాలావరకు భార్య లే చేస్తుంటారు అని ఒప్పుకోక తప్పదు. ఇక పుస్తకాలు చదవడం వరకు వస్తే ప్రతివారు చెప్పే మంచి, చెత్త కారణం ఏదైనా ఉంది అంటే నాకు టైం లేదు సార్ అని అనడం మనం గమనిస్తూనే ఉన్నాం. పాపం పెద్ద రచయితలకైతే వారి రచనలు రాయడం కే టైం సరిపోదు.. ఇక వేరే ఏం చదువుతారు కనుక.
    ఉదయం లేవడం అన్న విషయంవరకు వస్తే కాలేజీ స్నేహితుడు 10 గంటలకు ఖచ్చితంగా పడుకొని నాలుగు గంటలకి లేవడం ఎన్నో దశాబ్దాల నుంచి జరుగుతోంది. ఉదయం లేచి నడక వ్యాయామం ఈత లాంటివి అన్నీ చేసి కానీ అతను పని మొదలట్టడు.
    ఇలాంటి క్రమశిక్షణ అన్నది ఆచరించడం చాలా కష్టంతో కూడుకున్న పని. ముఖ్యంగా గత పది సంవత్సరాలలో యువతకు అందుబాటులో వచ్చిన సెల్ ఫోన్లు సోషల్ యాప్ లు వగైరాలన్నీ కూడా ఈ బద్దకాన్ని పెంచి పోషిస్తున్నాయి అనడం అతిశయోక్తి కాదు. అర్ధరాత్రి దాటిన వరకు తిరిగి ఉదయం లేవగానే ముందుగా సెల్ఫోన్ పట్టుకొని ఆఖరి నిమిషం వరకు తాస్తారo చేసి ఆఫీసుకులకు పరిగెత్తడం మనం చూస్తూనే ఉన్నాం. పిల్లలే కాదు పెద్దలు కూడా చేస్తున్నారు.
    ముఖ్యంగా భిన్న రంగాలకు చెందిన కళాకారులు ఏది సమయానికి పూర్తి చేయరు అనేది నాకు వాస్తవంగా ఎదురైన చేదు నిజం. చాలావరకు వారి ఆర్థిక సమస్యలకు ఇదే కారణం.
    ఏది ఏమైనా తగిన సమయంలో చేయవలసిన పనులు పూర్తి చేసేవారు మాత్రమే విజయతీరాలకు చేరుతారు.

    ప్రతివారం సామాజికంగా మనందరికీ సంబంధించిన విషయాలను మన దృష్టికి తెస్తున్న డాక్టర్ కే ఎల్ ఏ ప్రసాద్ మరియు సంచిక పత్రికకు నా అభినందనలు

    1. 2.1
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    వాస్తవ జీవితానికి దగ్గరగా ఉన్న టాపిక్ సర్ ….

    వాయిదా వేయడం నేను కూడా తగ్గించు కోవాలి …😊
    ——శ్రీధర్ రెడ్డి
    హన్మకొండ.

    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      బాబూ
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ప్రతి ఇంటిలో, ప్రతిమనిషిలో జరిగేదే ఉన్నదే మీరు బహు రంజకంగా రమ్యంగా చెప్పారు.
    బద్దకం వీడడానికి ఔషధంలాంటి వ్యాసం వ్రాశారు డాక్టర్ గారు.
    శుభమస్తు .
    —ప్రొ.తంగేడ జనార్ధన రావు
    హన్మకొండ.

    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      పెద్దవారు
      ఓపిక చెసుకుని చదివి
      స్పందించినండుకు
      హృదయ పూర్వక కృతజ్ఞతలు సర్ మీకు

  5. 5

    D. Umashanker

    చాలా మంచి సందేశం ఇచ్చారు డాక్టరుగారు. మీరు చెప్పినట్లే ఈ బద్ధకం అనే వ్యాధితోటి ఛాలా మంది జీవితంలో చాలా నష్ట పోతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు చిన్నతనంలో ఈ అలవాటుకు లోనై జీవితాంతం బాధపడతారు. తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లలపై జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ సందేశం అందరికీ శిరోధార్యం

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు ధన్యవాదాలు సర్

  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బద్ధకం గురించి అభిప్రాయం చెప్పాలంటే కొద్దిగా బద్ధకంగా వున్నది. నిజమే లేవగానే కప్పుకున్న దుప్పటి మడత వేయకపోవటం ,ఉతికిన బట్టలు మడతపెట్టకపోవటం ఒక అలవాటుగా మారితే బద్ధకమే.పొద్దున అయిదుగంటలకు లేవటం అనే చాదస్తం నాకూవుంది ర్త్రి పన్నెండు ఒంటిగంటకు పన్నా అయిదుకు మెలకువ వస్తది . ఇప్పటిపిల్లలకు పొద్దున్నేలేచే అలవాటు చేద్దామనుకున్నంత ఈజీ కాదు చేయటం . మామనుమరాళ్ళు కూడా ఏవో అసైన్ మెంట్స్ అంటూ,రాత్రిరెండు మూడువరకు మెలకువతో ఉండి పొద్దున్నే లేవటానికి బద్ధకిస్తరు, ఆ అసైన్ మెంటేదో పఖలే చేసుకోవచ్చుగదా అంటే కాలేజీయేనాయె. అసైన్మెంట్ ఇచ్చేవారికీ ఇంగితముండదాఅంటే ఏమో ? .ఏమైనా ఇంకా ఏమైనా అనటానికి బద్ధకిస్తున్న
    —-నాగిళ్ళ రామశాస్త్రి
    హన్మకొండ.

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      ధన్యవాదాలు

    2. 6.2

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      జ్ఞాపకాల పందిరి157లో బద్ధకం గురించి రాశారు.బద్ధకమనే వైరస్ మనిషి మస్తిష్కంలో ప్రవేశిస్తే, బతుకు గందరగోళం అవుతుందని తెలిపారు. యువతరం ఈ జాడ్యానికి బానిసై, విలువైన కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. చక్కటి కథనం.
      —-జి.శ్రీనివాసాచారి
      కాజీపేట.

  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నిజమే సర్.బద్దకం జీవితంలో చాలా సార్లు అమూల్యమైన అవకాశాలను కూడా జారవిడుచుకొనెట్టు చేస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని.మీ క్రమశిక్షణ పాటించదగినది.నేటి యువత బద్ధకమో, నిస్తేజామో తెలియని స్థితిలో ఉంటున్నారు.మంచి మేలుకొలుపు అంశం ప్రస్తావించారు.ధన్యవాదాలు సర్🙏💐
    —-నాగ జ్యొతి శేఖర్
    కాకినాడ.

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు.

  8. 8

    sunianu6688@gmail.com

    బద్ధకం గురించి చాల చక్కగా వ్యక్తీకరించారు. నేను కూడ బడ్డకస్తురాలినే ఇప్పుడు. ఒకప్పుడు మీరు చెప్పినట్లే ఉదయాన్నే లేచి అన్నీ పనులు చక్క పెట్టుకునేదాన్ని.ఈ మధ్య వయసు పెరగడం , నిస్తేజమో కొంచెం బద్ధకం ఎక్కుయిన్దిది అనిపిస్తుంది.తగ్గించుకోవాలి ఇక. ఐతే ఈ వ్యాసానికి బద్దకం వల్ల రిప్లై లేట్ గా ఇవ్వలేదు రచయత గారు. కేవలం madras eye 👁️ sight వల్లsir ! మీ వ్యాసం నన్ను తట్టి లేపినందుకు రచయత శ్రీ KLV prasad గారికి నా హృదయపూర్వక అభినందనలు 🙏🌹

    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు .

  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పూర్వ కాలం పెద్ద లంటే భయం భక్తి క్రమశిక్షణ ఉండేవి. ఇప్పుడవి కాస్త మరుగున పడటంతో ఆ క్రమశిక్షణకు అలవాటు పడిన వాళ్ళు కాస్త చిరాకు, పడటంలో తప్పులేదనిపిస్తోంది. కనీసం ఇలా ఉండే వాళ్ళ ను, చెప్పేవాళ్ళను వేళ్ళ మీద లెక్క పెట్టవలసి వస్తోంది. ఇప్పుడందరు తల్లి దండ్రులు తమ పిల్లలు చదువుతోనో , ఉద్యోగం తోనో అలసి పోతున్నారనే గారాబంతో వాళ్ళ జీవన శైలిని మార్చేస్తున్నారనిపిస్తోంది. ఏదైనా early to bed early to raise is always best అని అనుకున్నప్పుడే ఆరోగ్యం, ఆనందం మన స్వంత మవుతాయనే మీ విలువైన వ్యాసం అందరికీ చాలా ఉపయుక్తమైనది సార్. బద్దకం బారిన ఒక సారి పడ్డామంటే దానికి కట్టు బానిస అయిపోతారనడం లో సందేహం లేదు. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీకు.💐💐💐💐💐💐💐💐💐💐💐💐హృదయ పూర్వక ధన్యవాదాలు సార్ మీకు🙏🙏 సమయం తీసి విలువైన వ్యాసాలు అందిస్తున్నారు. 🙏🙏
    —-‘అఫ్సరవలీశా
    తూ.గో.జి

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    👏👏👏👏💐🙏నిజమే… బద్దకానికి ఎప్పుడో ఒకప్పుడు బానిసలు కానివారుండరేమో !
    నేను కొంత బద్ధకిష్టినే… మాయావిడ చాలాయాక్టీవ్ !
    —-కోరాడ నరసింహ రావు
    విశాఖపట్నం.

    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కోరాడ వారికి
      ధన్యవాదాలు.

  11. 11

    Bhujanga rao

    సమాజానికి అత్యంత అవసరమైన సందేశం ఇచ్చారు సర్.మానవునికి అవసరమైనవి దొరుకుతే బద్దకం అనేది ఫ్రీగా వస్తుంది. బద్దకం పోవాలంటే ఉదయం లేవగానే వ్యయామము అలవాటు ముఖ్యమైనది, రోజంతా హుషారుగా ఉంటుంది.కొన్నిసార్లు కనిపిస్తున్న పనిని చేయాలనిపించదు,కావున పనిని దశలవారీగా ప్రాధాన్యతను గుర్తించి పూర్తి చేసుకోవాలి. బద్దకం పోవడానికి మంచి వ్యాసం అందించిన డాక్టర్ గారికి హృదయపూర్వక నమస్కారములు సర్🙏

    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      ధన్య వాదాలూ.

  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    రావు గారూ
    ధన్య వాదాలూ.

  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నేటి సమాజంలో ముఖ్యంగా ఈనాటి యువతలో కనిపిస్తున్న ఈ అవలక్షణాన్ని ఈ శీర్షికలో డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు .రచనా వ్యాపకంలో ప్రావిన్యులైన రచయితగారూ ఈ విషయాన్ని సుతిమెత్తగా అక్షర రూపంలో అందించారు. నా విషయానికి వస్తే ,నేను ఇంటివారినే కాదు బయట వ్యక్తులను కూడా ముఖ్యంగా ఉదయం పూట ఆలస్యంగా దంత ధావనం చేస్తున్న వ్యక్తులను ,నలిగిన నైట్ డ్రెస్సులతో, చెెదిరిన జుట్టుతో ,ఆలస్యంగా నిద్ర లేచి కనీసం మొహాన్ని కూడా కడుక్కోకుండా బయటికి కనిపించే వ్యక్తులను మొహమాటం లేకుండా మందలిస్తూ ఉంటాను.( అందరినీ కాదండోయ్! కేవలం మన మీద అభిమానం, వారి పట్ల మనకు ప్రేమానురాగాలు ఉన్న వ్యక్తులతోనే.) ఈ విషయాన్ని పాజిటివ్ గా తీసుకున్న వ్యక్తులు మరొకసారి ఆ పరిస్థితుల్లో తారసపడకుండా తప్పుకుంటారు అనుకోండి !అది మార్పుకు నాంది కాబోలు 😁.
    —-బి.రామకృష్ణా రెడ్డి
    సికిందరాబాద్.

    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ
      కృత జ్ఞత లు సర్ మీకు.

  14. 14

    Rajendra Prasad

    దాదాపు ప్రతీ సారీ, ఉపోద్ఘాతం ఇచ్చి సంఘటన ప్రస్తావిస్తారు. ఈసారి మొత్తం ఉపోద్ఘాతమే . సోమరితనం గురించి మీరు రాసింది ఆలోచనా పూర్వకంగా ఉంది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!