సంచికలో తాజాగా

Related Articles

19 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్

  2. 2

    Shyam Kumar Chagal

    డాక్టర్ కే ఎల్ వి. ప్రసాద్ గారు రవీంద్ర భారతి తదితర రంగ స్థలాల
    గురించి వివరించే నేపథ్యంలో రచయిత్రి శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి గారి సాహిత్య ప్రయాణం గురించి క్లుప్తంగా వివరించారు.
    ఇంకాస్త వివరంగా రాస్తే బాగుండేది. హైదరాబాద్ పట్టణంలో రంగ స్థలాలు కొన్ని మాత్రమే ఉన్న మాట నిజమే కానీ, అందులో జరిగే కార్యక్రమానికి హాజరయ్యే ప్రేక్షకులు మాత్రం చాలా పలుచగా ఉంటున్నారు. చాలాచోట్ల అలా వచ్చిన ఆహ్వానితుల కోసం
    కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించడం లేదు అన్న విషయం దురదృష్టకరం. పుస్తక ప్రపంచానికి క్రమంగా పాఠకులు దూరమైతున్న ఈ రోజుల్లో కొందరు రచనలకు పూనుకోవడం అన్నది మంచి విషయం అని చెప్పాలి. రవీంద్ర భారతి లో కార్యక్రమాలకు ఉచితంగా, ఎటువంటి ఫీజు లేకుండా ఇవ్వడం అనేది తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మంచి పరిణామం. అయితే. ఈ విషయం చాలామందికి తెలియదు.
    రవీంద్రభారతిలో కార్యక్రమం జరపడం ఒక అదృష్టం అయితే, అందులో అవార్డు పొందడం అన్నది ఇంకా గొప్ప
    అదృష్టం అని చెప్పాలి.

    శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి గారికి నా అభినందనలు

    జీవితంలో ఎదురైన మంచి సంఘటనలను జ్ఞాపకాల పందిరి సమాహారంగా మనకందిస్తున్న డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారికి, మరియు సంచికకు నా ధన్యవాదాలు

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మి త్రమా
      చాలా బాగా రాసావు.
      కృత జ్ఞత లు.

    2. 2.2

      Jhansi koppisetty

      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు శ్యామ్ కుమార్ గారూ🙏🏻🙏🏻… ఇక్కడ డా. ప్రసాద్ గారు వారు వీక్షించిన కార్యక్రమ వివరాలు మాత్రమే వారి జీవితపు జ్ఞాపకాల పందిట్లో ఒక సుదినంగా రికార్డు చేసారు. నా సాహిత్య ప్రయాణం అంటే అది ఒక వ్యాసం అవుతుందే తప్ప వారి జ్ఞాపకాల పందిరి శీర్షికకు న్యాయం జరుగదు. అయినా నా సాహిత్య ప్రయాణం గురించిన ఇంటర్వ్యూ ఇదివరకే రెండు రకాల విభిన్న ప్రశ్నావళితో ఇటు సంచినలోనూ, అటు విశాలాక్షి లోనూ ప్రచురించారు… మీకు తెలుసుకోవాలన్న అభిలాష వుంటే వారిని అడిగి లింక్ తీసుకుని చదవగలరు…..

  3. 3

    Sagar

    సాహితీ సంబరాలకు ఇలాంటి ఆడిటోరియంలు ప్రతి ప్రసిద్ధ ప్రదేశాలలో ఉంటే అది వారికి ఎనలేని ప్రోత్సాహం అని నా అభిప్రాయం సర్. ఇక రవీంద్ర భారతి లో మొదటిసారి మీ ద్వారా హేమలత గారి పురస్కారాలకు హాజరు కావడం నాకు సంతోషం కలిగించే విషయం. ఇక ఝాన్సీ మేడంప్రతిభ గురించి ఎంత వ్రాసినా ఇక్కడ స్థలం చాలదు. రచనలపై మక్కువకు అసలైన ఉదాహరణ మేడం. వారి రచనలు రెండు చదివి చిన్న పరిశీలన పేరుతో వ్రాయడం నా అదృష్టం.మీకు ధన్యవాదములు సర్.

    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      నీ స్పందన కు ధన్యవాదాలు సాగర్.

    2. 3.2

      Jhansi koppisetty

      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు సాగర్ గారూ🙏🏻🙏🏻🙏🏻

  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    హైదరాబాద్ ఆడిటోరియాల పరామర్శ బాగుంది. ధన్యవాదాలు సార్
    —డా.భక్తవత్సల రెడ్డి
    తిరుపతి.

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    హైదరాబాదులోని సమావేశ మందిరాలుపేరు చెప్తే అక్కడ ఎవరు ముఖ్య అతిదిగా వస్తున్నరో చెప్పవచ్చునని ఒక జోక్ ఉండచది.త్యాగరాయగానసభైతే సినారె,సుందరయ్య వజ్ఞానభవనం అయాతే వామపక్షభావజాలమున్న రచయితలకు,ప్రెస్క్లబ్ అయితేఫ్రీలాన్సర్స్ అనీసారస్వథ పరిషత్తు అయితే యువభారతిసభ అనీ,రవీంద్రభారతి ఐతే ప్రభుత్వానికి దగ్గరవారి సభ అనే చెప్పుకునేవారు..1962 ప్రాంతంలో చిత్తూరువినాగయ్య గారికి పద్మశ్రీ వచ్చిన సందర్భంగా రశీంద్రభారతితిలో అభినందన సభ మాస్నేహితుడు రచయిత నాగరాజు రామస్వామితో( ఈయనతమ్ముడే ప్రఖ్యాత కవి అనువాదకుడూ ఎలనాగ) కలిసి వెనుక నిలబడి చూసిన అప్పుడుడిగ్రీఅయిపోయిందో మూడవసంవత్సరంలో వున్నానో! మళ్ళీ రవీంద్రభారతికి పోనేలేదు 2013 ,వరకు అదికూడా కాళోజీ శతజయంతి సభలో పాల్గొనటానికి.
    వరంగల్ లో ఆడిటోరియం ల కొరత అందరికీ తెలిసిందే.ఒక్క నేరెళ్ళ హాలు మాత్రమే ప్రభుత్వంది మరో హాలు కావాలంటే ప్రభుత్వేతర హాలులే దిక్కు.
    హైదరాబాదు లోని సమావేశాలలో మీ అనుభవాలు బాగాచెప్పిన్రు అట్లే శ్రీమతి ఝాన్సిగారి రచనలగురించికూడా.
    —‘రామశాస్త్రి
    హన్మకొండ.

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ అనుభవం బాగా గుర్తు చేసుకున్నారు శా స్త్రి గారూ…ధన్యవాదాలు.

  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సర్
    నమస్తే
    జ్ఞాపకాల పందిరి 156 చాలా బాగుంది.
    హైదరాబాద్ లాంటి తెలుగు రాజధాని లో విశిష్టమైన కార్యక్రమాలు చూచి ఆనందపడడం ఎంత అదృష్టం సర్
    ముంబై లో మాకా అవకాశం లేదు.
    ఎంతైనా మీరు అదృష్టవంతులే
    ధన్యవాదాలు సర్
    —-డా.తాటి నరహరి
    ముంబై.

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టరు గారు
      ధన్యవాదాలు.

  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఉత్తమ రచయితలకు అభిమానులతో పాటు ,తోటి రచయితల ప్రోత్సాహము, సాహిత్య సంస్థల గుర్తింపు ,తదనుగుణంగా సన్మాన కార్యక్రమాలు ఎల్లవేళలా నిండుగా ఉంటాయి …అనటానికి మీరు ఆహ్వానించబడ్డ సాహిత్య సన్మాన కార్యక్రమమే చక్కని ఉదాహరణ. మీరు ముందుగా ఊహించినట్లు కాకుండా ఈ కార్యక్రమము మేటి కళాకారుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం, పేరుగాంచిన ఇతర కళాకారుల చేతుల మీదుగా శ్రీమతి ఝాన్సీ గారు అవార్డు స్వీకరించటం అభినందనీయం. చక్కని కార్యక్రమాన్ని కళ్ళకు కట్టినట్టు రచనా రూపంలో అందించిన డాక్టర్ గారికి అభినందనలు.
    —బి.రామకృష్ణా రెడ్డి
    సఫిల్ గూడ.

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

  8. 8

    Jhansi koppisetty

    ధన్యురాలిని డా. ప్రసాద్ గారూ🙏🏻🙏🏻🙏🏻
    ఈ వారం ప్రత్యేకించి నాకు జరిగిన సన్మాన సభ గురించి, నాకిచ్చిన అవార్డు గురించి రాయటం నా ఫొటోలతో సహా ప్రచురించటం మహదానందంగా వుంది. అందుకు సంచిక యాజమాన్యానికి నా కృతజ్ఞతలు. ఇక్కడ స్పందించిన మీ మిత్రులందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు తెలుపగలరు. మీ ఈ ప్రత్యేక జ్ఞాపకాల పందిరి నాకు తెన్నేటి హేమలతగారి పురస్కారం ఇచ్చిన ఆనందాన్ని మించి సంతోషం కలిగించింది. మీ అభిమానానికి సదా ఋణపడివుంటాను❤️🙏🏻🙏🏻

    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      నాకు కూడా
      ఒక మంచి జ్ఞాపకం గా
      మిగిలిపోతుంది లెండి.
      మీకు శుభాకాంక్షలు.

  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 156 లో భాగ్యనగరం జనాభాకు తగినట్టుగా ఆధునిక ఆడిటోరియంలు అందుబాటులో లేవని తెలిపారు. రచయిత్రి శ్రీమతి ఝాన్సీ శ్రీనివాస్ కొప్పిశెట్టి సాహితీ ప్రస్థానం వివరించారు. మిత్రమణికి జరిగిన ఘనసన్మానం మీలో మంచి చైతన్యం కలిగించిందని తెలిపారు. చక్కటి కథనం.
    —-జి శ్రీనివాసాచారి
    కాజీపేట.

    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారిగారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!