సంచికలో తాజాగా

Related Articles

32 Comments

  1. 1

    Sagar

    నిర్మొహమాటంగా చెప్పాలంటే భవిష్యత్తులో గ్రంధాలాయాల ఉనికే
    ప్రశ్నర్ధకం అవడం ఖాయం సర్. ఎందుకంటే పుస్తకాన్ని చదివే ఓపికే లేని మనిషికి గ్రంధాలయానికి వెళ్లే ఓపిక ఉంటుంది అనుకోవడం హాస్యాస్పదమే. ఇక మీరు చెప్పినట్లు ఎప్పటి పుస్తకాలు అప్పుడు చదవడమే సరైన లక్షణం. మంచి వ్యాసం అందించినందుకు మీకు ధన్యవాదములు సర్.

    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందనకు ధన్యవాదాలు .
      నాకైతే నమ్మకం ఉంది.

  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పుస్తక అధ్యయన ప్రాముఖ్యతను.. కొన్న పుస్తకాలను.. కొత్తగా వచ్చే పుస్తకాలను చదవాల్సిన అవసరాన్ని చక్కగా చెప్పారు..
    —–వెంకట్రమ నరసయ్య
    ఈనాడు
    మహబుబాబాద్.

  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    It’s a nice motivation essay to encourage reading skill for future generations
    –D.Rajasekhar
    Kakinada.

  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    👏👏👏💐🙏నిజమే నండీ… ఒకప్పుడు నేను పుస్తకాలు చదవటమే మరో పనుండేది కాదు… నేను రచనలు చెయ్యటం మొదలెట్టిన తరువాత… Raanu… రాను చదవటంపై ఆసక్తి తగ్గిపోయింది… !
    ఇప్పుడు అస్సలు చదవాలనిపించటం లేదు… !!
    —కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కోరాడ వారూ
      ధన్యవాదాలండీ

  5. 5

    sunianu6688@gmail.com

    చాలా బాగా చెప్పారు sir! నాకు కూడా పుస్తక సేకరణ మీద చాలా ఆసక్తి ఉంది. ఈ మధ్య ఉద్యోగ భాధ్యత ల వలన ఎక్కువగా చద వలేకపోతున్నందుకు చాలా భాధగా ఉంది. నేను కాలేజీ లో చదివేటప్పుడు లైబ్రరీలో ఎక్కువ సమయం గడిపేదాన్ని. మా లైబ్రేరియన్ మేడమ్ గారు కూడా వచ్చిన ప్రతి పుస్తకం ముందుగా నాకు దాచి ఇచ్చి తర్వాతే లైబ్రరీ లో పెట్టేవారు. మా ఫ్రెండ్స్ కూడా నేను కనబడక పోతే లైబ్రరీ కి వచ్చేవారు. నేను అక్కడే వుంటానని వారి గట్టి నమ్మకం. ఇప్పటికీ నా దగ్గర చాలా మంది రచయిత ల పుస్తకాలు నా దగ్గర వున్నవి. దురదష్టమేమిటనటే నా పిల్లలకి ఎంత అలవాటు చేయాలన్న పుస్తకపఠనం అలవాటు చేయలేక పోయాను. రచయిత గారు చెప్పినట్లు ప్రతి ఒక్కరూ పుస్తక సేకరణ,pusthakapatanam చేస్తే మన భాష కి మనం కా పా డుకున్నవా రం అవుతాం. రచయిత Dr KLV ప్రసాద్ గారికి హదయపూర్వక ధన్యవాదాలు 👌👍🌹

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చాలా బాగా రాసారు
      ధన్యవాదాలు మీకు.

  6. 6

    Bhujanga rao

    పుస్తక పఠనం ప్రాముఖ్యత గురించి బాగా చెప్పారు. ఇపుడు పిల్లలు ఇంకా మొబైల్ ఫోన్స్ ద్వారా చదవటం వ్రాయటం జరుగుతుంది. స్కూళ్లలో కూడా వాటి వినియోగం ఇంకా కనపడుతుంది ఇది మన పిల్లల దుదృష్టం. పుస్తకాలు చదవటంవల్ల ఇతరులతో సంబంధాలు మెరుగుపడి,ఒత్తిడి తగ్గి మన జ్ఞాపకశక్తి మెరుగు పడుతుంది దానితో మానసికంగా, శారీరకంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది.నాకు మాత్రం మీ ద్వారానే పుస్తకాలు చదవడం చాలావరకు అలవాటైంది సర్.చిరిగిన చొక్కా అయిన వేసుకో…కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో కొటేషన్ బాగుంది.డాక్టర్ గారికి హృదయపూర్వక నమస్కారములు🙏.

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      బాగా చెప్పారు
      భుజంగరావు గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్

  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Dr klv Prasad garu in our olden days there is no cell phones,no TV,only Radio is available and also we are listening our parents words, we read magzines balamitra, bommarillu,chandamama,and books and going to libraries, in schools,drawing, craft classes, games periods, now cellphones,TV’s, iphones ect..and they are bussy in school project works,there is no time for reading books, 20%people are reading books now also. So generation changed. That’s my opinion Dr garu,
    —-S.Rajeswara rao
    Hyderabad.

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పుస్తక పఠనం యొక్క ప్రాముఖ్యతను రచయితగారు ఈ వారం ముఖ్యాంశంగా ఎన్నుకొని వివరించిన విధానం చక్కగా ఉంది. ఏదో..టైంపాస్ కి న్యూస్ పేపర్ తిరగవేసినట్లు కాకుండా ఆరోగ్యము మరియు మానసిక పరిరక్షణ కోసం ఉదయం పూట నడక, వ్యాయామము లేదా యోగాసనాలు, ధ్యానము మొదలగు వాటిని నిత్య వ్యాపకంగా కొనసాగించినట్లు అవకాశం ఉన్నవారు తమ తమ అభిరుచికి అనుగుణమైన అంశాలతో కూడిన పుస్తకాలను చదవడం వలన విజ్ఞానంతో పాటు ఆత్మసంతృప్తి కూడా కలుగుతుంది
    —–బి.రామకృష్ణ రెడ్డి
    సఫిల్గూడ

    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      ధన్యవాదాలు మీకు

  9. 9

    పుట్టి. నాగలక్ష్మి

    మన బాల్యపు పరిస్థితి ఇప్పుడు లేదు.. నిజం చెప్పాలంటే పాఠశాలలకు పుస్తకాల పంపకం, లైబ్రరీ పీరియడ్ ఇప్పటికీ అమలు జరుగుతున్నాయి.. కాని చరవాణి బానిసలైన పిల్లలు చదవడానికి ఇష్టపడడం లేదు.. ముఖ్యంగా కోడ్ త్సునామీ తర్వాత.. చరవాణి చదువులు.. పిల్లలను పుస్తకాలకి మరింత దూరం చేశాయి.. మీ విశ్లేషణ బావుంది.. మారే పరిస్థితులకోసం ఎదురుచూద్దాం

  10. 10

    శ్యామ్ కుమార్ చాగల్

    పిల్లలు చదవటం లేదు, నిజమే, కానీ పెద్దలేమాత్రం చదువుతున్నారు కనక. ఎంతసేపు కొత్త బిచ్చగాడిలాగా పొద్దున్నే లేచి ,ఎఫ్బీ లో,వాట్స్ అప్ లో గుడ్ మార్నింగ్ లు, గొప్ప గొప్ప నీతులు ఫార్వర్డ్ చేయటం తప్ప. పిల్లలను అనటం తప్పే. ఎందుకంటే వాళ్ళు పాఠ్య పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటే పెద్దలకు తృప్తి. అదే ఏ కథలో చదివితే మాత్రం వెంటనే పరీక్షల్లో వచ్చిన మార్కులు గుర్తొచ్చి ఆ పెద్దలే తిడతారు.
    పుస్తక పఠనం గురించి మనకు పాత జ్ఞాపకాలు తప్ప ఇంకేమీ లేవు.

    ఎందుకో గానీ నా కూతురు , కొడుకు మాత్రం ఇప్పటికీ వివిధ రకాలయిన పుస్తకాలు కొని చదివేస్తూ వుంటారు. అవి చాలా మంచి రచనలు.వాటిని చదివే ఓపిక నాకు లేదని పించింది.
    లైబ్రరీ తలుపులు తీసే సమయానికంటే ముందే నేను, స్నేహితుల తో వెళ్లి తలుపు పక్కన కూర్చొని వాచ్మాన్ గురించి ఎదురు చూసే వాళ్ళం.
    కొన్ని సారూ పుస్తకాలిచ్చి స్నేహం చేసే వాళ్ళం. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు.
    పుస్తకాల సేకరణ విషయానికొస్తే సేకరణ తేలికే కానీ అవి దాచుకోవటానికి బీరువాలు, అల్మిరాలు సమకూర్చుకోవడం కష్టం ఎందుకంటే వాటిని ఫ్రీ గా ఎవరూ ఇవ్వరుగా.
    పుస్తకావిష్కరణ.!! చాలా వరకూ అదొక ప్రణాళిక లేని కార్యక్రమం. కొన్ని చోట్ల కనీసం ఆహుతుల్ని పలకరించేవారు వుండరు. పిలిచినవారు చాలా బిజీ గ వుంటారు. కొన్ని సార్లు మంచి నీరు ఇచ్చే సౌకర్యం కూడా ఉండదు. కొందరు టీ ఇస్తారనుకోండి.
    నాకొకటి అర్థం కాలేదు, వచ్చిన వారందరూ ప్రేమ తో ,అభిమానం తో ఎంతో దూరం నుండీ వస్తారు కదా వారికి సాదా సీదా భోజనాలయిన పెట్టొచ్చుగా. పుస్తక ప్రచురణకయ్యే ఖర్చులో అదే మూలకు కాదు నిజం చెప్పమంటే.

    పుస్తక సేకరణ , ముందు గదిలో ఒక అలంకార వస్తువుగా వాటిని పెడుతున్నారు తప్ప, రచయిత గారు అన్నట్లుగా చదివి కాదు.
    పుస్తక ప్రచురణ అనేది ఒక, రచయిత కు పూర్తి చేయవలసిన యజ్ఞం లాంటిది.
    ప్రస్తుతం లైబ్రరీ అనేది పోటీ పరీక్షలకు కావలిసిన పుస్తకాలిచ్చే కేంద్రంగా మారిపోయింది. అసలు నిజం చెప్పాలంటే చదవటం చాలా తేలికైన పని , అన్నింటికంటే . అయితే చదవటానికి కావలిసింది సమయం కాదు అభిలాష.
    నిజానికి మన రచయితలందరూ ఇఒకప్పటి గొప్ప పాఠకులే . అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే , వీరు మంచి రచయితలుగా మారిన తర్వాత అసలు చదవరు. చాలా గొప్పవారిగా మారిపోయిన అహంభావం అనేది ప్రవేశించి
    ఇతర రచనలు తక్కువ గా చూసి, చదవం మానేస్తారు. దానికి వారు చెప్పేది “ఆబ్బె సమయం ఎక్కడుంది ?” అని.

    కాలేజీల్లో బహుమతి గా పుస్తకం వస్తే ఎంత ఆనందం పడే వాళ్ళమో మనకే తెలుసు.
    ఇంట్లో పుస్తకాల లభ్యత , పెద్దవాళ్ళు చదవటం అనేదే తర్వాతి తరానికి చదవటం లో ఆసక్తిని రేపుతుందనేది సత్యం.

    మంచి విషయాన్ని మన ముందుంచిన రచయిత మరియు సంపాదకులకు నా నమస్సుమాంజలి.

    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ సుదీర్ఘ స్పందనకు
      హృదయ పూర్వక కృతజ్ఞతలు.

  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Already read. Simply superb. Vastavanni kallaku kattinattugaa chepparu ade rachincharu
    —-‘mrs Leela.chagal
    Nizamabad.

  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 149 ..పుస్తకాలు చదవడం గురించి రాశారు. ఈ కాలంలో పాఠ్యపుస్తకాలు చదవడానికే విద్యార్థులకు సమయం సరిపోవడంలేదు. దానివల్ల మిగతా పుస్తకాలు చదవడానికి సమయం దొరకడంలేదు. మీరు చెప్పినట్టుగా, పిల్లలు చందమామ, బాలమిత్ర వంటి నీతికథల పుస్తకాలు చదివేవారు. నేను సైతం చిన్నప్పుడు చదివాను. చరవాణి, టివి ప్రవేశంతో పుస్తక పఠనం తగ్గింది. చక్కటి కథనం. అభినందనలు.
    —–జి.శ్రీనివాసాచారి
    ఖాజీపేట

    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారిగారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ వారం చాలా మంచి విజ్ఞాన దాయక విషయాన్ని జ్ఞాపకాల పందిరి లో దాచి అందరి దృష్టికి తేవడం చాలా ఆనందకరం సార్. ఒకప్పుడు ఇంట్లో నన్ను పుస్తకాల పురుగు అనేవారు. మా నాన్న గారు శ్రీశైలం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పని చేసేటప్పుడు ఆఫీసర్ల కు కాలనీ లా కట్టి అన్నీ సదుపాయాలతో పాటు లైబ్రరీ కూడా ఉండేది. నేనప్పుడు ఇంటర్ చదివే రోజులు. అమ్మకు నవల్స్ వార మాస పత్రికలు చదివే విపరీతమైన అలవాటు. ఆ అలవాటు తో నేనూ అన్నీ పుస్తకాలు చదివేదాన్ని . ఆదివారం వస్తే సంతోషం మరిన్ని పుస్తకాలు చదవచ్చని. ఒక మంచి రచయిత పుస్తకం చదివితే మిగిల్చే ఆ అనుభూతి అనిర్వచనీయమైనది. ఆ సంతోషం, ఉత్సాహం అనుభవించిన వారికే తెలుస్తుంది. జర్నీ లో ఏది మర్చిపోయినా పుస్తకాలు మాత్రం మర్చి పోయే దాన్ని కాదు. ఇప్పుడు ఓ చిన్న బాధ బాధ్యత ల వలయంలో చిక్కు కుని వాటికి దూరమవుతున్నానని , అయినా ఖాళీ దొరికితే మాత్రం చదవడానికి ముందు నా ఓటంటాను. అందమైన మీ చక్కని గ్రంథాలయాన్ని చూపించారు సార్. ముద్దుల ఆన్షి ముమ్మాటికి మీ వారసురాలే . చాలా చాలా మంచి విషయంతో వ్రాసిన ఆర్టికల్ అద్భుతంగా ఉంది సార్. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు. మీ మరో విలువైన జ్ఞాపకము కోసం ఎదురు చూస్తూ సెలవు
    👏👌💐👏👌💐👏👌💐👏👌💐🙏🙏🙏🙏

    మొహమ్మద్ .అఫ్సర వలీషా
    ద్వారపూడి (తూ గో జి)

    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      నీ స్పందనకు ధన్యవాదాలు .

  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మస్తకానికి పుస్తకాన్ని మించిన నేస్తం మరోటి లేదు.ఈ నిజం మీ తరం నుండి ఇప్పటి తరం వరకూ గ్రహించిన ప్రతి వారం పుస్తకం ద్వారా పొందే ఆనందాన్ని అనుభవిస్తూనే ఉన్నాం సర్.ఆ అభిరుచి ఏర్పడడమే అభివృద్ధి కి నాంది అని నా నమ్మకం.నేటి తరం పై మాత్రం ఆ ఆశలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.సెల్ఫోన్ పుస్తకానికి బద్ధ విరోధై కూర్చుంది. పుస్తకాలు సేకరించడం కన్నా వాటిని వెంటనే చదవాలి అనే స్పృహ కలిగి ఉండడం ముఖ్యం అని మీరు చెప్పింది సత్యం.మీ బాల్యం పుస్తకాల నడుమ వికశించడం దానికి వారసురాలిగా మీ ముద్దుల మనమరాలు ఎదగడం ఎంతో హర్షించదగ్గ విషయం సర్.మంచి పుస్తకమంటి అంశాన్ని ప్రస్తావించారు ధన్యవాదాలు సర్🙏💐💐💐
    నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    1. 14.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా మీ స్పందనకు ధన్యవాదాలు .

  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    149 వ సంచిక.
    నేను చదివిన మా ఊరి హడిలో ( 7వతరగతివరకే వుండె) లైబ్రరీ ఇన్ చాల్జ్ గా షణ్ముఖాచారిసర్ వుండేవాడు .ఆరోజుల్లో చందమామ,బాల,వంటిపత్రికలు రాగానే నేనే తీసుకునేవాడిని.వేరేపుస్తకాలు అప్పట్లో నాకు పరిచయం లేదు.మాఊరిలో రంగారావుగారని ఒకవతన్ దార్ ఉండేవాడు ఆయనదగ్గర,చాలాపుస్తకాలుండేవి.1952 ప్రాంతంలో మాఅమ్మ గారు,చనిపోయింది.మాయింట్లో భారత,భాగవతాలు ఉండేవి కాని అవ్వి మాయాతలనాటివి లేదా మానాన్న గారి తాతలనాటివి కాగితాలు మ్యినిఫోల్డ్ కాగితాలవలె గోధుమరంగులో వుఅండేవి కమ్మలు తిప్పటం కష్టంగావుండేది.అచ్చు ఇప్పటిలా కాక ఈచివరినుంచి ఆచివరివరకు అచ్చువేసి వుండేది పద్యం లోని లైను లైనుకు ఒక నిలువు గీత పద్యంచివరన రెండు నిలువు గీతలుండేవి.మానాన్నశగారువమనశ్శాంతికోసం మహాభారతమంతా అప్పుడు చదివిండు మానాన్న దోస్తు నర్సయ్య పటేలు రోజూవచ్చి కూర్చునేవాడు పగలు .తాను చదివి ఆయనకు చెప్పేవాడు మానాయన. అయితే రంగారావు గారిదగ్గరనుంచి ప్స్తకాలు తేవటం నావంతు.రంగారావు మామ ఇగో రామచంద్రయ్యా తీస్కపోయిన పుస్తకం తెస్తేనే ఇంకొక పుస్తకం ఇచ్చూడు ఆ .అని కచ్చితంగా ఒకపుస్తకం ఇస్తేనే ఇంకో పుస్తకం ఇచ్చేది.అట్ల మానాయన మహాభారతం చదివి నర్సయ్య పటేలుకు చెప్పుతుంటేవనేనూ వినేవాడిని పెద్దగా తెలిసేదిగాదు గాని మొత్తం భారతం మానాయన చదువగా విన్న. మా ఆర్థికపరిస్థితి పుస్తకాలు కొనటానికిఅనువుగా లేకుండె చదువుకునే రోజులల్ల హనుమకొండల డిటెక్టివ్ పుస్తకాలు బాగ చదివేవాణ్ణి.డిగ్రీకి వచ్చినాంకనే సాహిత్యానికి సంబంధించి కాశీభజిలీకథలు ప్రబంధ్లు వంటివి చదివినశమాగురువులు జీవీఎస్వగారి ప్రభావంతో .
    మిత్రమండలి వేరు వేరు పుస్తకాలు చదివే అలవాటు చేసింది.ఏమి చదివినానో కాని సంపాదించిన జ్ఞానం అంతంత మాత్రమే.
    మన చూట్టున్న వ్తావరణంకూడా మనమీద ప్రభావం వేస్తదని మిరన్నది నిజమే ఇప్పుడు పాఠ్య పుస్తకాలు అదికూడా ఇంప్ర్టెంట్ అని టిక్కులువపెట్టినవేశచదువుతున్నరు పిల్లలు.
    లైబ్రరీ నార్వహించటం లో మిరన్న విషయాలు సరైనవే .
    అస్తు.
    —రామశాస్త్రి

    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ జ్ణానాం అంతంత మాత్రం కానే కాదు.మీ జ్ఞాపకశక్తి అమోఘం.ఇది నేను చాలా ఆలస్యం గా తెలుసుకున్నాను.గొప్పవాళ్ళు ఎప్పుడూ తమని తాము టగ్గించుకుంటారు.అదే మీ గొప్పతనం.మీ పరిచయం నాకు గొప్ప విజ్ఞానం.ఇది ముఖ స్తుతి కాదు శాస్త్రి గారూ.ధన్యవాదాలు.

  16. 16

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Baagundi sir but now digital system has come that’s why printing of books are need basis only.
    But like physical books only.
    –KJ srinivas
    Hyderabad.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!