సంచికలో తాజాగా

Related Articles

34 Comments

  1. 1

    డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    –డా కె.ఎల్.వి.ప్రసాద్
    సికిందరాబాద్.

  2. 2

    Neelima

    డాక్టర్ గారు
    ఈనాడు పెళ్లిళ్ల కోసం చాలా బాగా వివరించారు..
    అభినందనలు

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      హృదయ పూర్వక కృతజ్ఞతలు.మీకు

  3. 3

    Sagar

    ప్రతి ఒక్కరూ ఓపికగా ఎదురు చూస్తే ఈ సమస్యలన్నీ సజావుగా పరిష్కారం అవుతాయి సర్. ప్రతి ఒక్కరూ హడావిడి పడి తమ వంతు ముందుగా ముగియాలనుకోవడమే అసలు ఇబ్బంది. మీరు అన్నట్లు ఎంత దగ్గరివారైనా నిబంధనలు పాటించాలి. అప్పుడే అంతా సజావుగా జరుగుతుంది. మంచి వ్యాసం అందించిన మీకు ధన్యవాదములు సర్.

  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Nenu jagrathaga vyavaharinchali ani munduga hecharinchi nanduku dhanyavadamulu .🙏
    —–ప్రొ.రవికుమార్
    హనంకొండ.

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఆనాటి పెళ్ళిళ్ళ కు, ఈనాటి పెళ్ళిళ్ళ కు తేడా చాలా చక్కగా వివరించారు సార్. దానితో పాటు ఆనాటి రుచులు, పిలుపుల్లో ఆప్యాయతలు, ఈనాటి హంగులు, దుబారాలు, క్రమశిక్షణ, అతిక్రమణ, అది భోజనాల దగ్గర కాని, అభినందనల విషయములో కాని వ్యత్యాసాలు చాలా చక్కగా కళ్ళకు కట్టినట్లు వ్రాశారు సార్. మీరు వ్రాసిన సమస్యలు చాలా మంది ఎదురు కుంటున్నదే . మంచి సమస్యను అందరి దృష్టికి తీసుకుని వచ్చి నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇలాంటి ఆర్టికల్ చదివి నప్పుడు తప్పొప్పులు తప్పక తెలుసుకుని ముందు ముందు ఇలాంటివి జరగకుండా సరి చేసుకునే అవకాశం కలుగుతుంది.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ఫంక్షన్ లలో ఇలాంటి అవకతవకలు మామూలే అని సర్దుకు పోవడం అలవాటైన మూలాన ఎవరూ ఇలాంటి విషయాలు బాధాకరంగా ఉన్నా బహిర్గతం చేయరు. చక్కని పెళ్ళి పందిరి జ్ఞాపకాలను మీ జ్ఞాపకాల పందిరిలో దాచి మాకూ పంచి మీ ఆదర్శాల పీట మాకు వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీకు 🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
    మొహమ్మద్. అఫ్సర వలీషా
    భవానీ పట్నా ( కలహంది)

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కవయిత్రి గారికి
      హృదయపూర్వక
      ధన్యవాదాలు.

    2. 5.2

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      నీ స్పందనకు ధన్యవాదాలు .

  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng Doctor garu,
    You said it rightly. Formation of “Q’ to greet the newly wedded couple now-a-days has become a very painful part of wedding particularly to the aged guests.
    Instead, if one individual come to the guests & collect “AKSHINTALU” & gifts if any, to be passed on to the couple. (Just like what is done in the temples)
    —Surya narayana rao
    Hyderabad.

  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రతి పెళ్లి పందిరిలో అతిథులందరూ ఆస్వాదించేది మరియు కొంతకాలం పాటు గుర్తు చేసుకునే సంఘటనే! విందు భోజనం. పెళ్లి పీటల మీద కూర్చున్న వధూవరులు ,వారి దగ్గరి బంధువులు ఎంత ఖరీదైన ఆభరణాలు బట్టలు వేసుకున్నారో, ఎంత ఖరీదైన బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారో గమనించేది బహు కొద్ది మంది మాత్రమే . పెళ్లి తంతు చూసినా, చూడకపోయినా పెళ్లికి హాజరైన ప్రతి ఒక్కరూ ప్రత్యక్షమయ్యేది డైనింగ్ హాలు లోనే. రచయిత గారు తెలియజేసినట్లు నిర్వాకులు సరైన సమయపాలన మరియు ప్రణాళిక పాటించకపోవడంతో ఖరీదైన ఎన్నో రుచికరమైన పదార్థాలు ఉన్నప్పటికీ అవి అందరికీ అందుబాటులో లేక దగ్గరలో ఉన్న కొద్దిపాటి పదార్థాలతోనే సరిపెట్టుకొని రావలసిన పరిస్థితులు కూడా గమనిస్తుంటాము .విందు భోజనాలకున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని కాబోలు తిరుపతి ,నెల్లూరు ప్రాంత వాసులు పెళ్లి ముహూర్తాలు తెల్లవారుజామున నిర్ణయించుకొని ముందు రోజు రాత్రి విందు ఏర్పాటు చేయటం వలన అతిథుల పట్ల పెళ్లి పెద్దల మర్యాదలకు భంగం కలగదు.
    ఈ వ్యాసం చదువుతున్నప్పుడు నాకు, నాలుగు సంవత్సరాల క్రితం బెంగుళూరులో మా దగ్గరి బంధువుల పెళ్లి పిలుపు ఒకటి గుర్తుకు వస్తోంది. అందులో తెలియజేసిన విషయం… ముందు రోజు రాత్రి విందు భోజనాలు . మరుసటి రోజు రాత్రి వివాహము. పెళ్లి పత్రిక చదివిన తర్వాత నేను వారితో, మరుసటి రోజు పెళ్లికి తప్పకుండా వస్తాను !అని అన్నాను. దానికి వారు మరుసటి రోజు రాకపోయినా పరవాలేదు ,అది కేవలము వధూవరులకు సంబంధించిన కార్యక్రమమే ,ముందు రోజు భోజనానికి తప్పకుండా రావాలి . ఇది వారి ఆర్భాటమో, లేదా దానికున్న ప్రత్యేకతో అర్థం కావట్లేదు. ఆఫ్ కోర్స్ !నేటి పరిస్థితులు అలాగే ఉన్నాయిలెండి😁😁.
    —బి.రామకృష్ణా రెడ్డి
    హన్మకొండ

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు రెడ్డి గారు

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    లోకంలో జరిగే శుభకార్యాలలో ధనవంతులు వారి వైభవం చాటుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యము ఇస్తారు.

    వాళ్ళు ముహూర్తం,(సమయం) కార్యక్రమం, అలంకరణ, పటాటోపంకు ఇచ్చిన విలువ భోజనాలకు ఈయరు.

    ఉత్సవానికి పిల్లలు, వృద్ధులు కూడ వస్తారు. ఈ రోజుల్లో చాలా మంది శర్కర బీమారీతో బాధపడుతుంటారు. వారు సమయానికి తినకపోతే ఏమౌతుందో అందరికీ తెలిసిందే! వారిగురించి కూడ కాస్త ఆలోచించాలి కద!

    ఇక ఫోటోలు —
    ఈ ఫోటోల కార్యక్రమంతో విసుగొస్తుంది. అక్షతలు(తలంబ్రాలు) వేయడానికి అరగంట ముందే భోజనాలకు ఆహ్వానిస్తే అత్యవసరము అనుకున్నవాళ్ళు భోజనానికి వెలతారు. మిగతావారు కార్యక్రమంలో ఉంటారు. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. భోజనాల తర్వాత మొదట వెల్లినవారు వచ్చి అక్షతలు వేస్తారు.

    నాకు తోచింది నేను చెప్పాను. తప్పుగా అనుకోకండేం!

    ఆచార్య తంగెడ జనార్దనరావు

    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      హృడయ పూర్వక కృతజ్ఞతలు సర్ మీకు

  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు చెప్పిన మాటలకు మరిన్ని జొడింపులు, ముహూర్తం సమయానికి జరగదు, బ్యూటీషన్లు వధువు కు మెరుగులు దిద్దే పనిలో కాలాతీతమౌతుంది,తాళి సమయానికి రెండవ పురొహితుని విన్యాసాలు (ఫోటో గ్రాఫర్).. ఆహుతులు విజ్ఞతతో వ్యవహరించాలని, కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నావారు తమ పరిధి దాటకుండా మెదిలితే … అంతా ఆనందంగా జరుపుకునే అవకాశం ఏర్పడుతుంది
    —–జానికీ రామ శాస్త్రి
    కరీంనగర్.

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పురోహితుడు లేకున్నా పెండ్లి అవుతుందేమోగాని ఫోటోగ్రాఫరు దర్శకత్వం లేనిది కార్యకలాపాలేవీ జరగవు.పురోహితుని మంత్ర్ల మధ్య ఓసారి ఫోటోగ్రాఫరు దర్శకత్వంలో మరోసారి తాళికడ్తాడు పెండ్లి కొడుకు.అన్నీ రెండు రెండుసార్లు చేయాలె తలబ్రాలు పోస్యున్నప్పుడు వరుడు వధువు ఒకరినొకరు చూచుకోవటం వుండదు.వారి వారి మనోభావాలెట్లవుంటయో పరస్పర చూపులుండవు.వధూవరులు ఫోటోగ్రాఫర్ ను చూచి ఇగిలించవలసినదే.పూలమాలలు కూడా వేస్తూ పెండ్లిపిల్ల సిగ్గుపడదు సిగ్గుపడ్డట్టుఫోటోగ్రాఫల్ మొహం చూస్తుంది వరూడూ నిస్సహాయంగా ఫోటోగ్రాఫరుమొహమే చూడాల్సి వస్తుంది…రెండుసార్లు తాళికట్టాలె.రెండుసార్లు మెట్టెలు పెట్టాలె.ఎన్నిసార్లు తలబ్రాలు పోయాలోవపోస్తూ,ఆగాలో ఆగుతూ పొయ్యాలో అర్థంకాదు. తమనెత్తిమీద అక్షతలెవరు వేస్తున్నారోకూడా వధువరులకూ పట్టదు .వారికి పట్టిందల్లా ఒకేఒక్క ఫోటోగ్రాఫరూ ఆయన దర్శకత్వమూనూ.
    జానకిరామశాస్త్రి గారుచెప్పింది అక్షరాలా నిజం.
    ఇక భోజనాలసంగతి చెప్పేపని లేదు.. అనుకున్న సమయానికి ముహూర్తం జరగక అతిథులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసి ఒక్కటేసారి పొద్దెక్కినాక కొట్టంతలుపులు తీస్తే ఓటిమీద ఓటి పడుతూ పరుగెత్తే పశువుల లాగ( మన్నించాలె) తోసుకొని తోసుకొని తిండికోసం పోవటం..నిదానంగా తినే అవకాశమే వుండదు.
    ఇక అతిథుల భోజన ప్రక్రియ. బఫెట్ భోజన ఏర్పాట్లు ఎవరికెంత ఏదికావాలో అది అంతవేసుకొని తినటం జరగాలె.ఎంతెంత ఆహార పదార్థాలు ఎంత వ్యర్థం అవుతాయో చూస్తే చికాకు కలుగుతుంది.
    ఇవాళ ఫన్క్షన్లన్నీ తలిదండ్రుల చేతిలో ఉండటం లేదు పిల్లలచేతిలోనే వుంటున్నై
    పిల్లల సంతోషాలకోసం తలిదండ్రులు మౌనంగా వుండవలసివస్తున్నది.
    ఇక రిసెప్షన్ అగచాట్లు( అతిథులవే) వేరే .7 గంటలసమయమని శుభ లేఖలో ఇస్తే 9 గంటలకూ గాని వధూవరులు హాలుకు రారు. రాగనే ఫోటోలు దిగటం. అతిథులను ఆహ్వానించినమనే యాది గాని స్పృహ గాని ఆహ్శానించిన భోజనాలసంగతి సరేసరి.ముందర చెప్పినదానికిభిన్నంగా ఏమీవుండదు.
    ఇదంతా ఒక చర్చకు అలవికాని లేదా వీలులేని విషయం అయిపోయింది…
    ఇఇప్పటికే ఎక్కువ అనవసర చర్చ చేసినామేమో
    —రామశాస్త్రి.

    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు శాస్త్రి గారు.

  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పూర్వం అతిథులు పరిమితంగా వుండేవారు.బంధువులే ఎక్కువ స్నేహితులంటే కుటుంబ స్నేహితులుమాత్రమే అదీ పరిమితమే.పెండ్లికి వారం రోజులముందర వచ్చి పనులలో సాయం చేసి పెండ్లి అంతా అయినాక వచ్చిన దగ్గరిబంధువులు వెళ్ళిపోయేవారు.
    పెండ్లి పిలుపు ఆహ్వానాలు కుటుంబ పెద్ద తలఫున్నే పెళ్ళేవి.ఇవాళ తలిదండ్రులు ఆహ్వాన పత్రికలు అట్చువేయించినా పిల్లలు తమమిత్రులకోసం ఆహ్వానాలు వారేవేసుకుంటున్నరు.పెండ్లికొడుకు/పిల్ల ల తోడబుట్టిన వారూ తమ తోడబూట్టిన వారి పెండ్లికోసం థమ పేరుమీద ఆహ్వానాలు అచ్చు వేసుకుంటున్నరు.లేదా థమ మిత్రులనుఫోన్ద్వారాఆహ్వానిస్తున్నరు.అతిథులెంతమందో అంచనా కు రాలేడు కుటుంబపెద్ద.. అదికూడా భోజనాలదగ్గర తొక్కిడికి కారణం అవుతున్నది.ఇంకొక కారణం ఫన్క్షన్ హాల్ చుట్టుపక్కలవుండేవారు భోజనాలు ఆరటభంకాగానే మొదటిబ్యాచ్లో వచ్చి దర్జాగా భోంచేసి వెళ్ళిపోతున్నరు .
    కంట్రోల్ చెయ్యలేని కారణాలున్నాయి.పెండ్లి పద్ధతి భోజనాల గురించిఇదివరకేచర్చ జరిగిందిగదా.సర్!
    —రామశాస్త్రి

    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అది వేరు
      ఇది వేరు కడాసర్..
      అయినా ధన్యవాదాలు మీకు.

  12. 12

    శ్యామ్ కుమార్ చాగల్

    వివాహ సంబరాల్లో ఈ మధ్య కాలం లో జరిగే అనర్థదాయకమైన, అనారోగ్య కరమైన సంప్రదాయాలు చోటుచేసుకుంటున్న సమయం లో వాటి గురించి క్లుప్తంగా ఉదాహారణలతో చర్చించడం బావుంది. ఈ విషయాల్లో ఎన్ని రకాలుగా వివరించినా తక్కువే.
    ప్రతీ ఒక్కరు ఈ ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారే . అయినా వాటిని వాడుకలోనుండీ తీసేసే ప్రయత్నం చేయరు,
    పెళ్లి మొదలయ్యిన క్షణమ్ నుండీ అతిధుల గురించి పట్టించుకునేవారే వుండరు. వధూవరులను ఆశీర్వదించే కార్యక్రమం ఒక ప్రహసనం అనే చెప్పాలి. దాని గురించి తోపులాట, పెద్ద క్యూ , అక్కడ ఫోటో లు, ముఖ్యమైన అతిధులు,రాజకీయ నాయకులు, ముఖ్యులు క్యూ ని అతిక్రమించి రావటం, వారికి ప్రత్యేక ఆతిధ్యం గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు.
    దాని తర్వాత భోజనాల వద్ద పెద్ద క్యూ. కొన్నే కౌంటర్లు, కిక్కరిసిన హాలు లో ఒకరి ఎంగిలి కంచాలు ఇంకొకరి వీపులకు అంటిస్తూ,మన బట్టలకు మరకలు అంటిస్తూ..పళ్లెం నిండా మరి మరుక్షణం తిండి దొరకదేమో అన్నంత నిండుగా తిండి పదార్థాలు. , చూడటానికి ఇబ్బంది ఉంటోంది అన కుండా ఉండలేం. వడ్డించుకున్న పదార్తాలల్లో సగాని పైగా పళ్లెం తో సహా చెత్త బుట్ట దాఖలు.
    ఇహ భోజనాల వద్ద తినమని ప్రేమ గా అనేవారు కరవైపోయారీ రోజుల్లో. అందరూ హడావిడిగా, కంగారు పడుతూ , కావాల్సిన పదార్థాలు గురించి వెదుకుతూ, చెమటలు కక్కుతూ తినటం ఆ తర్వాత అమ్మయ్య అని ఊపిరి తీసుకొని ఇళ్లకు బయలు దేరటం అన్నది ఒక పెద్ద తప్పని సరి అయ్యిన కార్యక్రమం గా మారిపోయింది.
    ఇక సమయ పాలన అన్నది వివాహాల్లో కనపడటం లేదు. సమయానికి వెళితే అక్కడ అంతా ఖాళీగా ఉంటుంది సరికదా ఇక పెళ్ళివారు కూడా కనపడరు.

    పెళ్లి భోజనాల విషయానికొస్తే,అక్కడ అనవసరపు ఆర్భాటాలు ఎక్కువైపోయాయి. భోజనం తో బాటు చాట్ , స్వీట్, ఐస్ క్రీం,పండ్లు , టిఫిన్లు,దోసెలు, ఇలాటివి పెళ్లి వారి ఆర్ధిక స్థోమతను చూపించుకునే ప్రయత్నం గా మారిపోయింది. ఆర్థికంగా వీలు ఉంటే అలా చేయటం లో తప్పు ఏంటని అనొచ్చు,అయితే ఇవన్నీ లేని పెళ్లి భోజనాలు చప్పగా కనిపించటం మొదలయ్యింది.
    కానీ ,వడ్డన కార్యక్రమం తో వుండే పంక్తి భోజనాల ముందు ఇవన్నీ దిగదుడుపే అని నా అభిప్రాయం.

    ఇకపోతే , డబ్బులు ఏంచేయాలో అర్థం కాక ఇంకో కొత్త అర్థం లేని సంప్రదాయమొకటి మొదలయ్యింది, అదే రిటర్న్ గిఫ్ట్.
    ఇవన్నీ ఆర్థికంగా అమ్మాయి తరఫు వారిని ఇబ్బందుల పాలు చేయటమే తప్ప ఇంకొకటి కాదు.

    ఎదురు చూసిన కార్యక్రమం గంటల ఆలస్యంగా మొదలయ్యి న తర్వాత, పెళ్లి ఇంటి వారి ఫోటోల కార్యక్రమం మనం చచ్చినట్లు వీక్షించ వలసిందే.
    ఇన్నీ ఇబ్బందులను ఎదుర్కోవటానికి మనం సన్నధులమై న తర్వాతే పెళ్లి వేడుకలకు హాజరు కావాలి సుమ.

    అసలు సమాజం లో చోటు చేసుకుంటున్న విపరీత పోకడలను, జ్ఞాపకాల పందిరి రూపంలో మన కందిస్తున్న రచయిత,సంపాదకులకు మనందరి తరఫున ధన్యవాదాలు.

    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చాలా బాగా రాసావు మిత్రమ
      కృత జ్ఞత లు.

  13. 13

    Bhujanga rao

    పూర్వపు రోజుల్లో జరిగిన పెళ్లిళ్లు మరియు ఇప్పుడు జరుగుతున్న పెళ్లిళ్లకు ఉన్న వ్యత్యాసాలు చాలా బాగా వివరించారు సర్.పెళ్లి అనేది ఆడంబరాల కంటే జ్ఞాపకాలకు సంబంధించినదిగా గుర్తించాలి. రెండు మనసుల కలియుక మరియు రెండు కుటుంబాల మధ్య కొత్త అనుబంధాలు,ఇలాంటి ఆశయాలతో ఆరంభమైన వేదిక ఆడంబరాలకు,వృధా ఖర్చులకు వేదిక అయింది. వివాహపు ఖర్చులను అన్ని భాగాలుగా విభజించి,ఏ భాగానికి ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారు ఆలోచించి చేయాలి,కొన్ని ఊహించని ఖర్చులు కూడా అవుతాయి.ఆడంబరాల కు పోకుండా విందు భోజనాలకు ఉన్న ప్రాముఖ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేయాలి.జ్ఞాపకాల పందిరి 148 లో అందరికి ఉపయోగకరమైన విషయాన్ని అందించిన మీకు హృదయపూర్వక నమస్కారములు సర్.🙏

    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      భుజంగ రావు గారూ
      హృదయ పూర్వక కృతజ్ఞతలు సర్ మీకు.

  14. 14

    sunianu6688@gmail.com

    రచయత గారు చెప్పినట్లు జరిగితే ఎంత బాగుండు అనిపించింది చదవగానే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలా ఆశించడం అత్యాశే. ఇంతకుముందు పెళ్లి అంటేనే బంధువులందరూ 10రోజుల ముందుగానే పెళ్ళి పనులలో పాలుపంచుకునే వారు. ఇప్పుడు సొంత అక్కాచెల్లెళ్ళు, అన్నదమ్ములు పెళ్లి 1 గంట,1 రోజు ముందుగ వస్తారు. వచ్చినా వాళ్ల shopping, వాళ్ల personal పనులు తప్ప పెళ్ళీ పనులలో పాల్గొనరు. ఎవరి హడావుడి వారిది. రచయిత KLV ప్రసాద్ గారు చెప్పినట్లు ప్రతీ ఒక్కరు ఈ విషయం మీద అవగాహన కలిగి ఉండాలి. మంచి విషయము గురించి వ్రాసిన రచయిత KLV ప్రసాద్ గారికి ధన్యవాదాలు 👌👍💐

    1. 14.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు.

  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మా వైశ్య కుటుంబాల్లో ఈవెంట్స్ అనుకుంటూ కోలాటం, మ్యాజిక్ షో, డ్యాన్స్ పోటీలు… ఇలా వివాహపు పవిత్రతను తగ్గించే ఓ జాతర లాంటి గలభా అగుపిస్తున్నాయి.
    —-శ్రీధర్.చోడారపు
    కవి,హైదరాబాద్.

    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కవి గారి స్పందనకు
      కృత జ్ఞత లు.

  16. 16

    Rajendra Prasad

    We need to take care of serving food on time beside sufficient counters. I found in some marriages the host will not care to wish the guests personally but confine to their rituals on the stage which I think is not a good reception

  17. 17

    పుట్టి. నాగలక్ష్మి

    నాటి, నేటి వివాహ తంతు, ఆశీర్వాదాల క్యూ, భోజనాల ప్రహసనం.. మీ వర్ణన సూపర్ డాక్టర్ సాబ్..

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!