సంచికలో తాజాగా

Related Articles

33 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    —డా కె.ఎల్.వి.ప్రసాద్
    సికింద్రాబాద్.

    Reply
  2. 2

    Sagar

    మీరు అన్నట్లు పాలకులు తలచుకొంటే కానిది ఏముంది సర్? కాకుంటే వారికి చిత్తశుద్ధి అవసరం. అంతే గాక పాదచారులకు అలాంటి సదుపాయాలు లేకనే లెక్కలేనన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మార్పు వస్తుందని ఆశిద్దాము. మీకు ధన్యవాదములు సర్.

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందనకు ధన్యవాదాలు .

      Reply
  3. 3

    Shyam Kumar Chagal

    రోడ్డు మీద నడుస్తున్న పాదాచారులకి అత్యధికంగా ప్రాణాపాయం ఉంటుందని సర్వేల వల్ల తేలింది.
    పట్టణాలలో మధ్య పాదాచారులకు కేటాయించిన ఫుట్పాత్లన్నవి మాయమైపోయాయి.
    ఎక్కడో చదివాను పాదాచారులు ఎడమవైపున నడవకుండా రోడ్డుకి కుడివైపు నడవడం మంచిదని.
    ఎందుకంటే ఎదురుగా వస్తున్న వెహికల్స్ మనకు కనపడతాయి ఎడమవైపు నడుస్తే వెనకనుంచి వచ్చే వాహనాలు మనల్ని కొట్టి పోయే వరకు మనకు తెలియదు. అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాల్లో సైకిల్ నడిపే వారికి ప్రత్యేకంగా పాదాచారులకు ప్రత్యేకంగా కేటాయింపబడి ఉన్నాయి. అత్యధిక జనాభా కేంద్రీకృతమైన మన దేశంలో ప్రాణాలకు విలువ తక్కువ. కనుక అలాంటివి మన ప్రభుత్వాలు చేపట్టాలని మనకు తెలుసు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సులభమైన మార్గం అందరికీ నడక అన్నది తెలిసిన విషయమే అయినప్పటికీ వాడికి తగిన సౌకర్యాలు లేకపోవడంతో పార్కులలో మైదానాలలో నడక కొనసాగించడం మనం చూస్తూనే ఉన్నాం.
    ప్రభుత్వాలు ఉన్నట్టుండి మేల్కొని ఫుట్ పాతుల మీద ఉన్న ఆక్రమణలను తొలగించినప్పటికీ మరో రెండు రోజుల్లో అవి యధా ప్రకారం సిద్ధిరస్తుగా మారిపోతాయి. ఫుట్పాతుల పునరుద్ధరణ అనేది ప్రజా ఉద్యమంగా మారనంతవరకు ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు రాదు. ఎందుకంటే మన పాలకులకు మనకు ప్రజాకర్షణ కలిగించే ఉచిత లాభాలు మాత్రమే అత్యంత ప్రాముఖ్యత కలిగినవి కనుక.
    ప్రతి వారం మంచి విషయాన్ని మన ముందుకు తెచ్చి మన మధ్య చర్చకు నిలుపుతున్న డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ మరియు సంచిక యాజమాన్యానికి నా కృతజ్ఞతలు.

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా చాలా బాగా రాసావు
      నీ స్పందనకు ధన్యవాదాలు .

      Reply
  4. 4

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 147 లో పాదచారుల పని అంతే..పాదచారులకు కలిగే అసౌకర్యాలు బాగా తెలిపారు.రోడ్ మీద నడిచే పాదచారులకు కనీస సౌకర్యాలు లేవు.నడిచేటప్పుడు వ్యతిరేక దిశలో నడవాలి, ఎదురుగా వచ్చే వాహనాలు కనపడుతాయి కావున ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువగా వుంటుంది. పాదచారుల నడుకకు ప్రయోజనం చేకూర్చేందుకు ఫుట్ పాతులను మెరుగుపరచాలి. ఫుట్ పాతుల ఆక్రమణలు అడ్డుకోవడానికి చొరవ ఏదైనా నిబద్ధత కలిగిన విధానం అవసరం.ఇది ఏమైనా ప్రభుత్వాల మద్దతు మరియు స్థానిక సంస్థల సంఘాల మద్దతు లేకుండా ఆక్రమణలను ఎదుర్కోవడం చాలా కష్టం.మంచి జరగాలని ఆశిద్దాం.ప్రతివారం ఒక మంచి విషయాన్నీ అందిస్తున్న మీకు ధన్యవాదములు సర్🙏

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      భుజంగరావు గారూ
      మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు .

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పాదచారుల ఇక్కట్లను చాలాబాగా చెప్పారు సార్ . ఇవన్నీ అందరి అనుభవం లోనివే . కాని రికార్డ్ చేయడంలోనే ఉంది గొప్పతనం . ఆపని మీరు చేశారు . అభినందనలు డాక్టర్ గారూ !
    మెట్టు మురళీధర్

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Correct information and awareness for footpath walkers 🚶‍♂️🚶‍♂️🚶‍♂️🚶‍♂️
    —-Mrs.Rama.sunkara
    Hyderabad.

    Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా ప్రయోజనకరమైన సూచనలతో కూడిన వ్యాసం. రోడ్డు పక్క అనధికారిక దుకాణాలు అధికారులకు ఆదాయాలు, పాదచారలకు ప్రాణ సంకటాలు. అసలు ఫుట్ పాత్ అనే పదం పిల్లలకు తెలియని స్థితి తెస్తున్నారు భవిష్యత్తులో.
    —–సరసి
    హైదరాబాద్.

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సరసి గారు ధన్యవాదాలండీ.

      Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    👏👏👏బాగుంది… నిజమే.
    —–కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

    Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ గారు మీ
    జ్ఞాపకాల పందిరిలో
    అనుభవాల వల్లరి
    బాగుంది
    —అనీల్ ప్రసాద్
    హన్మకొండ

    Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పాదచారుల స్థలం చిరువ్యాపారస్తులు మాదే అనే స్థాయికి వచ్చింది ఇప్పుడు.

    నేను గోదావరి ఖనిలో చూశాను. మన నగరాలలో రోడ్డు డివైడర్ ఉన్నట్టగా రెండు గీరల వాహనాలను రోడ్డు మధ్యలో అడ్డంగా పెట్టి కొనుగోళ్ళు చేస్తారు. వాహనాలకు రెండు వైపుల జనాలు నడుస్తు పోతూ వారి పనులు వారు చేసికొని పని అయపోగానే తమ వాహనాన్ని తీసుకొని వెళ్ళి పోతారు.

    మీలాగే నాకు చిన్ననాటి జ్ఞాపకం సైకిల్ తో ఒకటుంది. మా మేనమామగారు రాజేశ్వరరావు అప్పడప్పుడు కొత్త సైకిల్ వేసుకొని మా బాపును(తండ్రి) కలువడానికి వస్తు ఉండేవారు. ఇద్దరు ఇంటిలోపల సంభాషణలో నిమగ్నులైనపుడు ఆ సైకిల్ తీసుకొని తుఱ్ఱున బజార్ లో పడేవాన్ని .కాని దాని మీద కూర్చుంటే పెడల్స్ కాళ్ళకు అందవు. అందుకని కాంచి తొక్కేవాడిని. బాలన్స్ ఆగక కాళ్ళకు దెబ్బలు తాకు తుండేవి.

    ఆస్ట్రేలియాలో మానవులు రోడ్డు దాటడానికి మనిషి బొమ్మను సంకేతంగా వాడుతారు (2009 లో నా అనుభవం) .మనిషి బొమ్మ గ్రీన్ కలర్ కు రాగానే అందరు పరిగెత్తేవారు. రెడ్ కలర్ పడగానే ఆగిపోయేవారు. ఇప్పడు ఇది హైదరాబాదులోను కనబడుతుంది.

    ఆస్ట్రేలియాలో హారన్ మ్రోగించడం సాధారణంగా ఉండదు. చాలా క్రమశిక్షణ కలిగిన దేశము. నేను ఒకసారి ఈ విషయం తెలియక మన భారతదేశ తరహాలో రోడ్డు దాటుతున్నాను. ఒకతను హారన్ అదేపనిగా మ్రోగిస్తున్నాడు. నేను యమస్పీడ్ గా ఉరికి రోడ్డు దాటాను. త్రుటిలో ప్రమాదం తప్పింది. తరువాత అడిగితే మా అమ్మాయి అక్కడి విధానం చెప్పింది.
    ఇలా కొన్ని అనుభవాలు నాకు ఆ దేశపువి ఇంకా మిగిలి ఉన్నవి.

    ఆచార్య తంగెడ జనార్దనరావు
    హన్మకొండ.

    Reply
    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చక్కని మీ
      అనుభవాలు జోడించి
      నా వ్యాసానికి వన్నె తెచ్చారు.
      మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు సర్ .

      Reply
  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అతి సాధారణంగా కనిపించే (తీసుకునే) తీవ్ర సమస్య పై స్పందించి వ్రాసిన మీ జ్ఞాపకం గొప్పది. మీరు మందులు ఇచ్చే వైద్యులు(మెడికల్ డాక్టర్) మాత్రమే కాదు, సాంఘిక సమస్యల వైద్యులు కూడ. ధన్యవాదాలు.
    —జనార్ధన్.ఎమ్.సి
    హనంకొండ.

    Reply
    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  12. 12

    డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది గురుజీ
    మరచిపోయి మరుగున పడుతున్న నడక గురించి
    భాగ్యనగరం దారుల గురించి….
    వీధిలో జరిగే సంత గురించి…..
    మధ్యతరగతి వారి సమస్యల గురించి……
    చాలా చక్కటి వివరణ అందించారు…
    నిజమే వైజాగ్ లో లాగా ఒక నిర్ణీత సమయం ఉన్న…
    అమెరికా లో లాగా రోడ్డు దాటే వరకు అలాగే రూల్ ఉన్న….. బాగుంటుంది………
    భాగ్యనగరం రహదారులు ఎంత వెడల్పు అయిన అంతకు అంతా వాహనాల జోరు కూడ పెరుగుతునే ఉంది.
    ఇదే నేటి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో స్థితి… పరిస్థితి…..
    —-స రళ శ్రీ లిఖిత
    సికిందరాబాద్.

    Reply
    1. 12.1

      డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నిజమే సర్.రోడ్డు మీదకి కాలినడకన వెళ్ళినప్పుడు ఈ స్థితి దాదాపు అందరికీ పరిచయమే.కానీ మరలా బయటికి రాగానే మర్చిపోతాం.కానీ ఆ ఇబ్బంది గూర్చి చాలా చక్కగా అర్ధం అయ్యేలా ఉదాహరణలతో సహా వివరించారు సర్.పాదచారుల చోటుని ఆక్రమించడం పద్ధతి కాకపోవడమే కాక ప్రమాదకరం కూడా.మంచి సామాజికి అంశాన్ని స్పృశించారు.ధన్యవాదాలు సర్💐💐💐🙏
    —–నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 13.1
  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Thank you.goodarticlr which ever person should read .well presented.
    DR.V.Ramakrishna murthy
    U S A.

    Reply
  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 147 లో సైకిల్ గురించి తెలిపారు. మీరు చెప్పినట్లుగా, నాటి రోజుల్లో సైకిల్ ఉండడమే గొప్ప. ఇప్పుడు పడవ కార్లు సామాన్యులు సైతం కొంటున్నారు. ఫుట్ పాత్ ల దురాక్రమణ గురించి ఎవరూ పట్టించుకోరు. అన్ని రంగాల్లో రాజకీయ జోక్యమే. ఫుట్ పాత్ ఉంటే ఎన్నో ప్రమాదాలు తగ్గించే అవకాశం ఉన్నది. చక్కటి కథనం. అభినందనలు.
    —G.శ్రీనివాసాచారి
    కాజీపేట

    Reply
    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ ధన్యవాదాలు సర్ మీకు .

      Reply
  16. 16

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నిత్యం పండుగే ఐతే నిన్నెట్ల కోట్టేదే పెండ్లామా అని సామెత .ప్రజలలో పౌరబాధ్యత స్పృహ,ప్రభుత్వంలో ప్రజాసంక్షేమం స్పృహ ఉండి ఉంటే ఎవరిపని వాళ్ళు సజావుగా చేసుకుంటూ పొయ్యేవారే..
    అది లేదు.
    తరువాత వివిధ ప్రభుత్వ శాఖలమధ్య సభన్వయం లేదు ప్రజలకూసౌకర్యాలు కల్పించటంలో. ఎవరిపని వారు చేసుకుంటూ పోతరు కానీ సమన్వయం ఉండదు కనీసప్రయత్నమూ ఉండదు.
    ఇటీపల వరంగల్లో సొకిల్చోదకులకు NIT నుంచి కాజీపేట వరకనుకుంట ప్రత్యేక మార్గం వేసిన్రు .అంతకూముందేవేసాన ఫుట్పాత్ టైల్సును తవ్వి చెట్లు పెట్టిన్రు తరువాత సైక్లిస్టులకోసం వేసిన తొవ్వ రోడ్డు వెంటవున్న దుక్ణాల ముందరినుంచి పోతున్నది ఆషాపుల మందర అడ్డంగా చిన్న చిన్న పిల్లర్లు ప్తి సైకిలిస్టుల తొవ్వను బ్లాకు చేసిన్రూ అక్కడిదాకా సైకిల్మీదవచ్చినవాడు సైకిల్ బూజాన పెట్టుకొని పోవాలె..ఇదివిచిత్రం. ఘనంగా ప్రారంభము ప్రచారమూ జరిగింది పేపర్లలో.
    రోడ్ల వెంబడి నాలాలు– బాక్స్ డ్రేన్– కట్టిన్రు రోడ్క్రాసింగ్ దగ్గర వనో ఎఖ్కడనైనాఏదైనా అవాంతరం వచ్చినదగ్గర ఆపేసిన్రు.ఉదాహరణకూ కాళోజీ శిగ్రహందగ్గర అటూ ఇటూ కాలువ కట్టిన్రు కాళోజీవిగ్రహంతీసేస్తమంటే అట్లెట్ల అని అభ్యంతరం పెట్టినప్రజలకోరికమేరకు పని ఆపిన్రు ఇంతవరకు ఆ నాలా అక్కడ పూర్తి కాలేదు .సెమీ సర్కిల్ తీసుకొని డ్రేన్ ఈట్టి పైన స్లాబ్ వేయవచ్చు కదా.లేదా విగ్రహం వెనుకనుంచి అండర్గ్రౌండ్ సొరంగంవలెతవ్వి నాలా వేయవచ్చు .అసలు నిర్మాణం మొదలు పెట్టకముందే సర్వేసమయంలోనే ఇవి ఆలోచించాలికదా కట్టిన నాలా పనిచేయదు నిరర్థకం ..ఇటువంటివి క్షేత్రంలో చూచి నిర్ణయం తీసుకోవాలె.అధికారులుకార్యాలయాలనుంచి కదలరు ఫీల్డు లో పరిస్థితి చూడరు .

    అసలు మీరు ప్రస్తావించిన విషయానికొస్తే దుకాణాలు పెట్టిన మొదట్లోనే అడ్డుకోవచ్చు కానీ తమ తాతాకాలిక డబ్బు ప్రయోజనంకోసం చూచీ చూడనట్లు వదిలిపెడ్తరు . కొన్నేండ్లతరువాత వ్యాపార్లు ఇన్నేండ్లనుంచి ఇక్కడ్నే వ్యాపారం చేసుకుంటున్నం ఎటుపోవాలంటరు ఇన్నేండ్లు ఎందుకైంది మొదట్లో పట్టించుకోలేదో కుమ్మక్కయినారో . ఇదంతా ఒక మాయా జాలం సర్ నా కనిపిస్తది.
    మీరు వ్యక్తం చేసిన అభప్రాయాలు వందశాతం నిజం. కాని …..
    .. కానిదగ్ఖరనే సమస్యంతా
    —-నాగిళ్ళ రామశాస్త్రి
    హన్మకొండ.

    Reply
    1. 16.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మన ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని వెలిబుచ్చిన మీ స్పందన చాలా బాగుంది శాస్త్రి గారు.కృతజ్ఞతలుమీకు.

      Reply
  17. 17

    sunianu6688@gmail.com

    సైకిల్ గురించి వ్రాసిన చదువుతుంటే మా నాన్నగారికి మా అమ్మమ్మ వాళ్ళు కట్న కానుకలు క్రింద సైకిల్ ఇచ్చారట.65 సంవత్సారాల క్రిందటి మాట. మా అమ్మ చాలా గొప్పగ అంటువుంటరు. ఇంక ఫుట్ పాత్ ల విషయాల కొస్తే ఖచ్చితంగా మన పాదచారులకు ఉండవలసిందే. ఈ విషయం గురించి రచయత గారు చక్కగా వ్యక్తీకరించారు. రచయత KLV ప్రసాద్ గారికి ధన్యవాదాలు 🌹🌷

    Reply
    1. 17.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…కృతజ్ఞ తలు మీకు

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!