సంచికలో తాజాగా

Related Articles

18 Comments

  1. 1

    Sagar

    మార్పు అనేది జనాలలో వచ్చినప్పుడే అది సాధ్యం సర్. ఉదాహరణకు సారాయి విషయం తీసుకోండి. ప్రజలలో ఉప్పెనలా వచ్చిన ఆ ఉద్యమమే కదా ప్రభుత్వం మెడలు వంచింది? అలాంటి విప్లవం వస్తేనే మద్యం విషయలో శుభపరిణామం సాధ్యం. అంతే తప్ప ప్రభుత్వం చేస్తుంది అనుకోవడం భ్రమ మాత్రమే. అలాంటి రోజు వస్తుందని ఎదురు చూద్దాం. మంచి సందేశం ఇచ్చినందుకు ధన్యవాదములు సర్.

    Reply
    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      బాగా చెప్పావు
      ధన్యవాదాలు.

      Reply
  2. 2

    Rajendra Prasad

    Sir, liquor is there in other countries too. Then why it’s having adverse affects on Indian men and families?Because Indians lack the vision and commitment to life. As you said, selfish politicians and political parties

    Reply
    1. 2.1
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    రోజురోజుకు మితిమీరి ,అడ్డదారులు తొక్కుతున్న నేటి సామాజిక రుగ్మతను ఇతివృత్తంగా ఎన్నుకొని రచయిత గారు ఈనాటి శీర్షికలో వివరించిన విధానం చాలా చక్కగా ఉంది. మీరన్నట్లు ఆ రోజుల్లో ఈ వ్యసనానికి అలవాటు పడ్డ వ్యక్తుల బహు స్వల్పంగా ఉండేవారు. అది కూడా చాటుమాటు వ్యవహారమే . అటువంటి వ్యక్తులను సమాజం కూడా చులకన భావంతో చూసేది .కానీ అది ఇప్పుడు పూర్తిగా వ్యతిరేక ధోరణితో ,ఒక సామాజిక హోదాగా గుర్తింపులోకి వస్తోంది.
    పన్నులు వసూలు చేసే విధానంలో కఠిన చట్టాలు అమలు పరచనంతవరకు ,వ్యక్తి లేదా సంస్థలు తమ సంపాదనను నల్లధనం గా మార్చుకునే వెసులుబాటు ఉన్నంతవర
    కు, తాత్కాలిక ఉచిత రాయితీలకు అలవాటు పడుతున్న ప్రజానీకం ఉన్న భారతదేశంలో… మద్యం అమ్మకాల ద్వారానే పూర్తి పన్ను సులభతరంగా వసూలయ్యే అవకాశం ఉన్నందువలన ,ఏ ప్రభుత్వాలు అధికారములోకి వచ్చినప్పటికినీ ఈ వ్యాపారము మరియు వ్యసనము “మూడు పువ్వులు ఆరు కాయలు” గా వర్ధిల్లుతూంది !
    —-బి.రామ కృష్ణారెడ్డి
    సికిందరాబాద్.

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      బాగా విశ్లేషించారు
      ధన్యవాదాలు రెడ్డిగారు.

      Reply
  4. 4

    Bhujanga rao

    మారుతున్న జీవనశైలిలో పెరుగుతున్న ఆదాయపు వనరులు,ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు అవడం,వ్యాపారం,ఉద్యోగం మరియు లభించిన స్వేచ్ఛ చాలామందిని మద్యం మత్తుకు బానిసలను చేస్తున్నాయి. వాటికితోడు అదుపు తప్పిన మత్తు వినియోగం వలన ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. ఇవేవీ ఆలోచించకుండా మద్యం అమ్మకాలను పెంచి మద్యం వ్యాపారులకు, ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరి, సమాజానికి మాత్రం నష్టం జరుగుతుంది.కావున వారుఇచ్చే ఉచితాలకు అలవాటుపడి మనం చాలా నష్టపోతున్నాము.మార్పు ప్రజలనుండి రావాలి అప్పుడే సాధ్యమౌతుంది,వస్తుందని ఆశిద్దాం.ఇప్పుడున్న సమాజానికి ఎంతో అవసరం మంచి విషయాలు అందిస్తున్న మీకు నమస్కారములు సర్🙏

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      బాగా విశ్లేషించారు
      ధన్యవాదాలు
      భుజంగ రావు గారూ.

      Reply
  5. 5

    Shyam Kumar Chagal

    మద్యం అని ఎవరు పేరు పెట్టా రో కానీ ప్రస్తుతం అది మన మధ్య పూర్తిగా పెనవేసుకొని పోయింది. కుల మతాలకు అతీతంగా భారతీయులందరూ దానికి బానిసలు అయిపోయారు. పాశ్చాత్య విధానాన్ని అనుసరిస్తున్న ప్రస్తుత తరం మొత్తం దైనందిన జీవితంలో దాని ని ఒక అతి ముఖ్యమైన భాగంగా చేసేసుకున్నారు. ప్రజలను దీనికి బానిసలుగా చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తే కానీ ప్రభుత్వాలు నడవలేని స్థితికి చేరుకున్నాయి.

    అయితే మన దేశంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య నిషేధం అమలు చేస్తూ కూడా ఆర్థికంగా బాగున్నాయి.
    ప్రభుత్వం మాత్రమే కాకుండా, సినిమాలు కూడా మన సంస్కృతిని చెడగొట్టే విధానంలో వాటి వాటి పాత్రను బ్రహ్మాండంగా పోషిస్తున్నాయి.
    నాకు గుర్తుంది ఒకప్పుడు సినిమాల్లో విలన్ మాత్రమే తాగుతూ కనిపించేవాడు. లేదా చెడు దారిలో ఉన్న హీరో కూడా తాగుతూ కనిపించేవాడు. ప్రస్తుత సినిమాల్లో హీరో వాడి స్నేహితులు, హీరోయిన్ కూడా తాగుతూ కనిపిస్తుంది. అంతేకాదు హీరో తండ్రి కూడా కొడుకుతో కూర్చుని తాగుతున్నాడుగా చూపిస్తున్నారు. మా ప్రాంతంలో నైతే ప్రతిరోజు సాయంత్రం కాగానే ఎక్కడ కూర్చుని తాగాలి అన్నది ఉదయాన్నే మొదలయ్యే పెద్ద ప్రణాళిక. తాగుబోతుల మధ్య నుండే సోదరుభావం ప్రేమ అనుబంధం మరి ఎక్కడా కనపడదు అంటే అందులో ఏమాత్రం అతిశక్తి లేదని చెప్పాలి.
    మన దేశం మొత్తంలో అత్యధికంగా మద్యం ఏర్లే పారుతున్నది మన రాష్ట్రంలో అనే చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఒకప్పుడు సెలవుల్లో లేదా సాయంత్రాలు గుడిలో కిటకిటలాడేవి. ఇప్పుడు బారులు, వైన్ షాపులు. మద్యం తీసుకోవడం అనేది మంచినీళ్లు తాగినట్లుగా మారిన మన సంస్కృతిని దేవుడే రక్షించాలి. ప్రతి వారం మంచి విషయాన్ని మన ముందుకు తెచ్చి మన మధ్య చర్చకు నిలుపుతున్న డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ మరియు సంచిక యాజమాన్యానికి నా కృతజ్ఞతలు.

    .

    Reply
    1. 5.1

      Shyam Kumar Chagal

      కొన్ని అచ్చు తప్పుల కు నా క్షమాపణలు

      Reply
      1. 5.1.1

        డా కె.ఎల్.వి.ప్రసాద్

        చాలా బాగా రాసావు మిత్రమా.
        ఈ లక్షణాలే నిన్నో కథా రచయిత గా నిలబెట్టాయి…అనడంలో ఎలాంటి సందేహం లేదు.నీ స్పందనకు హృదయ పూర్వక కృతజ్ఞతలు నీకు.

        Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ,గాంధీ గురించి ఆయన అనుయాయులం అని చెప్పుకుంటూ అధికారాన్ని నిలుపుకోవటమే ధ్యేయంగా పనిచేసిన రాజకీయులవలననే గాంధీ కి ఈదేశంలో చోటులేకుండాపోయింది.అందుకే కాళోజీ యాభైఏండ్ల కిందటనే అన్నడు గాంధీనుద్దేశించి.
    ” ఇంకేమి కావాలె
    ఇంకేమిచేయాలె
    వీధి వీధిన నిన్ను చెక్కినిలవేసితిమి ఇంటింటిలోనిన్ను
    వేలాడదీసితిమి
    నీ అడుగులను చూపి
    మాఅడుగు వేసితిమి
    ఇంకేమి కావాలె
    ఇంకేమి చేయాలె

    అంటూ వ్యంగ్యంగా చెప్పినాడు.
    వారికి గాంధీ పేరు ఒక ఆలంబన.అంతే.

    ఇక మద్యపానమూ నిషేధమూ.
    ప్లభుత్వము పరిపాలన నడూస్తున్నదే దాని బలంతోటి. మద్యనిషేధం అమలుచేయాలెననేది గాంధీ లక్ష్యం.అదిజరగలేదు .జరుగుతుందనే ఆశలూ పెట్టుకోవటం సరికాదేమో!
    దానిగురించి మనం ఏమీ మాట్లాడటానికి లేదు. మీరు చెప్పగలిగింది ,చెప్పాలనుకున్నదిదాపరికంలేకుండా చెప్పినారు.
    —-రామ శాస్త్రి
    హన్మకొండ.

    Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 140 లో మద్యపాన సేవనం వల్ల కలిగే నష్టాల గురించి తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో మద్యపానానికి దాసులై ఎన్నో కుటుంబాలు చితికిపోయాయి. క్లబ్బులు పబ్బుల విష సంస్కృతికి యువత భవిష్యత్తు బలైపోతున్నది. మద్యం వల్ల వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ప్రజల్లో చైతన్యం వచ్చిన రోజే ఈ మద్యపానానికి చరమగీతం పాడవచ్చు. చక్కటి కథనంతో సాగింది. అభినందనలు
    ‘— జి.శ్రీనివాస చారి
    . ఖాజీపేట

    Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మద్యపానమేకాదు ధూమపానం కూడా అనారోగ్యం పాలై ఇంటికి పెద్ద దిక్కు లేక ఎన్ని విధాలుగా నష్ట పోతున్నారో
    —కె.విజయ
    హైదరాబాద్.

    Reply
  9. 9

    పుట్టి. నాగలక్ష్మి

    మద్యపానం సమాజాభివృద్ధికి పట్టిన పీడ.. మంచి విషయాన్ని గురించి చర్చించారు.. అభినందనలు👍

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!