Related Articles

23 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

  2. 2

    Shaym kumar chagal

    ఆడవాళ్ళ షాపింగ్ సమయంలో మగవారు పడే బాధ వర్ణనాతీతం
    మన భారత దేశంలో దాదాపు ప్రతి మగవాడికి ఎదురయ్య సమస్యలను చాలా కూలంకషంగా వివరించారు రచయిత గారు. నేను కూడా షాపింగ్కు వెళ్లవలసి వస్తే తప్పనిసరిగా ఒక సమయపాలన ఇస్తాను అది దాటిందంటే మరి ఇక ఊరుకోను ఊరుకోకేం చేస్తాను లెండి జస్ట్ సింపుల్ గా నేను వెళ్ళిపోతాను. అందుకని నన్ను పిలవరు కూడా
    నిజం చెప్పాలంటే స్త్రీలకు షాపింగ్ అన్నది ఒక ఆనందకరమైన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. కాకపోతే ఈ సంచికలో ఈ శీర్షిక చదివిన ప్రతి మగ వాళ్లకు తప్పనిసరిగా ఈ బాధలు ఎదురయ్యే ఉంటాయి ఏమి చేయలేం జీవితంలో ఇది ఒక భాగం.

    .

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      బాగా చెప్పావు
      ధన్య వాదాలు.

  3. 3

    Neelima

    డాక్టర్ గారు..
    నమస్కారములు..
    షాపింగ్ కోసం పాత విషయాలు చాలా బాగా చెప్పారు.. షాపింగ్ అనేది కొందటికి ప్రియం, కొందరికి అప్రియం అనేది కూడా బాగా చెప్పారు..
    నాకు ఒకటి బాగా నచ్చింది..
    మనుమల షాపింగ్ కి వెళ్తా అన్నారు.. దేనికి అని reason చెప్పారు గా.. బాగా నవ్వు వచ్చింది..

    ధన్యవాదములు

    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      నీలిమ గారు
      కృత జ్ఞత లు మీకు

  4. 4

    Rajendra Prasad

    Most of our experience us same ఆ yours. You projected the practicality of our shopping lives sir

  5. 5

    Sagar

    మనిషి జీవితంలో ఎదురయ్యే అనుభవాలకు మీ రచనలు పుట్టినిల్లు సర్. ప్రతి విషయం అనుభవంతో మీరు చేసే రచనలు ఎంతోమంది జీవితాలలో ఉన్నవే. కానీ ఎవ్వరు కూడా ఇంత పారదర్శకంగా వివరించలేరు. ఈనాటి షాపింగ్ ఉదంతంలో మీరు అన్నట్లు ఇక వయసు పెరిగే కొద్ది ఎంపిక హోదా వెళ్లి పిల్లలకు కాపలా వచ్చేస్తుంది. కాల గమనంలో తప్పదుగా? మీకు ధన్యవాదములు సర్.

  6. 6

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి ఈ రోజు సంచికలో పూర్వపు రోజుల్లో మరియు ఇపుడున్న షాపింగ్ విధానం,మగవారికి ఎదురయ్యే సమస్యలను అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఫోటోలతో చక్కగా వివరించారు. స్త్రీలకు షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అందుకు తగిన ఓపిక ఉంటుంది.ఇప్పుడు ఆన్ లైన్ లో కూడా షాపింగ్ చేసే విధానం అందుబాటులో ఉంది.ప్రతి సంచికలో కొత్త విషయాన్ని అందిస్తున్న మీకు హృదయపూర్వక నమస్కారములు సర్🙏

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      భుజంగరావు గారు
      కృత జ్ఞత లు సర్

  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 138 లో షాపింగ్ అంశం గురించి రాశారు. ఈ రోజుల్లో ముఖ్యంగా మహిళలు చీరెలు/డ్రస్సులు/ నగల షాపింగ్ కు చాలా సమయం కెటాయిస్తారు. మహిళా కస్టమర్లకు చీరెల సెలక్షన్ లో పాపం సేల్స్ మెన్లకు/వుమెన్లకు అగ్నిపరీక్ష వంటిందే. మీరు చెప్పినట్టుగా లక్షల రూపాయల విలువైన చీరెలు/ డ్రస్సులు మార్కెట్లో లభిస్తున్నాయి. అయినా డిమాండ్ బాగానే వుంది. మహిళలు షాపింగ్ లపై ఎన్నో కార్టూన్లు కూడా వచ్చాయి. మీ కథనం బాగుంది. అభినందనలు.
    —జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా సహజంగా గా కనిపించే విషయాలను కూడా ఏదో ఒక ఆత్మీయ బంధానికి గుర్తుగా,జీవితంలో సాధించిన తృప్తికి ప్రతీకగా చాలా అద్భుతంగా విసదీకరిస్తారు సర్ మీరు.మీ అమ్మగార్ని,అన్నదమ్ముల,అక్కల ప్రేమ స్పర్శను బట్టలుగా ధరించి ఇప్పటికీ వాటిని అనుభూతి చెందుతున్న మీఆత్మీయత గొప్పది సర్.అందరినీ వారి వారి చిన్న నాటి అనుభూతి లోకి నడిపిస్తుంది మీ పాత బట్టల జ్ఞాపక పరిమళం.నేటి ప్యాషన్ ల లోకంలోకి నడిపిస్తుంది మీ కొత్త తరపు దుస్తుల సుగంధం.నన్ను ఇందులో బాగా ఆకర్షించిన అంశం ఏమిటంటే నన్ను నేను మెరుగు పరుచుకున్నాను బాల్యం నుండి ఇప్పటి స్థితికి అన్నారు.అది చాలా నచ్చింది సర్.అవును ప్రతి వ్యక్తి గతానికి,ప్రస్తుతం గొప్పగా ఉంటేనే మన ఎదుగుదల,విజయం తెలుస్తుంది.దానిని మీరు పరోపకారానికి వినియోగించడం కూడా చాలా ఆచరణీయ అంశం సర్.దర్జీ వద్ద నుండి వచ్చిన బట్టల సుగంధం మాకూ పంచినందుకు ధన్యవాదాలు సర్🙏💐💐💐
    ——నాగ జ్యొతి శేఖర్
    కాకినాడ.

    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలండీ

  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నేనూ మీ కేటగిరీ ల చేరేవాడినే.షాపింగ్ నాకు టికాకైన పని.అందుచేత మావాళ్ళు షాపింగ్ కు రమ్మని పిలువరుకూడా. మహిళల అభిప్రాయాల గమ్మతుగా వుంటై.ఒక చీర రంగునచ్చితే ఒకచీర బార్డరు నచ్చుతుంది.ఈరంగులో ఆబార్డరు ఊంటే తీసిచూపమంటరు .ఒకపట్టాన నచ్చరు బట్టలు నచ్చితే ధరలు నచ్చవు. అదిపెద్ద ప్రహసనం లెండి .నాకు బట్టలమీద పెద్ద ఆబ లేదు చదువుకునే నాళ్ళలో కొనూక్కోవటం కష్టంగా వుండేది.అవకాశంలేక.ఇపుడు బట్టలమీద మోజులేదు.
    షాపింగు ఒక్క గంటలో తెమలనివ్వరు .
    అది అంతే మనమేమీ చేయలేము.
    —రామశాస్త్రి

    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు ధన్యవాదాలండీ

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బాగున్నై.. మీగతస్మృతుల్లో
    షాపింగులు 👏👏👏👏🙏💐🙏🌷🙏
    —కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా సరదాగా ఉంది సార్ ఈ ఎపిసోడ్.👏👏 నిజంగానే 100% కరెక్ట్ మీరు చెప్పింది.👌👌 మహిళలకు షాపింగ్ అంటే చాలా చాలా సరదా. కొంత మంది ఆడవారు వాళ్లతోడు గా మగావారు వచ్చారంటే ఇంక వాళ్ళ పని అయిపోయినట్లే.😊 చాలామంది ఎక్కువ సేపు షాపింగ్ చేస్తారు లేడీస్. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది మనకు నచ్చింది ఏదో వెంటనే తీసేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని. ఏదైనా మగవారు ఆడవారికి చీరలు వాళ్ల సెలెక్షన్ తోటి తీసుకొస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరి ఇష్టాలు. ఎపిసోడ్ చదవగానే ఒక చక్కని అనుభూతి కలిగింది. బాల్య విషయాలు గుర్తుకు వచ్చాయి. నిజంగానే అప్పుడు చాలా లిమిటెడ్ గా ఉండేవి బట్టలు. ఇప్పుడు కుప్పలు తెప్పలు అందరికీ. వస్త్ర దానం చాలా గొప్పది. మీ ప్రతి ఎపిసోడ్లో ఆత్మీయత, అనుభూతి, సేవా భావం గుప్పించి జ్ఞాపకాల పందిరిలో దొంతరలుగా మా ముందు పేర్చడం చాలా చాలా సంతోషం అనిపిస్తుంది చదువుతుంటే. హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏మీకు చక్కని అడుగుజాడలు మా ముందు పరుస్తున్నారు. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్💐💐💐💐💐💐 ఇంత చక్కటి జ్ఞాపకాలు మాకు పంచుతున్నందుకు .చివర్లో మాత్రం కరెక్ట్ గా చెప్పారు సార్😄 ఆడవారు షాపింగ్ చేసేటప్పుడు పిల్లల్ని చాలా చక్కగా వారిని ఆడించేది మగవాళ్ళే నని .ఆన్షితో చక్కని ఫోటోలు అందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. సార్ 🙏మీ మరి ఒక అనుభూతుల ఎపిసోడ్ కొరకు ఎదురు చూస్తూ ఉంటాము నమస్తే🙏

    మొహమ్మద్ .అఫ్సర వలీషా
    ద్వారపూడి (తూ.గో .జి)

  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంపాదనశక్తి , కొనుగోలుశక్తి , లభ్యత ,
    వీటికి మించి కొత్తదనం కావాలనేఆకాంక్షించ, పైపై మెరుగులే నాణ్యత అనే భావం, వారాంతంలో హోటల్ భోజనం ,లాంగ్ వీకెండ్ లో లాంగ్ రైడ్ మొదలగు తాత్కాలిక ఉపసమనం కావాలని కోరుకునే మనస్తత్వం విపరీత ధోరణితో ఉన్న నేటి తరం ప్రజానీకం ఉన్నంతకాలం ,”షాపింగ్” అనే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ….. ఉంటుంది . ఇది సహజమే అందరూ ఒప్పుకోవలసిన నగ్నసత్యమే!
    బట్టల మూట సత్తిరెడ్డిని ,పండుగలప్పుడే బయటకు తీసే దాపుడు బట్టలను ,ఆ నలిగిన బట్టలను ఇత్తడి చెంబులో నిప్పులు వేసి ఇస్త్రీ చేసుకొనే చిన్ననాటి స్మృతులను గుర్తుకు తెచ్చినందులకు రచయిత గారికి ధన్యవాదములు🙏🙏.
    —-బి.రామ కృష్ణారెడ్డి
    సికింద్రాబాద్.

    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారు ధన్యవాదాలు సర్ మీకు .

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!