సంచికలో తాజాగా

Related Articles

29 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక-అంతర్జాల పత్రిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —–డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా.

  2. 2

    sagar

    ఇందులో మొదటి ముద్దాయి ఓటరే కదా సర్ ? తాయిలాలకు లొంగకుండా ఓటువేస్తే తప్పుచేసిన నాయకుడిని ప్రశ్నించే హక్కు ఉంటుంది. తాయిలాలకు లొంగినతరువాత అతనికి ఆ హక్కు లేదు కదా? ఇక పార్టీలు మారే వారి విషయంలో పార్టీ ఫిరాయింపు నిరోదక చట్టం పటిష్టంగ ఉంటే తప్ప నేటి నాయకులకు బుద్ధిరాదు. సమకాలీన అంశంపై మంచి వ్యాసం ప్రచురించినందుకు ధన్యవాదములు మరియు శుభాకాంక్షలు సర్.

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      బాగా చెప్పావు సాగర్
      కృతజ్ఞతలు.

  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఎన్నికల విషయంలో నాటి.. నేటి పరిస్థితులను చక్కగా వివరించారు. ముగింపు suggestive గా ఉంది.. ఐతే చివరి లైన్.. ఇది క్లిష్టమైనదేమో.. అనేది అవసరం లేదనేది నా అభిప్రాయం..
    —-వెంకటనరసయ్య
    ఈనాడు…మహబూబాబాద్.

    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      మీ సూచన బావుంది
      హృదయపూర్వక ధన్యవాదాలు.

  4. 4

    పుట్టి. నాగలక్ష్మి

    ప్రస్తుత ఎన్నికల రాజకీయాల ముచ్చట సమకాలీన సమస్యలకు అద్దం పట్టింది.. ఓటు, ఓటర్లను గురించి నిజాలు చక్కగా వివరించారు.. 👍🙏🏻

  5. 5

    గీతాచార్య

    చాలా లోతుగా విశ్లేషించాల్సిన అంశం. మంచి పాయింట్లు లేవనెత్తారు. మార్పు అన్నది ప్రజల వైపు నుంచీనే రావాలి

  6. 6

    Shyamkumar chagal

    మన దేశంలో జరుగుతున్న ఓటు నోటు ఎన్నికల ప్రహసనం గురించి వివరించిన తీరు చాలా బాగుంది.
    ఇందులో ప్రస్తావించిన ప్రతి విషయం అతి ముఖ్యమైనది. మొదట్లో జరిగిన ఎన్నికల నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న బాధాకరమైన మార్పు మనకు తెలిసినదే అయినా ప్రస్తుతం దాని చదువుతుంటే మన దేశం యొక్క దౌర్భాగ్య స్థితిని చూసి ప్రతి ఒక్కరూ కంటనీరు పెట్టుకోవాల్సిందే. దేశంలో చదువుకున్న వారి సంఖ్య పెరిగే వరకు మార్పు వచ్చే పరిస్థితి కనబడటం లేదు.
    ప్రతి వారం ఒక కొత్త విషయాన్ని మన దృష్టికి తీసుకు వస్తున్న రచయిత డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారికి అభినందనలు.
    ప్రతి వారం ఒక కొత్త విషయాన్ని రాయడానికి ఎలా ఎన్నుకుంటున్నారు అన్నది నాకర్థం కావట్లేదు కానీ అది రచయిత గారి గొప్పతనం అని చెప్పాలి.

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      మిత్రమా
      చాలా బాగా రాసారు

  7. 7

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 124 ఎపిసోడ్ ఓటెవరికి..!ప్రజాప్రతినిధుల ఎన్నికల విషయంలో అప్పటి ఇప్పుడున్న పరిస్థితులను చక్కగా వివరించారు. గెలిచాక ఏ పార్టీలో ఉంటాడో తెలియదు.పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టంగా అమలు పర్చాలి. అంతే కాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోకపోయినా ప్రజలు వారిని వెనుకకు పిలుపించే అధికారం (సదుపాయం) మన రాజ్యాంగంలో తప్పనిసరి చేయాలి,ఉచిత తాయిలాలు లేకుండా చేయాలి,అప్పుడే సమాజానికి సేవ చేసినవారు అవుతారు.ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వారిచ్చిన ప్రలోభాలకు బానిసలు కాకుండా వారి హక్కును వినియోగించుకున్నప్పుడే సమాజం బాగుపడుతుంది. ప్రతి వారం వినూత్నమైన విషయాలు అందిస్తున్న మీకు ధన్యవాదములు సర్🙏

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      భుజంగరావు గారూ
      చాలా బాగా విశ్లేషించారు
      కృతజ్ఞతలు మీకు.

  8. 8

    Rajendra Prasad

    Educated also voting with bias based on community, without rationale. Aligned to parties with no valid reasons. Many rich and salaried class ignore voting. Poor people influenced by money.
    యధా ప్రజా! తధా రాజా

    – మీ రాజా

    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      బాగా చెప్పారు
      ధన్యవాదాలు మీకు.

  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    రాజకీయాలు కుళ్ళి కంపు కొడుతున్నై !ఆలోచించే ఓటరు అసలు ఓటు వెయ్యటానికే ఇష్టపడటం లేదు !!రాజకీయనాయకులూ మారరు
    ఓటరుఇంక మారే అవకాశమే లేదు “! కాలమే ఏదో అద్భుతం చేస్తుంది… వేచి చూడటమే !🙏💐🙏
    —-కోదాడ నరసింహారావు
    విశాఖపట్నం

    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కోరాడ వారికి
      కృతజ్ఞతలు.

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    వ్యాఖ్యానించటానికి ఏమీలేదుఎందుకంటే విభేదించవలసిన అంశాలేవీలేవు.
    ఓటు వేయటం విషయంలో పల్లెవాసులేనయమేమో .ఓటర్ల జాబాతాలో పేరులేకపోతే తను చచ్చిపోయినట్టే అనుకుంటడు.తప్పనిసరిగా ఓటువేయాలనుకుంటడు .దానిని ప్రభావపరచే డబ్బు సంగతి అట్ల ఉంచండి. చదువుకున్న వాడు లేదా మేధావినని అనుకునేవాడు ఓటువిషయంలో చాలా నిర్లిప్తంగ వుంటున్నడు.ఆ ఎవడొస్తే ఏంది అందరూ దొంగలే దానికోసం అంతదూరం పోయి రావాలె ఎవడోవెధవ ఎన్నికైతడు కానీ మనంచేసేదేంలేదనే పద్ధతిలో ఆలోచిస్తున్నడు.
    శేషన్ ఎలక్షన్ కమీషన్కు అధికారాలేవున్నయో చూపించిండు .రాజకీయుల లాగులు తడిపిండు.తరువాత ఆయనను నియమించిన పార్టీయే అధికారాలకు కత్తెర వేసింది.ఏరాజకీయపార్టీకి సంస్కరణలు అక్కరలేదు.ఎట్లాగో అట్లా పవర్ కు రావాలె అంతే. అసలు ఎన్నికల సిస్టమ్ లో మార్పు రావాలేమో.ఓటర్ల సంఖ్యలో కనీసంశయాభైశాతం అన్న ఓట్లు వస్తేనే గెలిచినట్టు అని.ఇప్పుడున్న సింపుల్ మెజారిటీ కాదు .పది ఓట్లలో నిలబడ్డ అభ్యర్థులలో ఎవడు ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటే వాడే ఎన్నిక ఔతుండె.పోలైన ఎనిమిది ఓట్లలోనిలబడ్డ నలుగురిలోమూడు ఓట్లు వచ్చిన వాడు ఎన్నికౌతున్నడు మిగిలిన ఐదూ మిగిలాన నలుగురూ పంచుకుంటున్నరు .అందుకే ఓటర్ల సంఖ్యలో కనీసం సగమైనా ఓట్లు తెచ్చుకున్నవాడే గెలిచానట్టని వుంటే బాగుంటదేమో!?
    దీనికీ తలపండిన రాజకీయులు ఏంఉపాయం కనిపెడతారో ? శతకోటిదరిద్రానికి అనంతకోటి ఉపాయాల లాగా.
    నిర్బంధ ఓటింగ్ పెట్టవచ్చు.అప్పుడు ఈనిర్బంధమేమిటనే ప్రశ్నలు మొదలైతయేమో….
    ఏమో…..
    —-నాగిల్ల రామశాస్త్రి
    హన్మకొండ.

    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      శాస్త్రి గారు.

  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఓటు గూర్చి మంచి విశ్లేషణాత్మక వ్యాసం సర్.నిజమే మన ప్రాథమిక హక్కు అయిన ఓటు ని విజ్ఞత తో ఉపయోగించుకుని సరైన నాయకుల్ని ఎన్నుకోవాల్సిన గురుతర బాధ్యతను చక్కగా గుర్తు చేశారు.మన తలరాత మన చేతుల్లోనే అనే హెచ్చరిక సమయానుకూలంగా తెలియపర్చారు ధన్యవాదాలు సర్🙏💐
    —-‘నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    “ఈ దేశంలో మొట్టమొదటి అవినీతిపరుడు ఓటరు .వాడు మారితే కానీ దేశము బాగుపడదు. ” ఈ కొటేషన్ ఈ మధ్య కాలంలో ఎక్కడో చదివినట్లు గుర్తు… భారతదేశంలో నిజాయితీ ,నిబద్ధత ,ఆశ్రిత పక్షపాతం , కుల మత మరియు ప్రాంతీయతను ఆధారంగా చేసుకుని తమ మడుగను సాగిస్తున్న నాయకులకు మనము కొమ్ముకాస్తున్నంతవరకు మీరు ఆశించిన మార్పు దుర్లభం . మహనీయుడు మన రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రూపొందించినప్పుడు కాలానుగుణంగా వచ్చే మార్పులకు అనుగుణంగా సవరణలకు అవకాశం కల్పించినప్పటికీ ,చేసిన సవరణలను అమలు పరచటంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి .అందుకు కారణం భారత శిక్షాస్మృతి సవరణలకు అనుగుణంగా లేని ఒక పవిత్ర గ్రంథముగా భావించడం వలన నేమో !
    ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత రాజకీయ వ్యవస్థ గురించి మనలాంటి పౌరులు ఆలోచించటం ,చర్చించడం ,దానికి ఇటువంటి వేదికలో స్థానం కల్పించటం సమంజసం కాదేమో !ఆలోచించండి…( ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)
    —బి.రామకృష్ణా రెడ్డి
    అమెరికా.

  13. 13

    మొహమ్మద్ .అఫ్సర వలీషా

    సమాజంలో ప్రతి ఒక్కరికి కాకపోయినా చాలా మందికి మాత్రం ఇది అర్థం కాని సందిగ్ధంలో పడేస్తుంది. ఎన్ని కల సమయం వచ్చేసరికి ఓటు ఎవరికి వేయాలని. ఎవరికి వారు కొత్త కండువాలతో కుప్పి గంతులేస్తుంటే ఎవరిది సరైన పాలన అనే సందేహం తప్పకుండా వస్తున్నది.ప్రజల పాలన కంటే తమ స్థానాల సుస్థిరత్వ మే సురక్షితంగా చూసుకోవడం లో నిమగ్నమై ఉన్నారు. చాలా బాధగా ఉంది సార్. చాలా మంచి విషయం వ్రాశారు మీ జ్ఞాపకాల పందిరిలో. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీకు 👏👌💐🙏👏👌💐🙏👏👌💐🙏👏👌💐🙏💐
    మొహమ్మద్ అఫ్సర వలీషా
    ద్వారపూడి (తూ. గో. జి)

    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      నీ స్పందనకు ధన్యవాదాలు.

  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఆలోచన రేకెత్తిస్తుంది . మంచి వ్యాసం. సకాలంలో అభినందనలు సార్ 💐
    —–డా.డి.సుజాత
    విజయవాడ.

  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 124లో ఓటు గురించి చక్కగా వివరించారు. మీరు చెప్పినట్టుగా అధికారం కోసం ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. సాధ్యం కాని వాగ్దానాలు చేస్తున్నారు. నాయకులు ఒక పార్టీ గుర్తుపై గెలిచి అధికార పార్టీలో చేరుతున్నారు. ఈ మధ్య జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో మాకు డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తామని కొందరు ఓటర్లు అడిగినట్లుగా వార్తలు వెలువడ్డాయి. కొన్ని నియోజకవర్గాలలో ఓటర్ల లిస్టులో కొందరి పేర్లను కారణాలు ఏమి లేకుండా తీసివేస్తున్నారు. ఎన్నికల్లో ఎన్నో మాయలు,ఎన్నో కుతంత్రాలు. చక్కటి కథనంతో సాగింది. అభినందనలు.
    —జి శ్రీనివాసాచారి
    కాజీపేట.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!