సంచికలో తాజాగా

Related Articles

24 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక కృతజ్ఞతలు
    –డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ

  2. 2

    sagar

    ఏదైనా పోగొట్టుకున్న తరువాత కానీ తెలియదు అనేదానికి సమయం కూడ ఒక ఉదాహరణ సర్. మీరన్నట్లు పొద్దున 5 లేదా 5-30 మద్యలో నిద్రలేస్తే ఉండే సౌలభ్యం ఇప్పటికీ చాలామందికి అర్ధంకాదు. ఒకవేళ చెప్తే మేము లేచి చేసేది ఏముంది అనే మాట ఒకటి. ఇక మీరు చెప్పినట్లుగ ప్రయాణాలలో ఒక పది నిమషాలు ముందు ఉండేవారూ తక్కువే. ఇక చరవాణి దాసులకు అంతమే లేదు. మీరన్నట్లు, మీరు, నేను కూడ అతీతులంకాదు. ఒకప్పుడు చేసే పుస్తకపఠనం తగ్గింది చరవాణి పుణ్యమే. కాలమే అన్నిటికీ మార్పు తెస్తుందని ఆశిద్దాం సర్. మంచి సందేశంతో వ్యాసం ఇచ్చినందుకు ధన్యవాదములు సర్.

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ సహృదయ స్పందనకు ధన్యవాదాల.

  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    👏👏👏మీ సమయ పాలన
    అందరికీ ఆచరణీయమే.
    —కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

      1. 3.1.1

        మొహమ్మద్ .అఫ్సర వలీషా

        చాలా చక్కని సందేశం సార్ తిరిగి రాని కాలం గురించి చాలా బాగా చెప్పారు. మా ఇంట్లో అంతే ఎంత లేట్ గా పడుకున్నా నమాజ్ ముందు లేవాలనేది మా కండిషన్.
        ఎంత ఎర్లీగా లేచినా మార్నింగ్ పనులు అయ్యాకే సెల్ జోలికి వెళ్ళాలి.early to bed early to rise అనడంలో చండశాసనులైనా ఓ క్రమశిక్షణ నేర్పించడంలో తప్పు లేదు.చక్కని జ్ఞాపకాల పందిరికి హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీకు 💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  4. 4

    sunianu6688@gmail.com

    చాలా చక్కగా చెప్పారు సర్! సమయపాలనఅనేది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటిస్తే చాలా మంచిది. మా నాన్నగారు ఈ విషయంలో మాకు ఆదర్శం. కరెక్టు టైం కి బయల్దేరక పోతే ఎంతో కోపం వచ్చేది.అది ఇప్పటికి మా అన్నదమ్ములు, అక్కచెల్లులు పాటిస్తాం. ఇక ఉదయమే లేవడం అనేది కూడా మా ఇంటిలో పాటించే ఇంకొక గొప్ప విషయం. కానీ నేను night టైం3.00 వరకు చదువుకుంటూ ఉండగలిగే దాన్ని. కానీ ఉదయం5.00 కి లెవలేకపోయేడాన్ని. మా నాన్నగారు 1hour నాకు పర్మిషన్ ఇచ్చేవారు.నాకు మాత్రమే నండోయ్.ఇప్పటికీ అదే అలవాటు ఐపోయింది. అప్పుడు చందశాసానుడు అనుకున్న మా నాన్నగారి క్రమశిక్షణ వల్లే మా ఇంట్లో 7 గురు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అంతా గవర్నమెంట్ ఉద్యోగాల్లో స్థిరపడి సంతోషంగా ఉన్నాము. సమయపాలన విషయంలో మేము పనిచేసే సంస్థలలో మేము ఎటువంటి అభ్యంతరాలు ఎదుర్కోలేదు. చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పిన రచయిత Dr K L V Prasad గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.👌👌👍👍💐

  5. 5

    Shyamkumar chagal

    Dr klv చెప్పినట్లు..దేశంలో విజయం సాధించిన ప్రతి ఒక్కరూ ఉదయం 5 లోగా నిద్ర లేస్తారు అని తెలుస్తోంది. ఇందులో NTR బ్రహ్మ ముహూర్తం అని పేరు పెట్టారు. ఈ తరానికి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచన కూడ రావడం లేదు. సమయ పాలనను ఎవరూ పట్టించుకోవడం లేదు. కొన్ని సందర్భాల్లో ఆ కార్యక్రమం లో సమయానికి ఎవరూ వుండరు నేనే వుంటాను. కార్యక్రమం అయిపోయింది ఆనుకుని వెళ్లితే..ఇంకా మొదలు పెట్టని సందర్భాలు అనేకం.
    ఇక mobile గురించి ఎంత చెప్పినా తక్కువే.
    మంచి విషయం మీద రాశారు. అభినందనలు.

  6. 6

    పుట్టి. నాగలక్ష్మి

    సమయపాలన మన జీవితాలను గాడి లో పెట్టడానికి మంచి టానిక్. ఈ టానిక్ గురించి మంచి టాపిక్ అందించారు.. ఉదాహరణలు బావున్నాయి.. గంట కొట్టడం మరీ మరీ నచ్చింది. అభినందనలు, ధన్యవాదాలు మీకు..

  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సమావేశాలకో శుభ కార్యాలకో సమయానికి వెళ్ళటం అనేది కాళోజీసోదరులు కచ్చితంగాపాటించేవారు
    ఎంత పెద్ద రాజకీయనాయకూడైనా ఆయన లెక్క చేసేవారూకాదు.పోతన భాగవత పంచశతి ఊత్సవాలప్పుడే అనుకుంట మెడికల్ కాలేజీఆడిటోరియంలో కవిసమ్మేళనం నాటి జాయింట్ కలెక్టరు ఆధ్యక్షతన ఏర్పాటు చేసినారు. మొదటి కవి కాళోజీ.
    ఆసమావేశానికి ఒక సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి వచ్చి ఉండె .ఆయనకోసం జాయింట్ కలెక్టర్ ఎదురు చూస్తూండె.ఒక ఐదు నిమిషాలు చూసి కాళోజీ గబగబా వేదిక ఎక్కి .” ఇవాళ కవిసమ్మేళనం జరుగుతున్నది నేను మొదటి కవిత్వం చదివే వాడిని. చదువుతున్న “అని ఆరోజు కరెంటు లేదు వేదిక మీద పెద్ద సెమ్మె పెట్టినారు.ఆసెమ్మె దీపంవెలుగులో తన కవిత్వం చదవటం మొదలు పెట్టిండు. విధిలేక ఏంచేసేదీ లేక సభాధ్యక్షులు ఇథరులు వారంతట వారే వేదిక ఎక్కి కూల్చోక తప్ప లేదు
    తన కవిత చదివినాక కాళోజీ ” ఇవాక్ష రాజులనుధిక్కరించిన పోతన ఉత్సవాలు చేసుకుంటూ ఎవడో అధికారి రావాలని ఎదురు చూడటం అవసరమా !వచ్చేవానికి జ్ఞానం ఉండాలెగద సమయానికి పోవాలె అని” అంటూ అందరికీ తలంటి పోసినాడు .అంతేకాదు సోదరులిద్దరు కూడా తాము అధ్యక్షత వహించే సభలకు సమయం కాగానే ఎవరూపిలవకుండానే వేదిక ఎక్కి ఇవాళ సభ ఉన్నది దానికినేను అధ్రక్షూడిని అని కూర్చూనే వారు సభ ప్రారంభించక తప్పక పోయేది నిర్వాహకులకు. .అంత కచ్చితంగా కాకపోయినా ఒక ఐదారు నిమిషాలటూఇటూ పరవాలేదేమో కాని గంట లకుగంటలు ఆలస్యం క్షమించరానిది.రిసెప్షన్లలో ఐతే మరీనూ కార్డులో వారిచ్చే సమయం ఏడుగంటలు .పెండ్లికొడుకు పెండ్లి పిల్ల వచ్చేది తొమ్మిది గంటలకు.పోనీ రాగానే మొదలెడ్తారా అంటే ఫోటోసెషన్ .వచ్చిన అతిధుల ఓపికను పరీక్షిస్తారు .
    ఇట్లా ఉంటది సమయ పాలన విషయం.ఈవిషయంలో మీ జ్ఞాపకాల పందిరిలో వెలిబుచ్చిన మీఆందోళన నూటికి నూరు పాళ్ళూ నిజం…
    —-రామశాస్త్రి

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ శాస్త్రి గారు.

  8. 8

    Rajendra Prasad

    You said it correctly sir. Because of us others time should not be wasted.
    Few year back, I attended a christian wedding in which one pastor was told to come at 5 p. m by the father of the bride. Pastor arrived to the wedding promptly by 5 p. m. But he noticed in the wedding invitation card , the time is mentioned as 4.30 p. m, he asked ” Why did you tell me 5 p.m when actually it is printed as 4. 30 p. m. The bride’s answered that by the time people come it will be 5 p. m , hence he mentioned 5 p. m to the pastor so that he may find at least a few people by the time pastor arrives. The pastor asked the bride’s father, his intension May be good but people will feel bad for that the pastor himself have been late
    Rajendra Prasad

  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా అంటే చాల విలువైన అంశాన్ని ప్రస్తావించారు సర్.సమయం యొక్క విలువ గూర్చి మీరు చెప్పింది అక్షరాలా నిజం.సమయాన్ని సరిగా వినియోగించుకోలేక చక్కని అవకాశాలు కోల్పోయిన వారు ఎందరో.వినియోగించుకొని లాభపడ్డ వారు కొందరు.తరలిరాని సమయం గూర్చి మా అందరికీ మంచి హెచ్చరిక చేస్తూ…నిమిషం కూడా వృధా చేయక సాగే మీకు నమస్కరిస్తూ ధన్యవాదాలు సర్🙏🙏💐
    —నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కొరడా దెబ్బలతోగానీ ,లేదా లాఠీలకు పని చెప్పటం వలన గానీ దోషిని శిక్షించవచ్చు .అలాగే తుపాకీ కాల్పుతో అల్లరి మూకను భయపెట్టి తాత్కాలిక శాంతిని నెలకొల్పవచ్చునేేమో కానీ ,కలం పోటుతో సమాజంలోనే మార్పును తీసుకురావాలనే దృఢ సంకల్పము రచయిత గారి మదిలో చిన్నతనంలోనే నాటుక పోయినట్టు కనిపిస్తుంది .అలా కాకపోతే “మేసేగాడిదను కూసే గాడిద చెరచినట్టు” పిల్లలకు ఏదో మంచి మాటలు చెప్పి వారిని ప్రయోజకులుగా చేయగలిగే పంతులమ్మ దగ్గరకి సమయాసమయాలు పాటించని అమ్మలక్కలు ,తమ ఇంటి వారిని నిర్లక్ష్యం చేయడమే కాకుండా పిచ్చాపాటి మాటలతో కాలాన్ని వృధా చేయటం ఇష్టం లేని ఈ శీర్షిక రచయిత ,చిరుప్రాయంలోనే చిరుగంట సవ్వడితో “తాను నొప్పక ఇతరులను నొప్పించక “అనే చందాన వ్యవహరించిన తీరు ప్రశంసనీయము.
    సమయపాలన పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించే ఎందరో వ్యక్తులను ,సందర్భాలను ఉదాహరణలతో ఒక రచయితగా చక్కగా వివరించారు డాక్టర్ గారు .కానీ …డాక్టర్ వృత్తిలో ఎంతో అనుభవం ఉన్న వీరు, సమయాసమయాలను పాటించని నేటి యువత పబ్బులు- గబ్బులలో రాత్రి అంతా గడిపి ఏ తెల్లవారుజామునో ఇంటికి చేరి ,స్నాన పానాదులు లేకుండా ,మిట్ట మధ్యాహ్నం వరకు నిదురించే యువత యొక్క ఆరోగ్యం ఎలా నాశనమైపోతుందో తెలియజేసుంటే ఇంకా బాగుండేదేమో !అని అనిపిస్తుంది.
    –బి.రామకృష్ణా రెడ్డి
    అమెరికా

  11. 11

    Bhujanga rao

    సమయ పాలన అందరికి చాలా ముఖ్యమైనది, తప్పనిసరి ఆచరించవలసింది.ఈ రోజుల్లో సమయపాలన పాటించేవారు తగ్గిన మాట వాస్తవమే. మీరు చెప్పినట్లు సమయపాలన అందరు ఆచరించవలసిన భాద్యతను గుర్తు చేస్తూ,లేని ఎడల కలిగే నష్టం ఇతరులకు కలిగే అసౌకర్యాలు మరియు సమాజానికి ఉపయోగకరమైన విషయాలు చెప్పిన మీకు హృదయపూర్వక నమస్కారములు,🙏

  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 122లో సమయపాలన, సద్వినియోగం గురించి చక్కగా తెలిపారు. సమయం అమూల్యమైనదని, అత్యంత విలువైనదని, కొందరు సమయాన్ని వృధా చేస్తారని తెలిపారు. సమయపాలన పాటించని పెద్దమనుషుల గురించి, వారి ప్రవర్తన గురించి రాశారు. విద్యార్థులకు సమయపాలన, సమయ సద్వినియోగం చాలా అవసరమని చెప్పారు. చక్కటి కథనం. అభినందనలు.
    —-జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!