సంచికలో తాజాగా

Related Articles

28 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక-అంతర్జాల పత్రిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    —డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

  2. 2

    Shyamkumar chagal

    సామెతల తో మొదలు పెట్టి పిల్లల్లో క్రమశిక్షణ ఆవశ్యకతను వివరిస్తూ, పెద్దల పెంపకం ఎలా వుండాలి అన్నది చాలా బాగా చెప్పారు. లేకుంటే వారి జీవన విధానం వల్ల ఇతరులకు కలిగే ఇబ్బందులను స్వానుభవం తో వివరించారు. ఏది ఏమైనా తాను చెప్పాలి అనే విషయాన్ని జాగ్రత్త గా ఒక పద్దతి లో పాఠకుడు అర్థం చేసుకునే లాగా రచయిత చేసిన ప్రయత్నం అద్భుతంగా వుంది. ఇందులో Dr klv గారు ప్రవీణుడు అనే చెప్పాలి. అభినందనలు.

    1. 2.1
  3. 3

    sagar

    చాలామంచి ఉపయోగకరమైన వ్యాసం సర్. మీరన్నట్లు చేయవలసిన పని చేయకపోతే మీకు నచ్చదన్నారు. అది నిజమే. ఎంత ధనవంతుడయినా పేదవాడైనా ఆ నిబద్దత ఉండాల్సిందే. ఇక మీ విషయంలో దగ్గరి బంధువులు కాబట్టి భరించి తరువాత అతనిని మార్చమని తండ్రికి సలహా ఇవ్వడం తప్పేమీకాదు. అది వినకపోవడం వాళ్ళ ఖర్మ అనుకుని వదిలెయ్యాల్సిందే. మంచి వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదములు సర్ .

  4. 4

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    అందరికీ ఉపయోగ కరమైన మంచి వ్యాసము ఈ సంచికలో అందించిన మీకు ధన్యవాదాలు అన్నయ్య గారు
    —-జయ అలెగ్జాండర్
    అమెరికా.

    1. 4.1
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Thank you for your story and it is all real events happing in our society now a days.
    —prof.Rakakrishna murthy
    USA

  6. 6

    డి. వి. శేషాచార్య

    ఈ వారం మీరు చెప్పిన విషయం చాలా సున్నితమైది. చాలా విలువైనది.మీరూ చాలా సున్నితంగానే వివరించారు. ఇలాంటివి ఎవరూ చెప్పేవి కాదు. ఎక్కడా రాసుండవు. ఒకరోజు
    వుండి వెళ్లిపోయే అతిథి ఇలా ప్రవర్తిస్తే మనం సర్దుకుపోగలం కాని ఎక్కువ రోజులు ఉండేవారు ఇలా ఉంటే ఇరిటేషన్ తప్పదు. ఇతరులకు ఇబ్బంది కలుగజేస్తున్నామన్న ఆలోచన లేని మనుషులను మార్చడం చాలా కష్టం. ఆ తల్లిదండ్రుల పరిస్థితి మరీ విపరీతంగా వుంది.
    ఏది ఏమైనా ఆలోచనాత్మకమైన అంశాన్ని పాఠకుల ముందుంచిన మీకు అభినందనలు.

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      శేషాచారిగారూ.

  7. 7

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 121…అందరికి అది అవసరమే..!! సమాజానికి ఉపయోగపడేలా మంచి సంచిక. అలవాటు ఏ దైన ఒక పనిని మళ్ళీ మళ్ళీ అదే తడవుగా చేస్తూ ఉంటే అదుపు తప్పిన ప్రవర్తన మరియు క్రమశిక్షణా రాహిత్యం అవుతుంది. పిల్లల క్రమశిక్షణ ఎంత అవసరమో వివరిస్తూ వారి పట్ల పెద్దల పెంపకం ఎలా ఉండాలి అన్నది చక్కగా వివరించారు సర్. అట్లాగే వారి జీవన విధానం వల్ల అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఇతరులకు కలిగే ఇబ్బందులను అనుభవపూర్వకంగా వివరించారు. మంచి విషయాలు అందిస్తున్న మీకు ధన్యవాదములు సర్🙏

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యోస్మి ధన్యవాదాలండీ
      భుజంగరావు గారూ.

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మా ఇంటికి వస్తే ఏంతెస్తవు మీఇంటికివస్తే ఏమిస్తవు అన్నట్టు ప్రవర్తించే వాళ్ళు ఉంటరు కొందరు.
    మీరుచెప్పిన వారితెగ కేవస్తరు వీరుకూడా.వారివెంట వచ్చేపిల్లలను కంట్రోల్,చెయ్యరు..పిల్లలు ఎదురుగ్గ ఏదికనపడితే అవి తీసుకొని( అడుగకుండగనే) పడేస్తరు ఆటబొమ్మలైతే పలగ్గొడతరు గూడా.తలిదండ్రులు కూడా ఏమని సమర్థించుకుంటరంటే మావాడు ఏది చూసినా వాడికది కావాలంటే ఇచ్చేవరకు ఊరుకోడు. అని.
    అమెరికాకు పోయినా కొందరి ప్రవృత్తి మారదు.మా కు తెలిసిన అబ్బాయి స్నేహితుడు ఇల్లు మారుస్తూ మావాడింటికి కుటుంబంతోవచ్చినాడు వారం ఉంటనని దోస్త్ కదా అని మావాడు సరే అన్నడు.ఐతే ఆ అబ్బాయి కీ ఆయన భార్యకూ వాళ్ళింట్లో ఏంవపనిచేసుకునేవారో ఎట్ల చేసుకునేవారో తెలియదుకాని భోజనాలు కాంగనే టేబిల్ మీద తిన్న కంచాలు వదిలేసి పోయి చేతులు కడుక్కోవటమే.పైగా ఆపిల్లడంటాడూ మా ఆవిడకు కంచాలు తీయటం వంటి అలవాటులేదు అని.
    ఇంకొక రకంశమనుషులుంటరు . సాయంకాలమో మధ్యాహ్నమో భోజనాల సమయం కంటె కొద్దిగ ముందు వస్తరు .మనలచూడవచ్చినట్టుగా.ఏ బొకేనో చిన్న స్వీట్ పాకెటోనాలుగు పండ్లో.పట్టుకుని.మాట్లాడుతునేవుంటరు నాన్ స్టాప్ గా భోజనాలు చేస్తరో లెదో తెలియదు.,they comoell the owners to ask them tobe there for lunch or dunner.మనం ప్రిపేర్,ఐ వుండం
    పోనీ వచ్చేముందు లంచ్కో డిన్నర్కోవవస్తం అని చెప్తారా అదీలేదు .అసలు వస్తున్నట్టే మర్యాదకైనా చెప్పరు భోజనానికుండమని అనకపోతే భోజన సమయానికి పోయినా మర్యాదకైనా తినమని అనలేదు.ఐనా వాళ్ళడగ్గానే తింటానికి మేం ఏమైనాతినటానికిపోయినమా అని బయట బద్ నామ్ చేస్తరు.. కొందరు సాయంత్రం ఏడుగంటల ప్రాంతంల వస్తరు అక్కరలేని విషయాలన్నీ అడ్డమైన సంఖతులన్నీ మాట్లాడుకుంటూ కూచుంటరు .లేటైతున్నదని భోంచేసి పొండి అంటే మేము తినే వచ్చినమంటరు మనం తినవలసి ఉన్నదని గుర్తించరు తొమ్మిది పది వరకు కూచుంటరు వట్టిగనే.
    మీరన్నట్టు కనీసమరియాదలూ,ఉండవు .ఇంకొకరింటికి పోయినప్పుడు వాళ్ళకు అసౌకర్యం కలిగించకుండాల్సిన అవసరమున్నదనే తెలివిడి కూడా వుండదు .
    కొన్నేండ్ల కిందట రేడియోలో ఒక నాటిక వచ్చింది. పేరు అతిథి దేవుళ్ళొస్తున్నారు కావచ్చు .రాత్రి పది గంటలతర్వాత వచ్చి కుటుంబంతో సహా వచ్చి పెద్దమనిషి నేను భోజనంవచెయ్యనమ్భా తప్పదని నువ్వంటే కాస్త ముద్ద,పప్పు వేయ లేకుంటే నాకు,ముద్ద దిగదు .ఇంట్లో ఆవకాయ ఉంటుందికదా.ముద్ద,పప్పు ఆవకాయ నెయ్యితో తింటేనే నాకు తిన్నట్టుంది. కాసింతలరసంకాయమ్మా ఆచేత్తోనే రెండు అప్పడాలెలాగూ వేయిస్తావనుకో. పెరుగు లేకుంటే నాకు భోజనం చేసినట్టే వుండదు మీ విధి చివర,మార్వాడీ కొట్టుందికదా మీ ఆయన ఎంతలో తెస్తాడు పెరుగు .ఎట్లాగూ అంతదూరం వెళ్తున్నాడు కదా ఆ పక్కనే కిళ్ళీ కొట్టులో ఓ కారాకిళ్అళీ కూడా తెమ్మను .,ఇక మీ అత్తయ్య వాళ్ళకు నువ్వేం వంటచేస్తావో నీఇష్టం వాళ్ళిష్టం.. మీఅత్తయ్య,రోటిపచ్చడి లేకుండా ముద్ద,ముట్టదు ఎంతలో రుబ్బేస్తవు నువ్వు వచ్చిన అందరికీ వేరు వేరు భనూ చెప్పి దుంప తెంచుతారు. ఇతరుల ఇండ్లకు పోయినప్పుడు కనీసమర్యాదకూడాపాటించరు జనాలు ఏంచేద్దాం
    ఇప్పటికే ఏదేదో వాగినట్టున్న.
    లోక సహజమైన విషయాలే చెప్తున్నరు మీరు . బాగున్నది సంచిక.
    —రామశాస్త్రి

    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యోస్మి
      శాస్త్రి గారు.

  9. 9

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    చాలా మంచి ఉపోద్ఘాతంతో అందరికీ ఎంతో విలువైన విషయం చెప్పారు సార్ ఈ ఎపిసోడ్ లో. ఒక క్రమశిక్షణకు అలవాటు అయిన వాళ్ళకి ఇలాంటి పధ్ధతి చూసినప్పుడు నిజంగానే తలిదండ్రులు ఎలా పెంచారో అని అనిపించక మానదు. మీరు సహనం వహించి మర్యాదగా వారి పేరెంట్స్ కు చెప్పి నందుకు మిమ్మల్ని మన్నించమని అడిగి వాళ్ళ పుత్రరత్నంను సరిదిద్దే బదులు కోప్పడడం చాలా బాధాకరం సార్. ఇది అందరూ గమనించవలసిన విషయమే సార్. తల్లి దండ్రుల క్రమశిక్షణే రేపు వారి పిల్లలకూ సరైన బాధ్యత నేర్పు తుంది. మంచి విషయాన్ని జ్ఞాపకాల పందిరిలో దాచి మాకు అందించడం చాలా ఆనందం గా ఉంది సార్. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
    మొహమ్మద్.అఫ్సర వలీషా

    1. 9.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      అమ్మా
      హృదయపూర్వక ధన్యవాదాలు.

  10. 10

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Well said sir. One need to utilise such opportunities to strengthen relationship. Here we see otherwise.You may be right, such attitudes in children will cause failures in Marital relationship 😒
    —Rajendhra prasad
    Hyderabad.

  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    క్రమ శిక్షణ గల జీవన శైలి లేకపోతే ఎవరి జీవితమైనా అస్తవ్యస్తంగా నే ఉంటుంది.సర్దుబాటు అలవాటు కాదు.దీనికి విద్యతో సంబంధం లేదు మీరు చెప్పినట్టు ఈనాడు తల్లిదండ్రులు మంచి అలవాట్లు చేయక పోతే రేపు వారి భవిష్యత్తు కూడా సరళత్వానికి విరుద్ధంగా జరుగుతుంది.చాలా చాలా అవసరమైన అంశాన్ని మీకు ఎదురుపడిన సంఘటన ద్వారా వివరించారు.ధన్యవాదాలు సర్🙏💐💐
    —-నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

  12. 12
  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా చాలా బాగుంది ఆర్టికల్…మనం రోజూ నిత్య జీవితంలో ఇవన్నీ చూస్తూనే ఉన్నాము.కాని వారు వినరని అర్థం చేసుకోలేరని తెలిసినా చెప్పవలసిందే..సరైన మనుషులు ఐతే మారతారు..లేదా కనీసం దూరంగా వెళతారు.అదిచాలు మనకి! అభినందనలు సోదరా!💐💐💐💐
    —-హైమవతి
    విశాఖపట్నం.

  14. 14

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    “పిల్లల ప్రవర్తన- తల్లిదండ్రులపాత్ర “అనే అంశాన్ని రచయిత ఈ ఎపిసోడ్లో సోదాహరణంగా మరియు సున్నితంగా తెలియపరచిన విధానం చాలా చక్కగా ఉంది. కొందరి ఇళ్లల్లో నిత్యము ఉపయోగించే కొన్ని వస్తువులు చిందర బందరుగా పడి ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం .దానికి కారణం ఎవరైనాప్పటికీ వాటిని క్రమ పద్ధతిలో అవసరమైనప్పుడు ఉపయోగించడానికి అణువుగా వాటి వాటి స్థానాల్లో అమరుస్తూ, అలా చేయడం వలన ఎంత ఉపయోగకరంగా మరియు అలంకారప్రాయంగా ఉంటుందో పిల్లలకు అర్థమయ్యేటట్టు తెలియజేయడం పెద్దల బాధ్యత .కానీ దురదృష్టవశాత్తు నేటి యువత క్రొత్త కొత్త వస్తువులను సేకరించడంలో కనబరచే ఉత్సాహం వాటిని ఉపయోగించుటలో విఫలమటం వలన పిల్లలకు సరైన మార్గ నిర్దేశకులు కాలేకపోతున్నారేమో!
    —-బి.రామకృష్ణా రెడ్డి
    అమెరికా.

    1. 14.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలండీ రెడ్డి గారు

  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 121…నేటి తల్లిదండ్రులకు పిల్లలకు నీతి సూత్రాలు బోధించే సమయము దొరకదు. పిల్లలను నర్సరీ స్కూల్ లో చేర్పించినప్పటి నుంచి మార్కులు, ర్యాంకులు, గ్రేడ్ గొడవలు. మీరు చెప్పినట్లుగా, పిల్లలను క్రమశిక్షణతో పెంచడం తల్లిదండ్రుల కనీస బాధ్యత. సమాజానికి క్రమశిక్షణ, వినయవిధేయతలతో పెంచిన పిల్లలను అందించడం తల్లిదండ్రుల కర్తవ్యం. అభినందనలు
    –జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!