సంచికలో తాజాగా

Related Articles

22 Comments

  1. 1

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    —డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా.

  2. 2

    sagar

    చాలామంచి విషయం వివరించారు సర్. నిజంగ ముఖ్యమంత్రిలాంటి వ్యక్తి ఒక ఉద్యోగి వ్రాసిన ఉత్తరానికి స్పందించడం ఆహ్వానించతగిన పరిణామం. దురదృష్టవశాత్తు ఇప్పుడు పరిస్దితులు మారాయి. అదీ వేరే విషయం.హరనాద్ రావులాంటి వారికి అడ్డుపుల్లలు వేసేందుకు ఎవరైనా సిద్దంగా ఉంటారు అనడంలో సందేహమేలేదు. ఇక నాగభూషణంగారి జీవితాన్ని మరోలా మలుపు తిప్పిన మీ సలహా అధ్భుతం. మీకు ధన్యవాదములు సర్

  3. 3

    పుట్టి. నాగలక్ష్మి

    ఇద్దరు మంచి వ్యక్తుల గురించి తెలియజేశారు.. సంతోషంగా అనిపించింది.. ధన్యవాదాలు డాక్టర్ గారూ!

  4. 4

    శ్యామ్ కుమార్ చాగల్

    డాక్టర్ కె ఎల్వి ప్రసాద్ గారి ఈ వ్యాసం లో ఉద్యోగుల లో అవినీతి గురించిన ప్రస్తావన ముఖ్యమైన విషయం అని చెప్పాలి. నీతి నిజాయితీ పరు లకు కూడా సరైన సమయం లో గుర్తింపు,బహుమతి దొరుకుతుందని అంతర్లీనంగా చెప్పటం రచయిత ముఖ్య ఉద్దేశం గా కనపడుతోంది. ప్రతీ కార్యాలయం లో పని దొంగలుండటం వారి పని కూడా వేరే వాళ్ళు చేయటం సర్వసాధారణం గా చూస్తూనే ఉంటాం. నిజానికి ఎనభై శాతం పని ఇరవై శాతం ఉద్యోగులు చేస్తూ వుంటారు.

    అవినీతి గురించి ఇక చెప్పనవసరం లేదు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో అయితే అవినీతే అసలు పనిగా వుంది. ఇక అవినీతిని రూపు మాపాల్సిన చోటే ఇంకా ఎక్కువ అవినీతికి ఆస్కారం ఎక్కువ. లా అండ్ ఆర్డర్ వాళ్ళ గురించి ఎంత తక్కువ గా మాట్లాడితే అంత మానసిక శాంతి.
    అవినీతికి పాల్పడిన కోకొల్లలు చరిత్ర లో రూపు మాసి పోతారు కానీ, నీతిపరులు మాత్రం ఎప్పటికీ మనస్సులో మెదులుతూనే వుంటారు. దానికి తార్కాణం రచయిత తన జీవితం లో ఎదురయ్యింది వ్యక్తుల గురించి ప్రస్తావించటమే.
    వారంతా ధన్యజీవులు.

    1. 4.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      మిత్రమా
      చాలా బాగా రాసావు
      హృదయపూర్వక ధన్యవాదాలు.

  5. 5

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి..!!అది కూడా అవసరమే!!
    ఈ సంచికలో లంచగొండి తనం వ్యక్తి స్వలాభం కోసం వ్యవస్థను ఉదేశ్యపూర్వకంగా విచ్చిన్నం చేసే ప్రక్రియను బాగా వివరించారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు గారు ఆలూరి హరనాథ్ రావు గారి ఉత్తరానికి స్పందించి అడిగిన ప్లేస్ కు ట్రాన్స్ఫర్ ఇవ్వడం వారి నిజాయితీకి నిదర్శనం. నాగభూషణం గారు మీ సలహా అభిమానించి స్వీకరించడం ముదావహం. మాకు తెలియని వారిని పరిచయం చేస్తూ చాలా మంచి తెలియని విషయాలు వివరించారు సర్.మీకు ధన్యవాదములు డాక్టర్ గారు,🙏

  6. 6

    డి. వి. శేషాచార్య

    హరనాథరావు గారి సుదీర్ఘ న్యాయపోరాటం గురించి అప్పట్లో న్యూస్ పేపర్లలో కూడా వచ్చింది. అలాగే వారి పరిచయభాగ్యం కూడా మీ వల్ల కలిగింది. అవినీతి రహిత పాలన అనే మాట నాయకుల నోళ్ళలో తిరిగే ఒక అద్భుత పదబంధం.అంతేతప్ప ఆచరణశూన్యం. ఆఫీసు, అవినీతి అనేవి చక్కగా పెనవేసుకొన్న వ్యవస్థలో హరనాథరావుగారి వంటి అధికారులు కళ్లు కాయలు కాసేలా వెతికినా దొరకరు. వారిని గురించి ఈ రోజు మీరు పరిచయం చేయడం ఆనందంగా వుంది.
    మీ సలహాను ఆచరణలో పెట్టడం నాగభూషణం గారి అదృష్టం.

  7. 7

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Great story sir. Rare personality society needs this type of people 🙏🏿
    –Dr.D.Sujatha
    Vijayawada.

  8. 8

    Sunianu6688@gmail.com

    అవును sir! నిజాయితీగా పని చేస్తే ఆ ఆనందమే వేరు.నేను ఒక ఆర్థికసంభాధమైన సంస్థ లో పని చేస్తున్నా. మహిళనయనా నాకు కూడా చాలా ఒత్తిడులు వచ్చేవి. ఐనా భయపడేదాన్ని కాదు.కొన్నిరోజులు భాధవేసేది. తరవాత నిజాయితీగా ఉన్నందుకు ,మా నాన్నగారు నన్ను పెంచినవిధానానికి గర్వంగా ఉంటుంది. నా విషయం అప్రస్తుతం అయినా చెప్పాలి అనిపించింది. రచయిత గారికి క్షమాపణలు మరియు ధన్యవాదాలు👌💐

  9. 9

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    117 వసంచిక లోకంలోని సహజపరిస్థితులను చెప్పింది.అందుకే అంటుంటారు ఈప్రపంచం ఇటువంటి వాళ్ళుండబట్టే నడుస్తున్నదింకా అని..
    —అభినందనలు సర్
    రామశాస్త్రి
    హన్మకొండ.

    1. 9.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      శాస్త్రి గారు ధన్యవాదాలండీ

  10. 10

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    పనిదొంగలు, లంచగొండులతో పాటు వృత్తిపట్ల అంకితభావం, నిజాయితీ,పనిచెయ్యటంలో శ్రద్ద లాంటి మంచి గుణాలు ఉన్నవారూ ఉండబట్టే… సామాన్యజనం ఈ కాస్తంతైనా ప్రశాంతంగాబ్రతకగలుగుతున్నా రు…నిజమే తమసుఖము
    ఆనందం కోసం కాకపోయినా… తన కుటుంబం కోసమైనా కొంత సమయాన్ని కేటాయించ వలసిందే… బాగుంది 👏👏👏🙏💐🙏
    కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

  11. 11

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    నీతీ నిజాయితీ ఎప్పుడూ నిలిచి ఉంటుంది సర్.వారి జీవితాల్లో అడ్డంకులు ఎదురైనా వారి వ్యక్తిత్వం వాటన్నిటినీ తొలగించుకుంటూ పోతుంది.నీతిపరులు కనుకే శ్రీ హరి గారికి ముఖ్యమంత్రి అంతటి వారి సహకారం లభించింది.నిజాయితీగా కష్టపడే నాగభూషణం గారికి మీ సాహచర్యమ్ లభించింది.అటువంటి వారికి జ్ఞప్తికి తెచ్చుకోవడం సమాజానికో మంచి పాఠాన్ని అందించడమే.సమాజానికి అవసరమైన ఇద్దరు ముఖ్య వ్యక్తుల గూర్చి తెలియచేసినందుకు ధన్యవాదాలు సర్🙏💐💐
    —నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    1. 11.1
  12. 12

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    జ్ఞాపకాల పందిరి 117 లో సమాజాన్ని పట్టి పీడిస్తున్న లంచావతారాల గురించి వారి దర్పం, దర్జా గురించి తెలిపారు. తారక రామారావు గారి హయాంలో ఎన్నో మంచి సంఘటనలు జరిగాయి. నీతిగా కష్టపడే వాళ్ళు సుఖపడాలని కోరుకున్నారు. కథనం బాగుంది.

    నేను సింగరేణి సంస్థలో ఆడిట్ అధికారిగా చేస్తున్నప్పుడు, ఒక గని క్యాంటీన్ లో జరుగుతున్న అవకతవకలను పట్టుకున్నాను. జరిగిన అవినీతి విలువ దాదాపు 6 లక్షలు. సంబంధిత క్లర్క్ ను ఎంక్వైరీ తరువాత ఉద్యోగం నుంచి తొలగించారు.
    ——-జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    1. 12.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      చారిగారు
      ధన్యవాదాలండీ.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!