సంచికలో తాజాగా

Related Articles

32 Comments

  1. 1

    sagar

    పొదుపు ఖచ్చితంగ భవిష్యత్తుకు అవసరమే సర్ . మీరు చెప్పినట్లు కడుపు మాడ్చుకుని బార్యా పిల్లలను ఇబ్బందిపెట్టేలా మసలడం పొదుపు అనేకంటే చాదస్తం అనాలి. పొదుపు తో సుఖమైన జీవితాన్ని పొందినందుకు మీకు శుభాకాంక్షలు మరియు మంచి విషయాలను తెలియపరచినందుకు ధన్యవాదములు సర్.

    1. 1.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలు
      సాగర్ రెడ్డి.

  2. 2

    పుట్టి. నాగలక్ష్మి

    మీ పొదుపు బంధువు వంటి బంధువు మాకూ ఉన్నారు.. బియ్యం డబ్బా కి తాళం వేసుకుని వెళ్ళేవాడు.. ఆయన కూతురు రెండాకుల ఎక్కువ చదివింది.. అన్నం, కూర పెట్టెలో పెట్టి తాళం వేసి బడికి వెళ్ళేది.. పొదుపు చాలా సూత్రాలు న్నాయి.. జాగ్రత్తగా పాటిస్తే సంతోషం.. లేకపోతే దుఃఖమే! మీకు 🙏

  3. 3

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    👏👏👏👏అవసరం, అవకాశం ఉన్నపుడు హాయిగా అనుభవించాలి !
    సంపాదనలో… యే కాస్తంతైనా పొదుపు చేసుకోవాలి
    దుబారాలేని జీవితం కడదాకా ఆనందం !…
    —కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

  4. 4

    Sambasiva+Rao+Thota

    ప్రసాదుగారు !

    పొదుపు గురించి చాలా చక్కగా వివరించారు ..
    మీరు చెప్పిన విధంగా ఆర్ధిక క్రమశిక్షణ కలిగివున్నవారి జీవితం ఆనందమయం .

    మంచి విషయం ..

    ధన్యవాదాలండి 🙏

    1. 4.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      కృతజ్ఞతలు మీకు
      సాంబశివ రావుగారు.

  5. 5

    Bhujanga rao

    పొదుపు అంటే తమ ఆదాయంలో డబ్బును ఖర్చు చేయకుండా ఉండడం పొదుపు,అంటే ఖర్చును తగ్గించుకోవడం.డబ్బు ఎలా ఎందుకు పొదుపు చేయాలి దాని అవసరాలు గుర్తించి,వాటి మార్గాల గురించి తెలుసుకొని ఆదా చేసినట్లయితే,అత్యవసర ఖర్చులను అధిగమించి తద్వారా ఆర్ధిక స్వేచ్చను పొందవచ్చని ఈ సంచిక ద్వారా పొదుపు గురించి చక్కగా వివరించారు. మంచి విషయాలు అందిస్తున్న మీకు ధన్యవాదములు డాక్టర్ గారు🙏

  6. 6

    D. Umashanker

    Very educative. What you said is absolutely correct.

  7. 7

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    సంపాదన, ఖర్చు, పొదుపు ముఖ్య మైన పాయింట్స్. అతి పొదుపు కూడ అంత మంచిది కాదు అని ఈ సంచికలో వివరించారు అన్నయ్య గారు
    —-శ్రీమతి జయ అలెగ్జాండర్ ,
    అమెరికా.

  8. 8

    Rajendra+Prasad

    పరిమితిని మించి పొదుపు అయినా, ఖర్చు అయినా మంచిదికాదు. పొదుపు పేరు చెప్పి, స్థోమత ఉన్నా, అవసరాలు కూడా తీర్చుకొక పోతే మూర్ఖత్వం అవుతుంది
    – రాజేంద్ర ప్రసాద్

  9. 9

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    జ్ఞాపకాల పందిరి-116 లో సంపాదన మరియు పొదుపుపై చక్కటి కథనం. కొందరు సంపాదన తక్కువైనా తృప్తిగా ఉన్నదాంట్లో గడుపుతారని, మరి కొందరు ఆదాయం ఎక్కువైనా దుబారా ఖర్చులు చేసి అప్పులపాలవుతారని జీవిత సత్యం తెలిపారు. పొదుపు చేస్తూ పిల్లల ఎదుగుదలకు, ఉన్నతికి పాటుపడితే మంచిదే. పొదుపు మంచిదైనా, అదుపులో ఉండాలి. జీవితంలో ఏదీ అనుభవించక కడుపు మాడ్చుకునేది కాకూడదని తెలిపారు. మీరు చెప్పినట్టుగా కొందరు విందులకు వెళ్లినప్పుడు ఆబగా తింటారు. ఇంట్లో కడుపు మాడ్చుకుంటారు. సందేశాత్మక కథనం.
    జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    1. 9.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      మీ విశ్లేషణ బాగుంది
      కృతజ్ఞతలు చారిగారు..

  10. 10

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    మీ నూటపదహార్ల సంచిక చదివినాను సర్.అందులో వ్యాఖ్యానించటానికేంలేదు చేతనైతే అనుసరించి ఆచరించవలసిన విషయాలేవున్నృయి.పొదుపువిషయంలోనూ మీఅభిప్రాయాలునాదృష్టిలో సరైనవే.
    పాఠకుడిని మీవిషయం వెంట తీసుకొని పోయే మీరు రాసిన పద్ధతి బాగున్నది నాకు చాలా ఇష్టం
    —రామశాస్త్రి
    హన్మకొండ జిల్లా.

  11. 11

    శ్యామ్ కుమార్ చాగల్

    జీవితం లో ఆదాయ వనరులను దృష్టిలోనుంచుకుని జీవం విధానం లో సమతుల్యత ఎలా పాటించాలో వ్యక్తిగత అనుభవాలను రంగరించి మనకు వివరించారు రచయిత. ఇటు పిసినారి జీవితాలు ఎలా ముగుస్తాయి, అటు జల్సా రాయుళ్ల జీవితాలు ఏ విధంగా నాశన మై పోతాయో మనమందరూ చూస్తున్నప్పటికీ విజయ వంతంగా మన దృష్టి కి తెచ్చే ప్రయత్నం చేశారు. చిన్న చిన్న సేవింగ్స్ తో కలిగే లాభాలు చాలా పెద్దవి. అధిక పొదుపు తోటే కొందరి జీవితాలు దుర్భరంగా మారిపోతాయి. అవి వారినే కాక వారి కుటుంబ సభ్యుల బ్రతుకులను కూడా పేదరికం లో గడిపేలా చేస్తాయి.
    పిసినారితనానికి మరో పేరు సింపుల్ లివింగ్. ఇది అందరు పిసినార్లు స్టైల్ గా చెప్పే గొప్ప తనం. డాక్టర్ కె ఎల్వి ప్రసాద్ చెప్పినట్లుగా మూడు సూత్రాలను పాటిస్తే అందరూ సుఖంగా జీవించి , సంతోషంగా మరణిస్తారు.

    డబ్బు గురించి , వాగాహన వున్నా వారెందరో హాయిగా జీవనము కొనసాగించటం మనం చూస్తున్నాం, అలాగే భవిష్యత్తును భూతంగా చూస్తూ అధికంగా పొదుపు చేసిన వాళ్ళు బీద వాడిగా మరణించటం కూడా చూస్తున్నాం.
    ఏది ఏమైనా బ్యాలెన్సుడ్ గా జీవించటం అంత సులభం ఏమీ కాదు.

  12. 12
  13. 13

    డి. వి. శేషాచార్య

    దీనిని కథగా మారిస్తే అద్భుతంగా ఉంటుంది. పొదుపు, పిసినారితనం మధ్య తేడాను చాలా బాగా చెప్పారు.

  14. 14

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జీవితాలను ప్రారంభించటానికి ముందే ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో అవసరమైన సదుపాయాలను సమకూర్చుకోవటంతో పాటు, భవిష్యత్తులో ఒడుదుడుకులను అధిగమించటానికి, తోటివారిని అవసర కాలంలో ఆదుకోవడానికి కావలసిన ధనసముపార్జన ఎంతో అవసరం. కానీ ఈ సంపాదన ,పొదుపు ఎంత ముఖ్యమో ,అవసరమైనప్పుడు వాటిని పరిమితంగా ఖర్చు చేయడం కూడా అంతే అవసరం. ఇటువంటి జీవన విధానానికి పెద్దల మార్గదర్శకం ,స్నేహితుల సహకారం, మరియు తను ఎన్నుకున్న సమాజ ప్రభావం దోహదపడతాయి. తోటి వారికి ఎంతో మేలు చేసే ఈ సద్గుణాలను రచయిత తమ స్వవిషయాలను జోడించి చక్కగా వివరించారు.
    —–
    బి.రామకృష్ణా రెడ్డి
    మేరీలేన్డ్
    అమెరికా

  15. 15

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    మనిషి ఎదుగుదలకు పొదుపు అవసరమే మీరు చెప్పినట్లు అతి పనికిరాదు.కనీసవసరాలకు కూడా అదీ ఉండి కూడా మరీ అలా కుటుంబ సభ్యులను బాధ పెట్టి మరీ కూడబెట్టడం దానిని పొదుపు అనే కంటే పిసినారితనం అంటారేమో సార్. చక్కని విశ్లేషణాత్మకతతో వివరణాత్మకంగా వ్రాశారు పొదుపు అతి పొదుపు మధ్య జరిగిన మీరు గమనించిన విషయాలు. అందరికీ మేలుకొలుపు సార్ మీ జ్ఞాపకాల పందిరిలో దాగిన జ్ఞాపకాలు. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు 💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    మొహమ్మద్. అఫ్సర వలీషా
    ద్వారపూడి (తూ. గో .జి)

    1. 15.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      అమ్మా
      నీ స్పందనకు ధన్యవాదాలు.

  16. 16

    sunianu6688@gmail.com

    పిసినారితనానికి,పొదుపు కి మధ్య ఒక సన్నటి రేఖ వుంటుంది. డబ్బు లేకపోతే పీనాసితనామ్ బావుంటుంది కానీ డబ్బు వుండి పీనాసితనామ్ తో తాను అనుభవించక, పిల్లలుని ఇబ్బందులు పెట్టి పోయేటప్పుడు ఏమి తీసుకు వెళ్లగలం. అలాగే డబ్బు లేక ప్రక్కన వారిని చూసి వాత పెట్టుకుంటే మన వళ్లే కాలుతుంది. చాలా ఉపయోగకరమైన విషయాలు వెల్లడించిన రచయిత గారికి ధన్యవాదాలు.👌👌👌💐💐

    1. 16.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  17. 17

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    చాలా విలువైన ఆర్థికాంశాలు ,జీవించాల్సిన విధానం గూర్చి సవివరంగా తెలియచేశారు.పొదుపు విషయంలో మీరు చెప్పిన ఆనందాల్ని పొందలేని వారిని చూస్తే నిజంగానే జాలి,నిస్తేజం కలుగుతుంది. సంపాదించిన దాన్ని సరైన రీతిలో అనుభవించడం ఖచ్చితంగా తెలియాలి.చాలా చిన్ని.చిన్ని.ఆనందాల్ని కూడా కోల్పోతారు కొందరు పొదుపు పేరుతో.కొందరు మీలా తృప్తి కరమైన జీవితాన్ని జీవిస్తారు.రెండు భిన్నమైన జీవితాల్ని కళ్ళకు కట్టినట్లు చూపి చాలా మంది మనసుల్ని తట్టి లేపారు సర్.మీ అక్షర సత్యాలకు హృదయపూర్వక ధన్యవాదాలు🙏💐💐నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    1. 17.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      అమ్మా
      మీ స్పందనకు
      హృదయపూర్వక ధన్యవాదాలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!