Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

డా. నాగసూరి వేణుగోపాల్‌ గారికి ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం – ప్రకటన

జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా, తెలుగు సాహిత్యరంగంలో అత్యంత విశేష కృషి సల్పుతున్న పరిశోధక రచయితకు ‘ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం’ ఏటా ఇచ్చే ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం 2025కి గాను ప్రముఖ రచయిత డా.  నాగసూరి వేణుగోపాల్‌కు ప్రకటించింది.

సైన్స్‌ విజ్ఞానం, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, జాతీయ నాయకుల చరిత్రలువంటి పరిశోధనాత్మక విశేష రచనలను అందించింనందుకు గాను నాగసూరి చేసిన కృషిని గుర్తించి రచయితల సంఘం ఈ పురస్కారానికి ఎన్నిక చేసింది. ఈ పురస్కారం కింద్ర ₹ 3,000/- నగదు, జ్ఞాపిక, సన్మాన పత్రం, శాలువాలతో నవంబర్‌ 15వ తేది సాయంత్రం విజయవాడలోని మహాత్మగాంధీ రోడ్డులోగల ఠాగూర్‌ స్మారక గ్రంథాలయంలో రచయితని సత్కరించడం జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం అధ్యకక్షులు డా. సి. భవానీదేవి అధ్యక్షతన జరిగే ఈ సభలో ప్రముఖ సాహితీవేత్తలు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు.

ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం నెలకొల్పిన ఈ ‘జ్ఞానజ్యోతి’  పురస్కారం గతంలో బహుగ్రంథకర్త, రచయిత, పరిశోధకుడు గబ్బిట దుర్గాప్రసాద్‌, చారిత్రక పరిశోధకుడు సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌, డా. సి.భవానీదేవి, డా. వెలమల సిమ్మనలకు అందజేయగా, ఇప్పుడు అందుకుంటున్న నాగసూరి వేణుగోపాల్‌ ఐదవవారు.

– చలపాక ప్రకాష్‌

ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం

Exit mobile version