[వాణి వేమవరపు గారు రచించిన ‘జ్ఞాపకాల పయనం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
అమ్మ పేరులోనే అమృతం ఉంది,
అందమైన ఆ నవ్వులో ఆత్మీయత ఉంది,
ఆ ఆదిపరాశక్తి లోనే నీ రూపం ఉంది.
పిలిచేటి పిలుపులోనా నీ గొంతుక మధురం,
మూగబోయిన ఆ గొంతుక ఎచటని వెతకం,
తీయటి జ్ఞాపకాల కాలంతో పయనం,
మా కనులలోన దాగుంది నీ దివ్యమైన నయనం.
మాతోనే ఉన్నావన్న తలంపే అమోఘం,
ఏదైనా బాధ అయితే అమ్మ ఉందనే ధైర్యం,
నీ దీవెన ఉండాలి అమ్మ అనునిత్యం,
ఎక్కడో నీవు ఉన్నావన్న మాట మాత్రం సత్యం.