Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జ్ఞానం మూలాధారం

[డా. మైలవరం చంద్ర శేఖర్ రచించిన ‘జ్ఞానం మూలాధారం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]

రగతి గదిలో
గురువుల పాఠాలు
విద్యార్థుల బంగారు
భవితకు మార్గదర్శకాలు

పుస్తకాలతో బోధనకై
గురువుల తంటాలు
విద్యార్థుల గైర్హాజరు
వేధించును గురువుల
హృదయాలు

కాలానుక్రమ పరీక్షలతో
విద్యార్థులు తలమునకలు
వాటి మూల్యాంకనంతో
గురువుల తర్జనభర్జనలు

అనునిత్యం గురువులు
ఆర్జించే జ్ఞానం విద్యార్థుల
భవితకు మూలాధారం

Exit mobile version