Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గ్లోబల్ వల

[శ్రీ ఆవుల వెంకటరమణ రచించిన ‘గ్లోబల్ వల’ అనే కవితని అందిస్తున్నాము.]

భూత భవిష్యత్తు వర్తమానాలుగా
కాలాన్ని క్షణాల కింద తెగ
నరుక్కుంటూ ముందుకెళ్తున్నాం.
రామాయణాది ఇతిహాసాల నుంచి
మధ్యయుగాల మీదుగా
వర్తమానంలో కడుగుపెట్టాం.
ఆకాశవాణి దూరదర్శన్‌ల దగ్గర మొదలెట్టి
ఆండ్రాయిడ్, ఏఐ దాకా వచ్చాం.
ఇది నిరంతర పరిణామశీల ప్రక్రియ..
వాడెవడో ఖండాల కవతలివాడు
గోమూత్రానికి పేటెంట్ పొందుతాడు.
వేప, తంగేడు ఆకులను తీసుకెళ్లి
ధన్వంతరి, చరకుల్ని పక్కనపెట్టి
వాడి ఫార్ములాను మన కమ్ముతాడు
భారతీయ సాంస్కృతిక సంప్రదాయాన్ని
చాప చుట్టి కార్పొరేట్ కల్చర్‌ని రుద్దుతాడు
వాడిసిరిన మాయాజాలానికి చిక్కుకొని
గిలగిలా కొట్టుకుంటున్నాం.
వెనక్కి చూసుకోలేము
ముందుకు సాగలేము.
ఇప్పుడు మన పరిస్థితి
అడకత్తెరలో పోక చెక్క..!

Exit mobile version