Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గెలవడానికి పోరాడాలి

[డా. బాలాజీ దీక్షితులు పి.వి. రచించిన ‘గెలవడానికి పోరాడాలి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

మోసపూరిత
మనషులు మన
చుట్టూ వుండటం
బలవంతమైన బంధం లాంటిది

కక్షపూరిత
మనసులు మన
ప్రక్కన ఉండటం
పక్కలో బల్లెం లాంటిది

నవ్వుతూ ఏడ్చే వాళ్ళు..
ఏడుస్తూ నవ్వే వాళ్ళు
చాలా మంది ఉంటారు..

వీళ్ళు బ్రతుకు
ఈడవడానికి
అలవాటు పడిన వాళ్ళు..

గెలవడానికి పోరాడేవాడు
ఒక్కడే వుంటాడు

Exit mobile version