Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గతిశీలత

[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘గతిశీలత’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ష్టమైనది ఏది చిక్కలేదు
కానీ చిక్కిన దాన్నే
చిత్రంగా రచించుకొని
పూర్వపు ఇష్టాన్ని ప్రక్కనపెట్టి
వైవిధ్యంగా ఒదిగుంటున్న

ఆశించినది ఏది అందలేదు
కానీ అందిన దాన్నే
అందంగా వర్ణించుకొని
ఇదివరకటి ఆశను వదిలిపెట్టి
విలక్షణంగా కలగంటున్న

కోరుకున్నది ఏది పొందలేదు
కాని పొందిన దాన్నే
పొంకంగా దక్కించుకొని
గతములోని కోరికను త్యజించి
సరిక్రొత్తగా బ్రతుకుతున్న

రాసుకున్నది ఏది జరుగలేదు
కానీ జరిగిన దాన్నే
జనశ్రుతిగా గుర్తించుకొని
అక్కరకురాని రాతను చెరిపేసి
నవీన విద్యతో జీవిస్తున్న

అంశనీయమైంది ఏది ప్రాప్తిలేదు
కానీ ప్రాప్తించిన దాన్నే
ప్రాణంగా భావించుకొని
సారంలేని అంశాన్ని దూరంపెట్టి
గతిశీలతకై కదులుతున్న

Exit mobile version