Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గంగా తీర విద్యా విహారం-4

[శ్రీ యన్. వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘గంగా తీర విద్యా విహారం-4’ అనే వేదాంత కథ అందిస్తున్నాము.]

రోజు తెల్లవారు ఝామున 4.30 కే తయారై భోజనశాలకు వచ్చేసాము. టీ కాఫీ లు అయ్యాక గంగాధరేశ్వరుని దేవళం వెనుక గంగా ప్రవాహానికి అభిముఖంగా వున్న యోగా హాల్ కు వచ్చేసాం. మా అందరి దగ్గరా యోగా మాట్స్ వున్నాయి. అప్పటికే యోగా టీచర్ జపాన్ దేశస్తురాలు మిస్ యూరికో సిద్ధంగా వుంది. మమ్మల్ని సుఖాసనంలో కూర్చోమని చెప్పింది. ప్రార్థన మొదలుపెట్టింది.

“యోగేన చిత్తస్య పాదేన వాచా
మలం శరీరస్య చ వైద్య కేన
యోపకరోతం ప్రవరం మునీనం
పతంజలిం ప్రాంజలిరానాతోస్మి”

“స్థిర సుఖం ఆసనం. ఇట్ ఈస్ ఏన్ ఆఫొరిజం ఆఫ్ మహర్షి పతంజలి. బీయింగ్ ఏన్ ఆఫొరిజం, ఇట్ సర్వ్ యాస్ ఏ పాయింటర్ ఇన్ యోగా అండ్ మెడిటేషన్ యాస్ వెల్. వుయ్ హోల్డ్ ఆన్ టూ దట్ స్టేట్‌మెంట్ అండ్ వుయ్ ఆర్ ఇన్‌స్పైర్డ్ బై ది త్రీ వర్డ్స్. స్థిర ఈస్ అబౌట్ ది బాడీ. సుఖం ఈస్ అబౌట్ ది మైండ్. ది ఆసనం ఈస్ అబౌట్ యువర్ సెల్ఫ్ (స్వరూపం). దస్ ది సూత్రా ప్రెసెంట్స్ వివేక అండ్ డిస్క్రిమినేషన్. ది త్రీ డైమెన్షన్స్ – బాడీ, మైండ్ అండ్ యువర్ సెల్ఫ్ అర్ క్లియర్లీ అండర్‌స్టూడ్. ఇట్ ఈస్ నాట్ నాలెడ్జి, బట్ అండర్‌స్టాండింగ్. యు షుడ్ నో (know) వన్ థింగ్. ఇఫ్ యువర్ బాడీ డూ యోగా దెన్ యువర్ మైండ్ కెన్ డు మెడిటేషన్ వెల్! మైండ్ ఇట్!!”

ఇక్కడ ఎవరు ఎవరితోనైనా ఇంగ్లీష్ లేదా సంస్కతంలో మాత్రమే మాట్లాడతారు! ఇంట్రడక్షన్ పూర్తయ్యింది. క్లాసు మొదలైంది. అందరూ చాలా బాగా ఫాలో అవుతున్నారు నేనూ, సువర్ణా తప్ప. మా కోసం రకరకాల అడ్జస్ట్‌మెంట్స్ చేసింది, శవాశనము తప్ప ఏమీ తెలియని నియమాలేమి పాటించని మా శరీరాలు సహకరించ లేదు. మా కోసం రెండు కుర్చీలు వేయించి చెప్పింది “యూ బోత్ సిట్ ఆన్ ది చైర్స్ అండ్ అబ్సర్వ్ ఫర్ టుడే. ఫ్రమ్ టుమారో ఐ టేక్ స్పెషల్ సెషన్ ఫర్ యూ!”

ఆ రోజుకు గమనించమని చెప్పింది. గమనించడం మా ధ్యాన పద్ధతిగా మార్చుకోమనే సూచన మాకు స్ఫురించింది ఆమె మాటల్లో! క్లాసు పూర్తయ్యింది అందరూ మాట్స్ సర్దుకుంటున్నారు. నేను దైర్యం చేసి అడిగాను.

“మేడం! నో డౌట్ అవర్ బాడీస్ డోంట్ సపోర్ట్ యోగా. వై డోంట్ యూ గివ్ ఎగ్జెంప్షన్ టూ అజ్ ఫ్రమ్ యోగా క్లాస్?”

“నో.. నో.. ది ఆశ్రమం ఈస్ పేయింగ్ మీ టూ టీచ్ యూ ఆల్. ఐ విల్ షేప్ యూ వెల్ సూటబుల్ టూ యోగ వితిన్ ఏ ఫ్యూ డేస్. ఇట్ ఈస్ ఏ ఛాలెంజ్ టు మీ. బట్ వన్ థింగ్ యూ బోత్ కం ఎట్ 4-00 ఎఎమ్ ఫ్రమ్ టుమారో! ఓకే బై! హావ్ ఏ నైస్ డే!” అంది యురికో. అందరూ కుటీరాల వైపు సాగిపోయాము.

***

బ్రేక్‌ఫాస్ట్ తర్వాత 15 నిమిషాలు ముందుగానే 8-15 నిమిషాలకే క్లాసురూమ్‌కు వెళ్ళాము. స్వామి తత్త్వవిదానంద భతృహరి వైరాగ్య శతకం క్లాస్. స్వామీజీ సరిగ్గా రెండు నిముషాల ముందు క్లాసుకు వచ్చారు. ప్రార్థన శ్లోకం చెప్పి చిన్న అనౌన్స్‌మెంట్ చేశారు.

“ఎవరికైనా ఎప్పుడైనా, క్లాసు మధ్యలోనైనా బోరు కొట్టి పాఠం విసుగు అనిపిస్తే, ఎలాగైతే మార్కెట్లో ఒక షాప్ లోకి పొరబాటున వచ్చాము అని భావిస్తే, మనకు కావాల్సిన షాపు లోకి వెళ్ళిపోతామో అలా, మీరు బయటకు నిర్మొహమాటంగా వెళ్లిపోవచ్చు. గంగా తీరంలో బోల్డంత కాలక్షేపం వుంటుంది” అన్నారు. చిన్నగా నవ్వుకున్నాము. “ఈ వైరాగ్య శతకం త్యాగం, విరక్తి, జీవితం యొక్క నశ్వరత పై శ్లోకాల సమాహారం. జీవితం లోని సుఖాలు తాత్కాలికమైనవి. వాటిని విడిచి శాశ్వత ఆనందాన్ని పొందడానికి ఆధ్యాత్మిక మార్గంలో పయనించమని బోధిస్తాయి. శ్లోకం అందాము.” అన్నారు.

“చూడోత్తంసిత చారు చంద్రకలికా చంచచ్ఛిఖా భాస్వరో
లీలా దగ్ధ విలోల కామ శలభః శ్రేయో దశాగ్రే స్ఫురన్‌
అంతః స్ఫూర్జదపార మోహ తిమిర ప్రాగ్భారముచ్చాటయన్‌
శ్చేతః సద్మని యోగినాం విజయతే జ్ఞాన ప్రదీపో హరః!!”

శ్లోకం చదివి చాలా బాగా అరగంట సేపు విశ్లేషించారు. మిగిలిన అరగంటా ప్రశ్నలు జవాబులు కార్యక్రమం.

“అందరూ ఆత్మ స్వరూపులే గదా, అటువంటప్పుడు పేదవాడు, ధనవంతుడు అనే భేదం ఎందుకు?” అడిగాను.

“అనుమానం లేకుండా అందరూ ఆత్మ స్వరూపులే! కానీ, ఏమీ లేని వాడు, ఎవరూ లేనివాడు దేవుడికి దగ్గరవుతాడు. అన్నీ, అందరూ వున్నవాడు సంసారి అవుతాడు.” చెప్పారు.

“పాప పుణ్యములు ఎక్కడ ఉంటాయి?” సువర్ణ ప్రశ్న

“పాప పుణ్యములు ఆత్మ చైతన్యంలో వుండవు. మనసులో ఉంటాయి.” చెప్పారు.

“జనకుడిని మహర్షి అని ఎందుకంటారు? అతను సంసారి కదా?” సువర్ణ ప్రశ్న.

చిన్నగా నవ్వారు స్వామి.

“మీరు అడిగిన జనకుడు మిథిలకు చక్రవర్తి. సీతకు తండ్రి. అతను జనకుల పరంపరలో 49వ జనకుడు. జనకులలో సంసారులూ వున్నారు, మహర్షులు వున్నారు. మీరు అడిగింది ఎన్నో జనకుడి గురించి అమ్మా?” అడిగారు.

సువర్ణ దగ్గర జవాబు లేక తడబడింది.

“ఓకే! మీరడిగింది అష్టావక్ర గీత లోని జనకుడు అయ్యుంటాడు. అతనే ఒక సందర్భంలో – పట్టుకోవాల్సింది గానీ, విడిచి పెట్టాల్సింది గానీ వున్నవాడు సంసారి. నా దగ్గర ఆ రెండూ లేవు కాబట్టి నాలో నేను నిల్చి ఉండగలుగుతున్నాను – అంటాడు. ఆ సందర్భంలో మంచి శ్లోకం కూడా వుంది. ఈ వివరణతో మీ డౌట్ తీరింది అనుకోవచ్చా?” అన్నారు స్వామీజీ. తల వూపింది సువర్ణ.

“అకించునుడు అంటే ఎవరు?” అండ్రియా బర్రెరియో ప్రశ్న.

“ఒంటరి, తనకంటూ ఎవరు, ఏమీ లేనివాడు” చెప్పారు.

“నేను ఆత్మను గదా నాకు పుణ్య, పాపములు అంటావా?” దిమిత్రి ప్రశ్న.

“నీవు ఒక పని చేస్తున్నపుడు నీ దేహంతో చేస్తున్నాను అని అనుకుంటావు. అప్పుడు నీవు కర్తవు అవుతావు. ఆత్మ మాత్రం కర్త కాదు, భోక్త కూడా కాదు. పాప పుణ్యములు కర్తకే గాని ఆత్మకు కాదు” చెప్పారు.

“ధ్యానం అంటే ఏమిటి, ఎలా చెయ్యాలి? దానికి ఫలం ఏమిటి?” కత్రిన్ కుబ్బే ప్రశ్న.

“ధ్యానం చేసేది కాదు. అది క్రియ కాదు. దానికి ఫలం ఉండదు. ధ్యానానికి ధ్యానమే ఫలం. ఏకాగ్రతయే ధ్యానం. శబ్దాన్ని గానీ, వస్తువును గానీ గమనిస్తే అదే ధ్యానం. పక్షి కూత, చినుకుల సవ్వడి ఏకాగ్రతతో వింటే అదే ధ్యానం. అంతెందుకు నడిచేటప్పుడు నడక గురించీ, వంట చేసేటప్పుడు వంట గురించే ఆలోచిస్తే ఆ నడక, వంటా కూడా ధ్యానమే!” వివరించారు స్వామీజీ.

“తయారైన భోజనం ఫలితమేగా?” తిరిగి అడిగింది కత్రిన్.

“చూడమ్మా! తోటలో మామిడిచెట్టు సకాలంలో పూస్తుంది కాస్తుంది. ఆ కాయలు పక్వానికి వస్తాయి. వాటిని అనేకమైన జీవులు భుజిస్తాయి. కానీ ఆ చెట్టు తాను ఒక కర్మ చేస్తున్నానని కాని ఆ కాపుకు తానే కర్తనని కానీ భావించదు. ఇప్పుడు నీకు అర్థమైందనుకుంటాను. నేను ఆకాశం గురించి మాట్లాడుతుంటే మీరు నేల మీదే ఉంటానంటే ఎలా? మన మనసును శుద్ధంగా ఉంచుకొని, అంతా ఆత్మ స్వరూపంగా భావన చెయ్యాలి” చెప్పారు.

“సద్గురువుని ఎలా గుర్తించాలి?” జున్ ఇషోబే.

“సద్గురువు బయట ఉండడు, లోపల ఉంటాడు. అదే ఆత్మ! బయట డాక్టరు వున్నట్టే నీ లోపల ఒక డాక్టర్ ఉంటాడు. బయట వంటవాడు వున్నట్టే లోపల వండేవాడు ఉంటాడు. బయటి వారికంటే లోపలివారు చాలా తెలిసిన నేర్పరులు!” చెప్పారు స్వామీజీ.

“ఏది శాశ్వతము, మరేది ఆశాశ్వతము?” తపన్ ప్రశ్న.

“నీ శరీరంతో సహా అన్నీ కాలంలో మార్పు చెందేవే! అలా కాకుండా కాలంలో మార్పు చెందనిది శాశ్వతం. చెందేది అశాశ్వతం. శాశ్వతమైంది ఒక్క ఆత్మ మాత్రమే! అది నీ స్వరూపం! చూడబడనిది, తెల్సుకోవాల్సినది!”

“నా ఆత్మ ఎక్కడుంది?” జ్ఞానానంద ప్రశ్న.

“నీ ఆత్మ నీ దేహంలో వుంది కానీ నీ దేహం ప్రస్తుతం ఋషీకేశ్‍లో వుంది. రేపు ఎక్కడుంటుందో తెలియదు. జాగ్రత్, స్వప్న, సుషుప్తిలు మారిపోతుంటాయి. అందులోని ‘తెలివి’ శాశ్వతం! మనిషి తాను ఏది కాదో అదే తాను అనుకుంటాడు. తనకు ఏది తెలియదో అది తనకు తెలియదనికూడా తెలియదు. అదే అజ్ఞానం.” స్వామి.

“పురాణాలను నమ్మవచ్చా? తత్త్వాన్ని తెలుసుకోవడం ఎలా?” రవీంద్ర కౌల్ ప్రశ్న.

“ఏది నిత్యమో అదే సత్యం, విష్ణు పురాణానికి ప్రతి క్రియగా 15వ శతాబ్దంలో శివ పురాణం వచ్చింది. ఇప్పటికీ ఏదో ఒక పురాణం ‘సంతోషిమాత’ పురాణంలా వస్తూనే వున్నాయి. ఖండబలం, కలంబలం వుంటే చాలు ఏదో పురాణం వెలువడుతునే ఉంటాయి కొత్త కొత్త దేవుళ్ళలా! ఇక అజ్ఞాన విక్షేపములను తొలగించుకొని స్వరూపాన్ని తెలుసుకోవాలి. అదే సంస్కారం అంటే! కాలికి పెట్టుకొనే బంగారు నగ, మెడ లో పెట్టుకొనే నగ ఒక్కటే అని గ్రహించాలి. అదే తత్త్వాన్ని తెలుసుకోవడం.” చెప్పారు స్వామి.

“వేదాంత శాస్త్రం చదువుకొని, ఒక ఆశ్రమాన్ని స్థాపించి ఆ పీఠానికి అధిపతిగా వుంటే ఆత్మ జ్ఞానం తెలుస్తుందా?” అడిగాను. నవ్వారు స్వామి.

“మీరు చాలా కాలం నుండి ఆశ్రమాల్లోనే వున్నారు కదా? అక్కడి సన్యాసుల్లో గానీ, పీఠాధిపతులకు గానీ కులం లేదని, బంధుప్రీతి లేదని మీరు గ్రహించారా?” ఎదురు ప్రశ్న వేశారు స్వామి.

“లేదు. సంసారుల కంటే వారికి అవి ఎక్కువ. నెపోటిజం ప్రాతిపదిక మీదే ఆశ్రమాలు నడుస్తున్నాయి” చెప్పాను.

“సో.. నౌ ఏ డేస్ స్పిరిట్యువల్ అథారిటీ ఈస్ యాస్ సేమ్ యాస్ ఫైనాన్సియల్ అథారిటీ. ఎంత వరకూ నిన్ను నీవు ఒక ఆశ్రమ సన్యాసిగా, పీఠాధిపతిగా నమ్ముతుంటావో అంత వరకూ నీకు సత్యం తెలియదు.” చెప్పారు స్వామి.

“కైండ్లీ డిఫైన్ జ్ఞాన -భక్తి – శరణాగతి” డామియేన్ క్లర్క్ ప్రశ్న.

“అండర్‌స్టాండింగ్ విత్ లవ్ ఈస్ జ్ఞాన. లవ్ విత్ అండర్‌స్టాండింగ్ ఈస్ భక్తి. ది ట్రాన్స్‌ఫర్డ్ కాన్సస్‌నెస్ బ్లోసమ్స్ యాస్ శరణాగతి. దేర్ ఈస్ ప్రాగ్రెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ శరణాగతి” చెప్పారు స్వామి.

“కైండ్లీ ఎక్స్‌ప్లెయిన్ ఆల్ ది స్టేజస్ ఆఫ్ మెడిటేషన్” అడిగాడు మార్టిన్.

“మెడిటేషన్ ఈస్ నాట్ ఏ ప్రాసెస్ లైక్ హఠయోగ. ఇట్ ఈస్ ఏ హాపెనింగ్. మెడిటేషన్ ఈస్ నెయిథెర్ ఏన్ ఎస్కేప్ ఫ్రమ్ లైఫ్ నార్ ఏన్ ఎస్కేప్ ఫ్రమ్ ది వరల్డ్. ఐ అండర్‌స్టాండ్ మై సెల్ఫ్ జస్ట్ బై లుకింగ్ ఏట్ మై సెల్ఫ్. ఐ హావ్ టూ అండర్‌స్టాండ్ మై సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టూ బికమ్ ఫ్రీ ఫ్రమ్ సారోస్ అండ్ ఫియర్స్. వెన్ వన్ ఈస్ ఒన్స్ ఓన్ అథారిటీ లిబరేట్స్, వేర్ యాస్ ఔట్‌సోర్సింగ్ ది అథారిటీ కరప్ట్స్. మెడిటేషన్ ఈస్ నాట్ ఏన్ ఎఫర్ట్. స్పాంటేనియస్. ఎఫర్ట్ లీడ్స్ టూ కాన్‌ఫ్లిక్ట్, నాట్ అండర్‌స్టాండింగ్. మెడిటేషన్ ఈస్ నాట్ ఏన్ ఎస్కేప్ ఫ్రమ్ ది వరల్డ్. యూ నెవెర్ సక్సీడ్ వెన్ యూ ట్రై టూ ఎస్కేప్. ఇఫ్ యూ మానిప్యులేట్ బ్రెత్, యూ అర్ ఏ డూయర్. ఇఫ్ యూ అర్ అవేర్ వితౌట్ మానిప్యులేషన్, యూ అర్ ది విట్నెస్! ప్లెషర్ అండ్ పెయిన్ ఆర్ మియర్లీ స్టేట్స్ ఆఫ్ ది మైండ్ దట్ హ్యాపెన్స్ బై హ్యాబిట్. వితౌట్ నోయింగ్ మై సెల్ఫ్, దేర్ ఈస్ నో బేసిస్ ఫర్ థాట్ ఆర్ యాక్షన్. ఫాలోయింగ్ ఆఫ్ థాట్ ఇంటూ అవేర్నెస్ ఈస్ మెడిటేషన్! ఫాలోయింగ్ ఆఫ్ థాట్ ఇంటూ అటెన్షన్ ఈస్ మెడిటేషన్! రిలాక్స్ అటెన్షన్, రిలాక్స్ అవేర్నెస్ ఈస్ మెడిటేషన్! ది క్వయిట్ మైండ్ ఈస్ ది బ్రిడ్జి టూ ది ఇన్ఫినిట్. ధేర్ ఈస్ నథింగ్ టు బి డన్ టు రీచ్ ది ట్రూత్!

లుకింగ్ ఏట్ మైసెల్ఫ్ ఈస్ ఏ మిరకల్ బికాజ్ యాస్ ఐ లుక్ ఏట్ మై సెల్ఫ్, దివరల్డ్ వానిషెస్! యాస్ ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్, ఐ రిమైన్ అలర్ట్ ఎఫర్ట్ లెస్లే. ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్ ‘ఆత్మనైన ఆత్మానం పస్యేత్’. వెన్ ది మైండ్ ఈస్ క్వయిట్, పెర్ఫెక్టులీ స్టిల్ ది వేకింగ్ స్టేట్ ఈస్ నో మోర్. ది క్వయిట్ ఆఫ్ ది మైండ్ ఈస్ బ్రిడ్జి టు ది . ధేర్ ఈస్ నథింగ్ టు బి డన్ టు రీచ్ ది ట్రూత్!!” చెప్పారు స్వామి.

“మోక్షం మరణించాక సిద్ధిస్తుందా?” సచిత్ అడిగాడు.

“ఒక మతాన్ని నమ్ముకుంటే అలా అనే చెబుతుంది. అజ్ఞానం వల్ల మరణం తర్వాత మోక్షం అనే భావం కలిగింది. బీయింగ్ వర్సెస్ బికమింగ్ ఈస్ ది కాన్‌ఫ్లిక్ట్. మనం ఎప్పుడు ఎక్కడ ఏమై వున్నామో అదే సుఖం, అదే మోక్షం!” చెప్పారు స్వామి.

“మనిషి యోగా ఎందుకు అభ్యసించాలి?” కత్రిన్ కుబ్బే.

“మనిషి తన మార్గంలో అడ్డంకులు లేకుండా అదిగమించడానికి యోగా అభ్యసించాలి. కర్మను (పూజ) తగ్గించుకొని అయినా యోగా చేయాలి. చెట్టు కాయ కాసి పెరిగి పండు అయ్యేవరకు యోగా – పండిన పండు చెట్టు నుండి రాలడం ఈస్ జ్ఞానం. యోగా ఈస్ ప్రాసెస్ అండ్ జ్ఞానం ఈస్ ఇన్‌స్టింక్ట్!”

“పూవు పూసేది భగవంతుని సేవకా? స్త్రీ శిరోజాలంకారానికా?” అండ్రియా బర్రెరియో ప్రశ్న.

“పూవు ఏ ఒక్కరి కోసం వికసించదు. వికసించడం దాని స్వభావం. నీ బుద్ధి ప్రేరేపించిన ప్రకారం నీ శిరోజాలలో అలంకరిస్తావో భగవంతుడికి సమర్పిస్తావో నీ ఇష్టం!” స్వామి.

“ఒక ఘటన జరిగి ఒక మనిషి చనిపోతే అది సుఖ హేతువా? దుఃఖ హేతువా?” యూలియా సెంక్విచ్.

“ఒక ఘటన సుఖ దుఃఖ ములను ఇవ్వదు. మన స్పందనే ముఖ్యం. సుఖం అనుకుంటే సుఖం దుఃఖం అనుకుంటే దుఃఖం. సుఖ దుఃఖ ములను అజ్ఞానంతో మనసు నిర్మాణం చేస్తుంది. జ్ఞానులకు వేదము, మోదము వుండవు.” వివరించారు స్వామీజీ

“నేను చేసే క్రియే నా స్వరూపమా?” తపన్ ప్రశ్న.

“స్వరూపం అంటే ఎప్పడూ చేసే పని మాత్రం కాదు. నెక్లెస్ పని మెడను అలంకరించడమే. కానీ.. దాని స్వరూపం మాత్రం బంగారమే!” స్వామీజీ.

“మహాత్ములు భోగములను (luxuries) భోగించకూడదా?” జ్ఞానానంద ప్రశ్న.

“మహాత్ములు కూడా భోగములను అనుభవిస్తారు కానీ వాటి కోసం ఆరాటపడరు! మహాత్ములకు ఆనందం సాధారణంగా ప్రపంచ వస్తువుల నుండి కాకుండా ఆత్మ స్వరూపం నుండి కలుగుతుంది. ఎలాగైనా సరే భోగములు అనుభవించాలనుకొనేవారు ‘పామరులు’. న్యాయంగా భోగములు అనుభవిచాలను కొనేవారు ‘విషయి’. ఒక లక్ష్యం కోసం భోగములు దూరంగా పెట్టేవారు ‘జిజ్ఞాసువులు’. ఓకే! క్లాస్ సమయం పూర్తయ్యింది. రేపు కలుద్దాము.” అన్నారు స్వామి.

క్రింద భోజనశాలలో బెల్ కొట్టారు టీ కోసం.

***

ఆ రోజు నుండీ స్వామి పరమార్థానంద వారి క్యాంపు మొదలు. పది రోజులంటుంది. శ్రీ రామ గీత చెబుతారు. చాలా మంచి స్వామి. తమిళనాడు నుండి నూట యాభై మంది వరకూ వచ్చారు. విదేశాల నుండి నూట యాభై మంది వచ్చారు. ఆశ్రమం లోని రూమ్స్ సరిపోక పక్క ఆశ్రమాలైన కోవిలూరు వేదాంత మఠం, అవధూత అఖాడ, స్వతంత్రానంద ఆశ్రమాలలోని రూములు కూడా నిండిపోయాయి. ఉదయం పది గంటల నుండి ఒక క్లాసు జరుగుతుంది. 11 గంటలనుండి 12 వరకూ స్వామి సచ్చిదానంద వారి సంస్కృత సంభాషణం క్లాస్ జరుగుతుంది. మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలనుండి ఐదు గంటల వరకూ ఇవే క్లాసులు కొనసాగుతాయి.

మాకు రెగ్యులర్ క్లాసులు కాన్సిల్ చేసి ఈ క్లాసులకు హాజరయ్యే ఏర్పాట్లు జరిగాయి. ఒక్క స్వామి తత్త్వవిదానంద క్లాసు మాత్రం జరుగుతుంది. వరద వచ్చినా, తుఫాన్ వచ్చినా, అమావాస్య అయినా, పౌర్ణమి అయినా స్వామి తత్త్వవిదానంద ఋషికేశ్‌లో వుంటే క్లాసు జరిగి తీరుతుంది! ఆ రోజు క్లాసులన్నీ పూర్తయ్యాక అందరం గంగా తీర విహారం బయలుదేరాము.

రాధా ఘాట్ వద్ద మొదలైంది మా విహారం. పక్కనే జ్ఞాన కర్తార్ ఆశ్రమంలో సాయంత్రం బండారాకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేతి జిలేబిల వాసన మా ముక్కుపుటాలకు సోకింది. స్వామి పరమార్ధానంద శ్రీ రామ గీతలో చెప్పిన మాటలు “మీరు విన్నదే శబ్దం, చూసిందే దృశ్యం. వాసన చూసిందే గంధం!” గుర్తొచ్చాయి. ఆ పక్కనే ఈశ్వర్ ఆశ్రమం వారు ప్రదర్శన నిమిత్తం కట్టి ఉంచిన రెండు గోవులు చూడముచ్చటగా వున్నాయి. వారికి హరిద్వార్‌లో ఐదు వేల గోవులతో గోశాల ఉందట! దాని తర్వాతదే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి మెయిన్ క్యాంపస్. శ్రీశ్రీ రవిశంకర్ వారి రికార్డెడ్ గైడెడ్ మెడిటేషన్ శ్రావ్యంగా వినిపిస్తుంది. పక్కనే పోలీస్ బాబా ఆశ్రమం. త్వరలో పత్రీజీ ప్రారంభించబోయే పిరమిడ్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. పది అడుగులు ముందుకేసిన మాకు స్వామి నారాయణ ఆశ్రమ వేద పాఠశాల నుండి వేదఘోష వినిపిస్తుంది. ఆశ్రమ గుడి నుండి భాగవత పారాయణం శ్రావ్యంగా వినిపిస్తుంది. ఎదురుగా గంగా తీరంలో సాయంత్రం గంగా ఆరతికి సిద్ధం చేస్తున్నారు.

గంగలో కొంతమంది వేద పాఠశాల బ్రహ్మచారులు ఈత కొడుతున్నారు. ఎదురుగా ఎన్ని జరుగుతున్నా తనకేమి పట్టనట్టు గంగ ప్రవహిస్తూనే వుంది. నిజంగా ఈ గంగా ప్రవాహాన్ని గమనించడం స్వామి తత్త్వవిదానంద చెప్పినట్టు ధ్యానములలో ఉత్తమమైనది. ఆ ప్రవాహంలో కొన్ని సార్లు సుగంధ భరిత పుష్పాలు వుంటున్నాయి, కొన్నిసార్లు దుర్గందభరిత మలినాలు వుంటున్నాయి. కానీ గంగా ప్రవాహం దేనికీ చలించని మహాత్ముని మనసులా ముందుకు వెళుతూనే వుంది మోదం, క్లేదం లేకుండా!

“గంగ లోని ఒకే నీటితో రెండు సార్లు స్నానం చేయలేరు” అన్న స్వామీజీ మాటల్లో నిజం తేటతెల్లం అవుతుంది ఆ ప్రవాహాన్ని గమనిస్తుంటే! ఈ క్షణం మనం చూసిన నీరు మరుక్షణం చాలా ముందుకు సాగిపోతుంది. ఈ గమనించడాన్ని ధ్యాన పద్ధతిగా మార్చుకోవాలని అందరం ఆ క్షణంలో నిర్ణయించుకొన్నాము.

చీకటి పడుతుంది. గంగా హారతికి సమయం కావడంతో వడివడిగా నడుచుకుంటూ వెనక్కి గంగాధరేశ్వరుని సన్నిధి చేరుకున్నాము.

*స్వస్తి *

Exit mobile version