Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘గణతంత్ర మొగ్గలు’ – పుస్తకావిష్కరణ వార్త

ప్రముఖ కవి, రచయిత డా. భీంపల్లి శ్రీకాంత్ రచించిన ‘గణతంత్ర మొగ్గలు’ పుస్తకాన్ని మహబూబ్ నగర్ జిల్లా విద్యాశాఖాధికారి ఎ. ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు.

ఫిబ్రవరి 6 న జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డి.ఇ.ఓ. ఎ.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి డెబ్బైఐదేళ్లు నిండిన సందర్భంగా ఈ పుస్తకాన్ని రచించడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎ.ఎం.ఓ దుంకుడు శ్రీనివాస్, సి.ఎం.ఓ. బాలు యాదవ్ లు పాల్గొన్నారు.

Exit mobile version