[సౌనిధి గారు రచించిన ‘గాలిపటం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
ఎగిరే ఎగిరే ఓ గాలిపటమా
నీ పయనం ఎటువైపో తెలుపుమా
దారమే నీ సాయమా
దూరమే కొనసాగుమా
గాలులే నీ దారులా
సాగిపో విను విహారిలా
రంగులే అద్దావే
వయ్యారమే జతచేసావే
చిట్టి చేతులే విడిచావే
తేనె సొగసులతో ఎగిసావే
వెండి మబ్బుల్లో తేలావే
నీలి కన్నులనే దోచావే
చిన్ని గుండెల్లో నిండావే..