మట్టి నుంచి వచ్చాయి
ముద్దు ముద్దుగా ఉంటాయి
సున్నితంగా ఉంటాయి
అందమైన బొమ్మలవి
గాజు బొమ్మలు.
భద్రంగా చూసుకో
చేయి జారిపోయిందా
కింద పడి పగులుతాయి.
మనుషులు కూడా అంతేగా
మట్టి నుండే వస్తారు
బంధాల వలలో ఉంటారు
వల, ఆవల కొస్తే
పగలకుండా పట్టుకో.
పగిలిన గాజు బొమ్మలు
రగిలిన మనుషుల మనసులు
మళ్ళీ మట్టిలోనే కలుస్తాయి
జరభద్రంగా చూసుకో
మనుషులనే గాజు బొమ్మలని.
భావుకుడు, కవి శంకరప్రసాద్. ఇప్పుడిప్పుడే తన కవితలతో, కథలతో సాహిత్య ప్రపంచంలోకి అడుగిడుతున్నాడు.