“ఏమి చేస్తా వుండావు పా”
“కనిపిస్తా లేదా? ఎత్తేది పట్టేది చేస్తా వుండా”
“ఏలట్ల చేస్తా వుండావు”
“నా ఇష్టము. నేను చేస్తా వుండ”
“నీ ఇష్టమని నువ్వు చేస్తా పోతే ఇంగ ఈడ దేవుడు ఏమి చేసేది?”
“ఈడ దేవున్ని ఏమిటికి తెచ్చి దూరస్తా వుండావు”
“ఏమిటి కంటే ఆయప్పే నిన్ని బూమ్మింద దూర్సింది”
“అవునా?”
“ఊ పా”
“నువ్వు చూస్తివా?”
“లేదు”
“మరి ఎట్ల చెప్పతావుండావు?”
“అంద్రు చెప్పతా వుండారని నేను చెప్పితిని”
“సరే! నిన్ని ఒగ మాట అడగనా?”
“అడుగు”
“నిజంగా ఈ బూమ్మింద నన్ని ఆ దేవుడే దూర్చితే నేను ఆయప్ప చూసుకొంటాము. నువ్వు నోరు మూసుకొని పో”
“ఆ… ఆ…”
***
ఎత్తేది = ఎత్తడం
పట్టేది = పట్టుకోవడం
6 Comments
r.krishnamurthy
Ettedi Pattedi chala bagundi sir super sir Mr.Vasanth garu Basthi, hosur
Arun
Super story sir
Madhu
Nice
bhagyamma
Super story sir
K.muniraju
ఎత్తేది పెట్టేది కత బలే ఉంది . డాక్టర్ అగరం వసంత్ గారికి నిండా మెప్పించారు.
Manasa