సంచికలో తాజాగా

Related Articles

14 Comments

  1. 1

    SaiShivani Kodati

    నిజం చెప్పాలంటే నేను ఆ పరిస్థితుల నడుమ నిలిచి, అక్కడ జరుగుతున్న సంభాషణలు వింటున్నట్టుగా, ఆ పాత్రల ప్రవర్తను చూస్తున్నట్టుగా ఉంది. ఉత్తరంలోని విషయాలను విడమర్చి చెప్పే విధానం, జాహ్నవి ఆలోచనా లోతుల విశ్లేషణ, టీనేజ్ అమ్మాయిల భావోద్వేగాల వివరణ, జాహ్నవి ఆలోచనలలోని సంఘర్షణ, జానూ-నీలి సంభాషణ, లెటర్స్ వెతికిన జాను చుట్టూ అలుముకున్న నిశబ్దపు వివరం మరియు ఆనందాన్ని వర్ణించిన తీరు, తాతగారితో నిర్ధారించి చెప్పిన మాటలోని నిలకడత్వం, తాతగారి ఫోన్ సన్నివేశంలో జాహ్నవి పాటించిన సభ్యత ఇవన్నీ దేనికవిగా పోటాపోటీగా మనసుకు హత్తకున్నాయి. చివర్లో రచయిత్రి గారు సంధించిన ప్రశ్నలు క్షణక్షణం ఉత్కంఠరేపుతున్నాయి.

  2. 2

    Abhigna

    కంప్యూటర్ తెర పైన కనిపించిన రూపాన్ని చూసి జాహ్నవి పెదవుల నుండి వచ్చి రాన్నటు నాన్న అని రావడం చాలా అద్భుతంగా ఉంది నా కళ్ళ ఎదుట జరిగినట్లుగా అనిపించింది.. తాతగారు ఏమని నిర్ణయం తీసుకుంటారో , సమ్మర్ హాలిడేస్ లో జాహ్నవి వాళ్ళ నాన్నగారిని కలుస్తుందా అని , ఒకవేళ కలిస్తే మాలతి ఎలా రియాక్ట్ అవుతుంది అని, జాహ్నవి వాళ్ళ నాన్నగారు కూడా ,జాహ్నవి ఎలా ఊహించుకుంటుందో అలానే ఉంటారా , అలానే స్పందిస్తారా అని ఇలాంటి ప్రశ్నలతో తరువాతి భాగం చదవాలని చాలా ఆసక్తికరంగా ఉంది.. తరువాతి భాగం కోసం ఎదురుచూస్తున్నాను

  3. 3

    Jogeswararao Pallempati

    భలే సస్పెన్స్ లో ముగించారమ్మా! మీరు సినిమా సంభాషణలు చక్కగా రాయగలరనిపించింది! తాతా మనవరాలి సంభాషణ కూల్ గా క్లుప్తంగా ఎంత సహజంగా అనిపించాయో? ఎలా మొదలై ఎటు దారి తీస్తుందోననుకున్నా! జాహ్నవిలోని లీడర్షిప్ క్వాలిటీ యొక్క పరిపక్వతని మీ సంభాషణల్లో కనిపించింది!
    She’ll Succeed in uniting her Parents!
    Wish her all the Best!

  4. 4

    Durga

    Yes, madam can write ✍️ for Movies. సందేశమే కాదు, సంభాషణా, సన్నివేశ వివరణా కూడా అంత బాగున్నాయి సినిమాకు సరిపడేలా.

    నిశ్శబ్దపు నిశ్శబ్ద పరుగు.‌ అదీ వర్ణన అంటే. అక్షరం పై పట్టు అంటే.

    జానూ, cool. యువత ఆలోచనా సరళి నే కాదు, వారి పదాలనూ ౘక్కగా, ఆ యువత శైలికి అనుగుణంగా వ్రాశారు.

    ఇక కథా, కథనం, ముగింపు గుఱించి అందఱూ చెప్పారు.

    “అమ్ములు”… ఇదీ నన్ను కట్టి పడేసిన విషయం. ఆ పిలుపొక మాధుర్యం అయితే, “ఎప్పటిలా జానూ” అని కాకుండా సందర్భానుసారం పిలవటం.

    ఇది కదా అసలు కుటుంబం అంటే! అనిపించింది.

    అలాగే మాలతి పాత్ర చిత్రణ కూడా. ఇవేవీ పట్టకుండా కేవలం కూతురు కోసమే తపించి పోతోంది. మనసంతా ఆ పాత్ర పై సానుభూతి నిండి పోయింది.

  5. 5

    Vaidehi

    పై రెండు అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. స్టోరీ ముందు ముందు ఇంకా డెప్త్ లో కీ వెళుతుందేమో ననిపిస్తుంది. ఓ మంచి ఎమోషనల్ మరియు కుటుంబసినిమా కథ లా ఉంది.జాహ్నవి మనో సంఘర్షణ ఎక్కడా లిమిట్స్ మించిన ఫీలింగ్ రాకుండా బాగా వ్రాసారు.ఆ వయసు అమ్మాయి ల కు తగినట్టుగా ఆ పాత్ర ను మలచడం లో కృతకృత్యులయ్యారు.
    😊🌹🌹👍..

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది భారతీ లక్ష్మి పెద్దింటి గారి వ్యాఖ్య: *నాలుగో భాగం చదివాను శారదగారు చాల బాగుంది. కధ నడిపే శైలి బాగుంది అంశం ఇంకా బాగుంది.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎన్. ప్రేమా ప్రసాద్ గారి వ్యాఖ్య: *కథ పాకాన పడుతున్నది. ఏమవుతుందో అనే ఉత్సుకత పెరిగింది. బాగుంది శారదా.👌👌👌👌.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తేజస్వి పార్వతీ రామారావు గారి వ్యాఖ్య: *జాహ్నవి మనసుని చదువుతుంటే నిజంగా చాలా మంచి ఫీల్ కలిగింది. కథలో కాకుండా నిజంగా ఒక వ్యక్తి తన మనసులోని ఆలోచనలను వ్యక్తపరుస్తున్నట్టు ఉంది ఆ లెటర్ 😍. అందుకే నేను వినడం, మాట్లాడడం కన్నా చదవడం, వ్రాయడం ఇష్టపడుతాను 😍 *

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దోర్నాల విదుర్ రెడ్డి గారి వ్యాఖ్య:
    *లోతైన మానవీయ కథనం. గొప్పగా వ్రాసారు మేడమ్.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చిట్టె సిద్ధ లలిత గారి వ్యాఖ్య: *కథ ఆసక్తికరంగా సాగుతోంది. నాన్నను చూడాలనే జాహ్నవి ఆకాంక్ష సమంజసమైనదే. సున్నితమైన అంశంతో సునిశితమైన భావాలతో శారద గారు కథను నడిపించే తీరు అద్భుతం.💐👏*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వల్లూరి పార్థసారథి గారి వ్యాఖ్య: *చక్కని రచనా శైలికి పాఠకులు కథలో లీనమైపోవడం తథ్యం! అలాగే జాహ్నవి టీనేజ్‌లో ఉన్నా పరిణతి చెందిన వ్యక్తిగా తెలపడం బహుశా ఆ పాత్రకు ముందు ముందు జరిగే విషయాలకు ముఖ్య భూమిక కావచ్చు అని నా అవగాహన. కథ చక్కగా నడుస్తోంది! వచ్చే పోస్టుకు ఎదురు చూస్తున్నాం మేడమ్!*

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శుభామహి మాచెర్ల గారి వ్యాఖ్య: *పరిస్థితుల ప్రభావం చిన్న పిల్లలపై ఎంత పరిణతి తెస్తుందో జాహ్నవి పాత్ర ద్వారా బాగా తెలియజేస్తున్నారు అమ్మా.*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రాధాలక్ష్మి యడవల్లి గారి వ్యాఖ్య: *చాలా బాగుంది 👌👌 చాలా చక్కగా రాశారు శారద గారు. జాహ్నవి పాత్ర చాలా బాగుంది అభినందనలు శారద గారు 😊🌹🌹*

  14. 14

    Vasumathi

    చాలా బాగుంది. తరువాత ఏం జరుగుతుందో అని కుతూహలం కలుగుతుంది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!