~ కన్నీటి చెలమలుగా విచ్చుకుంటున్న దెందుకు ఆవిరి మాటల మబ్బుల దారి
కథలనేవో మోస్తూ తరలివస్తున్న దెందుకు కొంచెమైనా చల్ల పరచని వాన గాలి
అప్పటినుంచీ ఇప్పటిదాకా కరగక నిలుచున్న దెందుకు నీడ నివ్వలేని అనేక తరాల మాటల ఆకాశం
గారడీ మనుషుల మాటలు చెప్పుకు నవ్వుకు పోతున్న దెందుకు అమాయకపు పిట్టల గుంపు
కన్ను తెరిచి మూస్తున్న కాలపు కంటి రెప్పల మధ్య కునుకు తీయలేక పోతోందెందుకు మసక పట్టిన మనిషి కన్ను
ఇంకా ఏం కావాలని కోరికలను కంటికి కట్టి వూగుతోంది రాదారి నదిపై వూగిసలాడే ఎరల చేయి
ఏ రాగానికై వెతుకుతోంది మకిలి పట్టిన నాగరికతల అమానవత్వపు మనిషి పాట
విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. పాశ్చాత్య రచయితలను పరిచయం చేస్తూ ‘ పడమటి రాగం’ ఆనే వ్యాస సంపుటిని, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. ‘ ద స్పారో అండ్ ద కానన్’ అనే ఆంగ్ల కవితల సంపుటిని 2021 లో ప్రచురించిన డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ‘పైనాపిల్ జామ్’ (2023) ఈయన మొదటి కథా సంపుటి. డా. కోగంటి విజయబాబు ప్రస్తుతం కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు. drvijaykoganti2@gmail.com 8309596606
గుడ్, బాగుంది, నీడ నివ్వలేని ఆకాశం..
Nice one… 💐 💐 💐
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
యువభారతి వారి ‘పగలే వెన్నెల’ – పరిచయం
వారెవ్వా!-49
మంటోస్తాన్ (మంటో ప్రపంచం)
కాల గమనం
భయం – భయం
మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-21
శ్రీ సీతారామ కథాసుధ-4
ఇది నా కలం-24 : మరీచిక కళ్యాణి
విస్తృతమైన వస్తువైవిధ్యం సింహప్రసాద్ సొత్తు
శ్రీపర్వతం-29
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®