ప౹౹ కన్నీటికేమి తెలుసు
ఎదలోని బాధ నలుసు
దుఃఖానికేమి తెలుసు
పగిలిన గుండె మనసు ౹౹ప౹౹
చ౹౹ దూరానే ఉంటావు నువ్వు
గుండెనే గుచ్చుతుంటావు
జ్ఞాపకంగా మిగిలిపోయావు
గాయమై బాధ పెడుతుంటావు
ప్రియా నిన్ను మరిచేదెలా
మదిలోనే నిండిపో ఇలా
ప్రియా నిన్ను మరిచేదెలా
నా మదిలోనే నిండిపో ఇలా ౹౹ప౹౹
చ౹౹ కళ్ళల్లోనే మెదులుతుంటావు
కలవరమే పెడుతూ ఉంటావు
నవ్వులతోనే కవ్విస్తుంటావు
వాలుచూపులతో ఊరిస్తుంటావు
ప్రియా నిన్ను చేరేదెలా
మనసులో నిలిచిపో ఇలా
ప్రియా నిన్ను చేరేదెలా
నా మనసులో నిలిచిపో ఇలా ౹౹ప౹౹
చ౹౹ ఆశలే రోజూ రేపుతుంటావు
కన్నీళ్లలోనే మెరుస్తుంటావు
కలలోనే కలవరపెడుతుంటావు
కన్పించి మాయమవుతుంటావు
ప్రియా నిన్ను చేరేదెలా
చిరునవ్వుతో రా ఇలా
ప్రియా నిన్ను చేరేదెలా
ప్రేమతో రావే ఇలా ౹౹ప౹౹
1 Comments
m.k.kumar
bagundi.