[డా. మైలవరం చంద్ర శేఖర్ రచించిన ‘ఎల్లవేళలా ఉత్తీర్ణుడిగా’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
బ్రతుకు జీవిది
లక్ష్యాలు సమాజానివి
ఎల్లవేళలా నిలవాలి
ఉత్తీర్ణుడుగా లేకపోతే
తలెత్తుకొనివ్వరుగా
ఈ ప్రామాణికాలే
మనుషుల్లో మనసుల్లో
భయానికి మూలాలు
నేర్పరు ఎవ్వరూ ఎన్నడూ
చీకటిని పోగొట్టే వెలుగులా
భయాన్ని తరిమే సూత్రాలు
అందుకని బోధించాలి భయాన్ని
అధిగమించే పాఠ్యాంశాలు
అందివ్వాలి నిర్భయంతో
జీవించే స్ఫూర్తి మంత్రాలు
సామాజిక అంచనాల
చేదనే కాకూడదు లక్ష్యం
కావాలి స్వేచ్ఛాయుత
శుద్ధమైన ఆలోచనలు
ప్రయత్న పూర్వకంగా
లక్ష్యాలను సాధిస్తూ
భయం వెనక అడుగు వేయక
నమ్మకంతో ముందుకు సాగు
డా. మైలవరం చంద్ర శేఖర్
అసోసియేట్ ప్రొఫెసర్
ప్రోగ్రాం హెడ్ – బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్
హైదరాబాద్