డా. బి నాగశేషు రచించిన ‘ఏకుదారం’ పుస్తకావిష్కరణ సభ తిరుపతి లోని ముత్యాలరెడ్డి పల్లి, యూత్ హాస్టల్ లో తేది: 24.05.2025 శనివారం సాయంత్రం 5.00 గంటలకు జరుగుతుంది.
శ్రీ తోట వెంకటేశ్వర్లు (అధ్యక్షులు, ఈ తరం కవితా వేదిక) సభకు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. డా॥ వి.ఆర్. రాసాని (కథ, నవల, నాటక రచయిత) ముఖ్య అతిథిగా విచ్చేస్తారు.
డా॥ వై. సుభాషిణి (అసిస్టెంట్ ప్రొఫెసర్, శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం), శ్రీ బొమ్మిశెట్టి రమేష్ (రచయిత, చరిత్రకారుడు, మైదుకూరు) ఆత్మీయ అతిథులుగా హాజరవుతారు.
ఆచార్య పి.సి. వెంకటేశ్వర్లు (డైరెక్టర్, ప్రాచ్య పరిశోధన సంస్థ, తిరుపతి) పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.
ఆర్.సి. కృష్ణస్వామి రాజు (రచయిత, తిరుపతి) తొలి ప్రతిని స్వీకరిస్తారు.
అనంతరం డా. కె. శ్రీనివాసులు రెడ్డి (తెలుగు అధ్యాపకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పీలేరు) పుస్తకాన్ని సమీక్షిస్తారు.
సభానంతరం అల్పాహారం ఉంటుంది. మరిన్ని వివరాలకు 9393662821.