పూర్వం విజయసేతు అనే రాజు ఉండేవాడు. అతని రాజ్యం ‘ప్రశాంతపురి’. తన రాజ్యంలో ప్రజలు ఏ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉండేటట్లు చూసుకునే వాడు విజయసేతు. విజయసేతుకి తన రాజ్యమన్నా… రాజ్యంలోని ప్రజాలన్నా పంచ ప్రాణాలు. తన రాజ్య పౌరుల్లో ఏ ఒక్కరికి చీమ కుట్టినాసరే సహించలేక పోయేవాడు.
యుద్ధ విద్యల్లో విశ్వవిఖ్యాతిగాంచిన పరాయిదేశ రాజ కుటుంబ యువకులు పదిమంది ఒకసారి సాయుధులై తన రాజ్యంలోని ఒక చిట్టడవిలోని జింకపిల్లను వెంటాడి వేటాడి చంపడానికి ప్రయత్నించగా ఆ యువరాజులతో విజయసేతు ఒక్కడే వీరోచితంగా పోరాడి వాళ్ళను ఒంటి చేత్తో ఓడించి తన రాజ్యం నుండి తరిమివేసాడు, అంతటి వీరాధివీరుడు విజయసేతు.
విజయసేతు ప్రశాంతపురిపై ‘విశ్వవినాశకుడు’ అన్న అప్రతిష్ఠ పొందిన ‘కఠోరకంటక’ అనే రారాజు కన్ను పడింది. నేరుగా యుద్దానికి దిగితే విజయసేతుని ఓడించలేనని రాత్రికి రాత్రి తన మందీమార్భాలాలచే ప్రశాంతపురి రాజ్యాన్ని చుట్టుముట్టించి ఒక విషపూరిత రసాయనిక వాయువుని ప్రయోగించాడు ఆ రారాజు.
అనుకోని ఈ విపత్కర పరిస్థితికి ప్రశాంతపురి పౌరులు ఆందోళన చెంది అశాంతికి గురయ్యారు. పౌరుషానికి, పట్టుదలకు, వీరత్వానికి, భుజబలానికి పేరు ప్రఖ్యాతులుగాంచిన విజయసేతు ఈ విషపూరిత విపత్తుని తెచ్చిన మూర్ఖ శత్రువులను సాయుధ యుద్ధవిద్యలో ఓడించి రాజ్యానికి విజయం తెస్తాడని అందరూ అనుకున్నారు, కానీ విజయసేతు అలా చెయ్యలేదు.
రాజ్యప్రజలకు విజ్ఞప్తి చేస్తూ”కొన్నాళ్ళు అందరూ ఇళ్ళల్లోనే వుండిపొండి, మన సైన్యం మీకు నిత్యావసరవస్తు సేవలు అందిస్తుంది,కొన్నాళ్ళకు సమస్య దానంతట అదే పరిస్కారం అవుతుంది” అన్నాడు. ప్రజలు అతని మాటను తూచా తప్పక పాటించారు. కొన్నాళ్ళకు శత్రుసైన్యం విసిగవేసారి తిరిగి ఇంటిముఖం పట్టింది. ఎక్కడ తగ్గాలో ఎలా నెగ్గాలో తెలిసిన వాడేరా మొనగాడు, భుజబలంలోనూ బుద్ధిబలంలోనూ మన విజయసేతే మొనగాడని ప్రజలు మెచ్చుకున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఆచార్యా… అహర్నిశలు పాటుపడ్డావా…
లోకల్ క్లాసిక్స్ – 10: ఏకపక్ష వాస్తవికత!
‘దేశభక్తి కథలు’ పుస్తకం ముందుమాట
జీవన రమణీయం-112
సంచిక – పద ప్రతిభ – 21
దోమార్జునీయం
రామం భజే శ్యామలం-40
మహాభారత కథలు-53: అప్సరసలకి శాప విమోచనం కలిగించిన అర్జునుడు
పదసంచిక-97
ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్-2
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®