Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఈ సాయంత్రపు వేళ

అందమైన సాయంత్రపు అనుభూతిని ఆహ్లాదంగా వర్ణిస్తున్నారు డా. విజయ్ కోగంటిఈ సాయంత్రపు వేళ” కవితలో.

తిరిగి తిరిగి ఒడ్డుకు చేరి
కాసింత విరామానికై
ఎడాపెడగా నిలిచిన
ఆలోచనల పడవలు

ఒడ్డున చేరిన గవ్వలకు
లోతైన అనుభవాలను
చేరవేస్తూ
మనసు అలలు

అప్పుడే అడవి అంతా చుట్టి
పూల పరిమళాన్ని
పొదువుకొచ్చిన
వాన నవ్వుల గాలి పరవశం

ఈ సాయంసంధ్యలో
యేటి వడ్డున నీడలమై
నీవు,నేను,
మన ఆలోచనల అడుగులు

Exit mobile version