[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘ఏదో ఏదో’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
జీవితమంటే
నిండు కుండ కాదు
ఎప్పుడు చూసిన
చెంబుడు నీళ్ళు
వెలితితో ఉన్నట్లే
ఏదో అసహనం
మళ్ళిన వయసంటే
కుళ్ళిన పండు కాదు
ఎంత ఎదిగిన
చెట్టు మూలాలను
గుర్తుపెట్టుకున్నట్లే
ఏదో జ్ఞాపకం
అభ్యంతరమంటే
వ్యతిరేకత కాదు
ఎంత దాచిన
దాగని శేషప్రశ్న
గుప్తంగా ఉన్నట్లే
ఏదో రహస్యం
