‘సంచిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు వందనాలు. సంచికను అభిమానిస్తున్న వారందరికి ధన్యవాదాలు.
విశిష్టమైన, విభిన్నమైన రచనలను పాఠకులకు అందించాలని ‘సంచిక’ నిరంతరం ప్రయత్నిస్తోంది.
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ‘ఉగాది’ (2025) పర్వదినం సందర్భంగా ‘సంచిక’ ప్రకటించిన పద్యకావ్యాలు, వచనకవితల పోటీ గడువు ముగిసింది. ‘సంచిక-డాక్టర్ అమృతలత’ల తరఫున పద్య కావ్య రచన పోటీని మాన్యులు, పండితులు శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారు, ‘సంచిక- సాహితీ ప్రచురణ’ల తరఫున వచన కవిత పోటీని శ్రీ ఆచార్య ఫణీంద్ర గారు నిర్వహించారు. ఈ పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఫలితాలు ఉగాది పండుగ రోజున వెల్లడవుతాయి.
‘సంచిక’లో ప్రచురితమయ్యే రచనలు విభిన్న దృక్కోణాలకు, భిన్న స్వరాలకు వేదికలవుతున్నాయి. పాఠకుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.
ఆంగ్ల విభాగంలో ఈ నెల – రెండు కవితలను అందిస్తున్నాము. ఎప్పటిలానే సీరియల్, కాలమ్స్, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, పిల్లల కథలు, పరిశోధనా రచన, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 మార్చి 2025 సంచిక.
1 మార్చి 2025 నాటి ‘సంచిక మాసపత్రిక’లోని రచనలు:
ధారావాహిక:
- ఆరోహణ-8 – ఆంగ్ల మూలం: సాధనా శంకర్, అనువాదం: కొల్లూరి సోమ శంకర్
కాలమ్స్:
- శ్రీ మహా భారతంలో మంచి కథలు-19 – కుంతి
- వందే గురు పరంపరామ్ – 7 – చివుకుల శ్రీలక్ష్మి
పరిశోధనా గ్రంథం:
- శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!-11 – పాణ్యం దత్తశర్మ
గళ్ళ నుడికట్టు:
- సంచిక-పదప్రహేళిక- మార్చి 2025 – టి. రామలింగయ్య
వ్యాసాలు:
- అమ్మ కడుపు చల్లగా – 60 – ఆర్. లక్ష్మి
- జీవన నైపుణ్యాలని మప్పే జె. పి. వైద్య ‘షికారీ కథలు’ – అవధానుల మణిబాబు
భక్తి:
- గురుభక్తిని చాటిన దీపకుడు – భువనేశ్వరి మారేపల్లి
కథలు:
- దారిలో పడ్డాడు.. – గంగాధర్ వడ్లమన్నాటి
- ఏ జన్మలోని ఋణమో..! – యన్. వి. శాంతి రెడ్డి
- ది సిగ్నల్ – డా. మధు చిత్తర్వు
- పాట్లు – పి.యస్.యమ్. లక్ష్మి
కవితలు:
- సినీ సంగీతం – శ్రీధర్ చౌడారపు
- ఆట నీదే! – డా. విజయ్ కోగంటి
- మనసులో రిమోటు – వారాల ఆనంద్
పుస్తకాలు:
- భావోద్వేగాలను అణచుకునే మనుషులు కోల్పోయే అనుభూతులను వెల్లడించే ‘ది రిమైన్స్ ఆఫ్ ది డే’ – పుస్తక పరిచయం – పి. జ్యోతి
- చదివి దాచుకోదగ్గ పుస్తకం – ‘మార్పు’ వ్యాస సంకలనం – పుస్తక సమీక్ష – లింగమూర్తి సిలివేరు
బాలసంచిక:
- నీతిగా బతుకు – కంచనపల్లి వేంకటకృష్ణారావు
- మూడు పొడుపు కథలు – యలమర్తి అనూరాధ
~
English Section:
- Grass – Poem – T.S.S. Murty
- Bit by bit! – Poem – Samudrala Hariskrishna
~
సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.
సంపాదక బృందం.