‘సంచిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు నమస్కారాలు. సంచికను ఆదరిస్తున్న అందరికి కృతజ్ఞతలు.
‘సంచిక’లో ప్రచురితమవుతున్న రచనలు విభిన్న దృక్కోణాలకు, భిన్న స్వరాలకు వేదికలుగా నిలుస్తున్న విషయం పాఠకులకు తెలిసినదే.
విశిష్టమైన, విభిన్నమైన రచనలను పాఠకులకు అందించాలన్న లక్ష్యం దిశగా ‘సంచిక’ ప్రయాణం కొనసాగుతోంది.
శ్రీ రాయపెద్ది వివేకానంద్ తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సంచికతో కలిసి కథల పోటీ ప్రకటించారు. ఆ ప్రకటనని ఇక్కడ చూడవచ్చు. చివరి తేదీ 30 సెప్టెంబరు 2025. తమ తమ కథలను పంపి, పోటీలను విజయవంతం చేయవలసిందిగా రచయితలకు మనవి.
ఈ నెల నుంచి డా. బి. మల్లయా చారి గారి ‘తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – పరిశీలన’ అనే పరిశోధనా గ్రంథాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నవారిపై కొత్త వెలుగుని ప్రసరిస్తుందీ రచన.
అలాగే ఈ నెల నుంచి ‘సంచిక’ వారపత్రికలో శ్రీ పాణ్యం దత్తశర్మ గారి ‘గుండెతడి’ అనే నవలని ధారావాహికంగా అందించనున్నాము. మరిన్ని వివరాలు ఆదివారం వారపత్రికలో.
పాఠకుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.
ఆంగ్ల విభాగంలో ఈ నెల రెండు కవితలను అందిస్తున్నాము. ప్రముఖ సినీ గీత రచయిత, దర్శకుడు శ్రీ మనోహర్ అయ్యర్ గారి ఆంగ్ల ఇంటర్వ్యూని అందిస్తున్నాము. ఆంగ్లంలో రామలక్ష్మి బొడ్డపాటి చంద్రశేఖర్ గార్లు నిర్వహిస్తున్న ‘తెలుగు లిటరరీ ప్రొఫైల్స్’ ఫీచర్ లో ఈ నెల శ్రీ బలివాడ కాంతారావు గారి రచనలు, వ్యక్తిత్వం గురించిన వ్యాసం అందిస్తున్నాము.
ఎప్పటిలానే సీరియల్, కాలమ్స్, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, పిల్లల కథ, పరిశోధనా రచన, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 ఆగస్టు 2025 సంచిక.
అన్ని రచనల లింకులు ఒకే చోట లభించేలా, రచనల జాబితాను విడిగా ఇచ్చి, క్లికబుల్ లింక్స్ ఎనేబుల్ చేశాము. ఈ సౌలభ్యం పాఠకులకు అనువుగా ఉంటుందని మా విశ్వాసం.
‘సంచిక’పై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.
సంపాదక బృందం.