‘సంచిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు ప్రణామాలు. సంచికను ఆదరిస్తున్న అందరికి ధన్యవాదాలు.
విశిష్టమైన, విభిన్నమైన రచనలను పాఠకులకు అందించాలన్న ‘సంచిక’ కృషి కొనసాగుతోంది.
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ‘ఉగాది’ (2025) పర్వదినం సందర్భంగా ‘సంచిక’ ప్రకటించిన పద్యకావ్యాలు, వచనకవితల పోటీ ఫలితాలు వెలవడ్డాయి. ‘సంచిక-డాక్టర్ అమృతలత’ల తరఫున పద్య కావ్య రచన పోటీకి శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారు, ‘సంచిక- సాహితీ ప్రచురణ’ల తరఫున వచన కవిత పోటీకి శ్రీ ఆచార్య ఫణీంద్ర గారు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. బహుమతి నగదును విజేతలకు పంపడమైనది.
ఈ సందర్భంగా ‘సంచిక’ త్వరలో మరో పోటీని ప్రకటించనున్నది. వివరాలు రాబోయే సంచికలో.
విభిన్న దృక్కోణాలకు, భిన్న స్వరాలకు వేదికలయ్యే ‘సంచిక’ రచనలు చదువరులకు ఆసక్తి గొల్పుతున్నాయి. పాఠకుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.
ఆంగ్ల విభాగంలో ఈ నెల – రెండు కవితలను అందిస్తున్నాము. ఎప్పటిలానే సీరియల్, కాలమ్స్, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక పరియం, గళ్ళనుడి కట్టు, పిల్లల కథ, పరిశోధనా రచన, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 ఏప్రిల్ 2025 సంచిక.
1 ఏప్రిల్ 2025 నాటి ‘సంచిక మాసపత్రిక’లోని రచనలు:
సంభాషణం:
- డా. తుర్లపాటి రాజేశ్వరి అంతరంగ ఆవిష్కరణ – డా. ప్రసాద్ కె. ఎల్. వి.
ధారావాహిక:
- ఆరోహణ-9 – ఆంగ్ల మూలం: సాధనా శంకర్, అనువాదం: కొల్లూరి సోమ శంకర్
కాలమ్స్:
- రంగుల హేల 54: కాలం లొంగే ఘటమా! – అల్లూరి గౌరీ లక్ష్మి
- శ్రీ మహా భారతంలో మంచి కథలు-20 – కుంతి
- వందే గురు పరంపరామ్ – 8 – చివుకుల శ్రీలక్ష్మి
పరిశోధనా గ్రంథం:
- శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!-12 – పాణ్యం దత్తశర్మ
గళ్ళ నుడికట్టు:
- సంచిక-పదప్రహేళిక- ఏప్రిల్ 2025 – టి. రామలింగయ్య
వ్యాసాలు:
- అమ్మ కడుపు చల్లగా – 61 – ఆర్. లక్ష్మి
- జీవన నైపుణ్యాలని మప్పే జె. పి. వైద్య ‘షికారీ కథలు’ – అవధానుల మణిబాబు
కథలు:
- అపార్థం ప్రేమలు.. – గంగాధర్ వడ్లమన్నాటి
- ఏ జన్మలోని ఋణమో..!-2 – యన్. వి. శాంతి రెడ్డి
- క్వాంటమ్ దోపిడీ – డా. మధు చిత్తర్వు
- జీవనది (అనువాద కథ) – కన్నడ మూలం: పద్మిని నాగరాజు, అనువాదం: చందకచర్ల రమేశ బాబు
కవితలు:
- ఆ ప్రమద, ఓ ప్రమిద – శ్రీధర్ చౌడారపు
- నేనొక పాటను..! – గోపగాని రవీందర్
- నది పారిపోవడం లేదు – వారాల ఆనంద్
పుస్తకాలు:
- అందరికీ తెలియాల్సిన పుస్తకం – ‘గర్భసంచిని కాపాడుకుందాం సమాజాన్ని బలపరుద్దాం’ – పుస్తక పరిచయం – కొల్లూరి సోమ శంకర్
బాలసంచిక:
- బహుమతులు – కంచనపల్లి వేంకటకృష్ణారావు
అవీ ఇవీ:
- నీతిగా బతుకు – కంచనపల్లి వేంకటకృష్ణారావు
~
English Section:
- The Furnace of the Heart – Poem – Dr.T.Radhakrishnamacharyulu
- The Falling Leaf – Poem – Samudrala Harikrishna
~
సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.
సంపాదక బృందం.