అనంతంగా
కదిలే నీడలు
విశ్రమించని నీడలు
మరణ మృదంగమై వినిపిస్తూ
అదిగో
అప్పుడే
హృదయం ముక్కలై
విరిగిపడుతుంది
దుఃఖం నదిగా పొంగుతుంది
తాళలేక ఆనకట్ట వేయాలనుకుంటావు
కానీ
దుఃఖం
మరింత పొంగుతూ
కథలు కథలుగా
ఆవిష్కృతమవుతూ వుంటాయి
అందులో జీవితం
ఓ చేపపిల్ల ఈదుతూనే వుంటుంది.
లక్ష్మీ కందిమళ్ళ గారి నివాసం కర్నూలు. గృహిణి, కవయిత్రి, రచయిత్రి.
ప్రవృత్తి: కథలు కవితలు రాయడం.
ఇంత వరకు రాసిన కథలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి.
ఉగాది పురష్కారం 2019 కర్నూలు కలెక్టరు గారి చేతులమీదుగా అందినది.
మొదటి కవితా సంపుటి “రెప్పచాటు రాగం”.